అపరిచిత వ్యక్తితో భార్య శృంగారం.. కవలల్లో ఒకరికే తాను తండ్రినంటూ..

First Published | May 18, 2020, 1:14 PM IST

క్సియామెన్ నగరానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కవలలు జన్మించారు. వారిద్దరికీ కొంచెం కూడా పోలికలు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డీఎన్ఏ టెస్టుల్లోనూ ఇద్దరికీ తండ్రులు వేరే అని తేలడంతో సదరు మహిళను భర్త నిలదీశాడు.
 

చిన్న పిల్లలు అంటే ఎవరికైనా నచ్చేస్తారు. అందులోనూ కవలల పిల్లలు అంటే ఎవరైనా కొంచెం ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే.. చూడటానికి ఒకేలా ఉంటారు కాబట్టి. చాలా మంది కవల పిల్లలను చూసి ఎవరు ఎవరో కూడా గుర్తించలేరు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు పుట్టిన కవలల్లో ఒక బిడ్డకు తాను తండ్రిని కాదంటూ కోర్టుకి ఎక్కాడు.
ఓ మహిళ కూడా కవలలకు జన్మనిచ్చింది. కానీ వారిలో ఒక్కరే తన బిడ్డ అని.. మరో బిడ్డ తన బిడ్డ కాదని ఆమె భర్త ఆరోపించడం గమనార్హం. ఎందుకంటే. వాళ్లు పుట్టడానికి కవల పిల్లలే అయినా.. అస్సలు పోలికలే లేవట. ఇదే విషయంపై భార్యను నిలదీశాడు. కానీ ఆమె తనకు ఏ పాపం తెలీదు అని చెప్పింది.

డీఎన్ఏ పరీక్ష చేయగా.. అతను చెప్పినట్లు.. అందులో ఒక్క బిడ్డకు మాత్రమే అతను తండ్రి అని తేలింది. మరో బిడ్డ ఎలా పుట్టాడో అతనికి అర్థం కాలేదు. ఈ సంఘటన క్సియామెన్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
క్సియామెన్ నగరానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కవలలు జన్మించారు. వారిద్దరికీ కొంచెం కూడా పోలికలు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. డీఎన్ఏ టెస్టుల్లోనూ ఇద్దరికీ తండ్రులు వేరే అని తేలడంతో సదరు మహిళను భర్త నిలదీశాడు.
దీంతో.. ఆమె తాను తప్పు చేసినట్లు అంగీకరించింది. తాను ఓ వ్యక్తితో 'వన్ నైట్ స్టాండ్' (అపరిచితుడితో ఒక రాత్రి శృంగారం)లో పాల్గొనడం వల్ల అలా జరిగి ఉండవచ్చని పేర్కొంది. ఆమె సమాధానం విని భర్త షాకయ్యాడు.
తనకు ఎలాంటి అఫైర్లు లేవని చెప్పిన భార్య ఇలాంటి పని చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనకు కాని బిడ్డను తాను పెంచలేమంటూ చెప్పేశాడు. వేరే వ్యక్తికి పుట్టిన బిడ్డను పెంచనంటూ తేల్చేశాడు. తనకు పుట్టిన బిడ్డను మాత్రం కంటికి రెప్పాలా చూసుకుంటానని చెప్పాడు.
వేరే వ్యక్తితో శృంగారం మాట పక్కన పెడితే.. ఇద్దరు వ్యక్తుల వీర్యంతో కవలలు పుట్టడం ఎలా సాధ్యమో తెలియడం లేదని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.
ఈ ఘటనపై వైద్య నిపుణులు స్పందిస్తూ.. ఇది చాలా అరుదైన ఘటన అని తెలిపారు. వైద్య పరిభాషలో దీన్ని హెటెరోప్తెరనల్ సూపర్ఫెకండేషన్ అంటారన్నారు. మహిళ ఒకే రోజులో అండోత్పత్తికి ముందు లేదా తర్వాత వేర్వేరు వ్యక్తులతో శృంగారంలో పాల్గొన్నట్లయితే ఇలా జరుగుతుందన్నారు.
అప్పుడు ఉత్పత్తయ్యే రెండు అండాలు.. వేర్వేరు వీర్యాల్లో కణాలతో కలిస్తే వేర్వేరు డీఎన్ఏలతో కవలలు పుడతారని తెలిపారు. ప్రతి 13వేల జంటల్లో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుందన్నారు. ఇలాంటి ఘటనలు చైనాలో కొత్త కాదు.
2014లో యివు నగరానికి చెందిన ఓ వాణిజ్యవేత్తకు కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అతనికి పుట్టిన కవలల్లో ఒక బిడ్డ తన బిడ్డ కాదని తెలిసి అతను షాకయ్యాడు. అతని కనురెప్పలు, భార్య కనురెప్పలు ఒకేలా ఉంటాయని, రెండో బిడ్డ కనురెప్పలు తమ కంటే భిన్నంగా ఉన్నాయనే కారణంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా అసలు నిజం బయటపడింది.

Latest Videos

click me!