శృంగారం అనేది బూతు పదం కాదు. మన పుట్టకకు అదే కారణం. అయితే.. కేవలం పిల్లలు కనడానికి మాత్రమే శృంగారం చేయాలా అంటే.. ఖచ్చితంగా కాదని నిపుణులు చెబుతున్నారు.
మనకు తెలీకుండానే.. అవతలి వ్యక్తిపై ప్రేమ పెరగడానికి ఇది కారణం అవుతుందట. అంతేకాకుండా.. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఈ సంగతి పక్కన పెడితే.. పెళ్లైన కొత్తలో ఉన్న ఆసక్తి తర్వాత తమకు శృంగారం విషయంలో ఉండటం లేదని కొందరు దంపతదులు వాపోతున్నారు. కొందరైతే.. చాలా సిల్లీ రీజన్స్ కారణంగా పూర్తిగా శృంగారానికి దూరమయ్యారు. పడకగదిలో తమ భార్యకీ, తమకు శారీరకంగా ఎలాంటి బంధం లేకుండా కొనసాగుతున్నామంటూ కొందరు పురుషులు ఓ సంస్థకుతెలియజేయగా.. అందుకు వారు చెప్పిన కారణాలు ఇలా ఉన్నాయి.
నా భార్యను తాకినప్పుడు... పెళ్లైన కొత్తలో కలిగిన ఫీలింగ్స్ ఇప్పుడు కలగడం లేదు.. నేను నా భార్యని తాకినా.. ఆమెకు కూడా అలానే అనిపిస్తుంది. అందుకే.. మేము శృంగారంలో పాల్గొనడమే మానేసాం. కలిసి ఉన్నా.. విడివిడిగా ఉంటున్నామని ఓ వ్యక్తి చెప్పడం విశేషం.
మరో వ్యక్తి.. తాము ఓ పాప పుట్టాక సెక్స్ కి పూర్తిగా దూరమయ్యామని చెప్పడం విశేషం. ఉదయం లేచిన దగ్గర నుంచి పాపను చూసుకోవడమే పనైపోతోంది. నిద్రపోవడానికి సమయం సరిపోవడం లేదు. అందుకే సెక్స్ ని దూరం పెట్టేశామని ఓ వ్యక్తి చెప్పాడు.
నా భార్యకు మా పెళ్లైన రెండో సంవత్సరం ఆపరేషన్ అయ్యింది. దాని తర్వాత మెడిసిన్స్ వాడటం వల్ల ఆమెకు శృంగారంపై ఆసక్తి తగ్గిపోయింది. దీంతో.. నేను కూడా ఆమెను బలవంత పెట్డడం లేదని మరో వ్యక్తి చెప్పడం గమనార్హం.
తన భర్తకి తనతో గొడవ జరిగినప్పుడు మాత్రమే తనతో శృంగారంలో పాల్గొంటాడని ఓ భార్య వాపోయింది. తన అందానికి ఆకర్షితుడై తనతో కాపురం చేయడని.. కేవలం గొడవను సద్దుమణిగించడానికి మాత్రమే సెక్స్ అడుగుతాడని.. ఈ విషయం తనను ఎంతగానో బాధపెడుతోందని.. అందుకే ఈ విషయంలో తాము దూరంగా ఉండటం మొదలుపెట్టామని వారు చెప్పడం విశేషం.
తన భర్తకి తనతో గొడవ జరిగినప్పుడు మాత్రమే తనతో శృంగారంలో పాల్గొంటాడని ఓ భార్య వాపోయింది. తన అందానికి ఆకర్షితుడై తనతో కాపురం చేయడని.. కేవలం గొడవను సద్దుమణిగించడానికి మాత్రమే సెక్స్ అడుగుతాడని.. ఈ విషయం తనను ఎంతగానో బాధపెడుతోందని.. అందుకే ఈ విషయంలో తాము దూరంగా ఉండటం మొదలుపెట్టామని వారు చెప్పడం విశేషం.
నా భార్య చాలా అందంగా ఉంటుంది. కానీ.. సెక్స్ విషయంలో ఆమె నన్ను సంతృప్తి పరచదు. అసలు సెక్స్ ని ఎంజాయ్ చేయదు. దీంతో.. నాకు కూడా సెక్స్ పై విరక్తి పుట్టింది. దీంతో.. నేను కూడా దూరంగా ఉండటం మొదలుపెట్టాను. అని మరో వ్యక్తి వాపోయాడు.
నా భర్త మంచివాడు.. పిల్లలను కూడా బాగా చూసుకుంటాడు. కానీ నాతో సమయం గడపడు. దీంతో.. నాకు నా భర్తపై ప్రేమ తగ్గిపోయింది. విడాకులు కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. సెక్స్ కి కూడా దూరమయ్యాం. అతను కూడా నన్ను అడగడు. ఎందుకంటే అతను ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. అని ఓ వివాహిత చెప్పడం విశేషం.