మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలా..? వీళ్లని ఫాలో అవ్వండి..!

First Published Jun 15, 2021, 10:12 AM IST

కొందరు ఆ బంధాన్ని సరిదిద్దుకొని సంతోషంగా సాగుతుంటే.. మరి కొందరు.. విడాకుల వైపు అడుగులు వేస్తున్నారు. కొందరు దంపతులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు

పెళ్లి అనేది ఓ క్లిష్టమైన సంస్థ. భార్యభర్తలు.. తమ భారాలు, బాధ్యతలు సమానంగా పంచుకోవాలి. అలా పంచుకోకపోతే.. వైవాహిక జీవితంలో సమస్యలు, వివాదాలు, విభేదాలు రావడం సహజం. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు వాటిని తట్టుకోవడంలో కొందరు దంపతులు స్ట్రాంగ్ గా నిలపడితే... మరికొందరు.. తడపడుతుంటారు.
undefined
కొందరు ఆ బంధాన్ని సరిదిద్దుకొని సంతోషంగా సాగుతుంటే.. మరి కొందరు.. విడాకుల వైపు అడుగులు వేస్తున్నారు. కొందరు దంపతులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే.. వైవాహిక బంధంలో.. మానసిక సమస్యలను ఎదుర్కొని నిలపడాలంటే ఏం చేయాలో.. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోన్నారో కొందరు దంపతులు వివరించారు.
undefined
‘‘నేను 35ఏళ్ల వయసులో నేను తీవ్రమైన ఆందోళన, నిరాశకు గురయ్యాను. ఈ విషయం గురించి తెలియకుండా ఉండేందుకు అందరికీ దూరంగా ఉండటం మొదలుపెట్టాను. ముఖ్యంగా నా భార్యకు దూరంగా ఉంటూ వచ్చాను. నా వల్ల నా భార్య ఇబ్బంది పడకూడదు అనుకున్నాను. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మానేశాను. కానీ.. నా పరిస్థితి ని నా భార్య అర్థంచేసుకొని నాకు అండగా నిలిచింది. తన ప్రేమ నా పై ప్రభావం చూపించింది. తన కారణంగానే నేను ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడ్డాను’’ అని ఓ వ్యక్తి వివరించాడు.
undefined
‘మీరు ఏదైనా తప్పు చేస్తే.. దానిని ధైర్యంగా మీ పార్ట్ నర్ ముందు ఒప్పుకోవాలి. లేదు.. మీరు కచ్చితంగా ఉండి.. మీరు చెప్పింది తప్పు కాదు అని మీకు అనిపిస్తే... దానిని మీ పార్ట్ నర్ కి చెప్పాల్సిన విధంగా చెప్పాలి. దంపతుల మధ్య ప్రతి విషయం చాలా క్లియర్ గా ఉండేలా చూసుకోవాలి. మొదట్లో నాకు, నా భర్తకు తరచూ గొడవలు జరిగేవి. కానీ.. తర్వాత నేను నా భర్తతో ప్రతిదానికీ వాదించడం మానేశాను. దీంతో.. మా మధ్య గొడవలు తగ్గిపోయాయి. ఆ గొడవలు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి అనే విషయాన్ని చర్చించుకునేవాళ్లం. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాం’ అని ఓ మహిళ తన అనుభవాన్ని వివరించింది.

‘ ప్రతి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. నేను, నా భర్త చర్చించుకునే నిర్ణయం తీసుకునేవాళ్లం. ఎలాంటి సందర్భంలో అయినా.. అబద్దాలు చెప్పకూడదని నేను, నా భర్త ముందుగానే ఒకరికొకరు మాట ఇచ్చుకున్నాం. ఇప్పటికీ దానినే ఫాలో అవుతున్నాం. దీని వల్ల మాకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటున్నాం’ అని మరో ఇల్లాల్లు పేర్కొంది.
undefined
‘ఒక జంట కలిసి ఉండటంలో వారి నేపథ్యం, సంస్కృతులు కీలక పాత్ర పోషిస్తాయి. దంపతుల మధ్య చిన్న చిన్న విభేధాలు రావడం కూడా చాలా సహజం. అయితే.. ఎంత గొడవ జరిగినా సంతోషంగా ఉండటానికి.. నేను, నా భార్య ఒకరి అభిప్రాయాలను, ఎంపికలను గౌరవిస్తాం. పొరపాట్లను ఎత్తి చూపించకుండా.. దానిని ఎలా సరిద్దుకోవాలో ప్రయత్నిస్తాం’ అంటూ ఓ వ్యక్తి చెప్పడం విశేషం.
undefined
click me!