పురుషుల్లో మగతనం తగ్గడానికి కారణం ఇదే...

First Published Oct 6, 2020, 5:30 PM IST

మగవాళ్లలో కూడా మెనోపాజ్ ఉంటుందని మీకు తెలుసా? ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం దీన్ని ఆండ్రోపాజ్ అంటారు. నెల నెలా వచ్చే రుతుచక్రం వల్ల మహిళల్లో అనేక రకాల హార్మోనల్ చేంజెస్ వస్తాయి. దీనివల్ల మూడ్ స్వింగ్స్, శరీరంలో మార్పులు ఉంటాయి. 

మగవాళ్లలో కూడా మెనోపాజ్ ఉంటుందని మీకు తెలుసా? ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం దీన్ని ఆండ్రోపాజ్ అంటారు. నెల నెలా వచ్చే రుతుచక్రం వల్ల మహిళల్లో అనేక రకాల హార్మోనల్ చేంజెస్ వస్తాయి. దీనివల్ల మూడ్ స్వింగ్స్, శరీరంలో మార్పులు ఉంటాయి.
undefined
అయితే మగవాళ్లలోనూ హార్మోన్లలో మార్పులు వస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. హార్మోన్ల తేడావల్ల మహిళల శరీరంలోనే కాదు, పురుషుల శరీరంలోనూ మార్పులు వస్తాయి.
undefined
మహిళల్లో టీనేజ్ లో ప్రారంభమైన రుతుచక్రం ఓ నిర్ధిష్ట వయసుకు వచ్చేసరికి ఆగిపోతుంది. దీన్నే మెనోపాజ్ అంటారు. ఈ మెనోపాజ్ మహిళల్లో అనేక సమస్యలకు దారితీస్తుంది. ఊబకాయం, శరీరంలో వేడి ఆవిర్లు, విపరీతమైన మూడ్ స్వింగ్స్, కొంతమందిలో అయితే సూసైడల్ టెండెన్సీ కూడా ఉంటుంది.
undefined
అయితే ఈ పరిస్థితి ఒక్క మహిళల్లోనే కాదు పురుషుల్లోనూ కనిపిస్తుందంటున్నారు. 50యేల్ల తరువాత పురుషుల్లో ఈ హార్మోన్ల మార్పులు కనిపిస్తాయని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. అయితే ఇది స్త్రీలలో కంటే చాలా భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.
undefined
మగవాళ్లలో కనిపించే ఈ హార్మోనల్ చేంజెస్ ని ఆండ్రోపాట్ అంటారు. దీనివల్ల పురుషుల శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గిపోతుంది. ఇది పురుషుల్లో మగతనానికి అత్యంత ముఖ్యమైన హార్మోన్. పురుషుల్లో యుక్తవయసు మార్పులకు ఈ హార్మోనే ప్రధాన కారణం. మంచి లైంగిక సామర్థ్యానికీ మూలం ఈ హార్మోనే.
undefined
టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గి ఆండ్రోపాజ్ దశకు చేరుకున్నామని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. అనుకోకుండా ఊబకాయం వస్తుంటే ఇది ఆండ్రోపాజ్ లక్షణం కావచ్చు. ఎందుకంటే టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గినప్పుడు శరీరంలో కొవ్వు పరిమానం పెరుగుతుంది.
undefined
తరచూ అలసటగా ఉండడం, రాత్రి పూట సరిగా నిద్ర పట్టకపోవడం కూడా ఈ లక్షణాల్లో ఒకటేనని అధ్యయనకారులు చెబుతున్నారు. టెస్టోస్టిరాన్ తగ్గడంతో కార్టిసాల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన పెరుగుతాయి.
undefined
టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ పురుష పునరుత్పత్తి వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గడంతో, స్పెర్మ్ సంఖ్యను, స్పెర్మ్ మోటిలిటీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా మగతనం తగ్గుతుంది.
undefined
టెస్టోస్టెరాన్‌ తగ్గడం వల్ల జుట్టు రాలిపోయి బట్టతల వస్తుంది. రొమ్ముల్లో మార్పులు వస్తాయి. మగవాళ్లలో రొమ్ములు చదునుగా ఉండడానికి ఈ హార్మోనే కారణం. టెస్టోస్టిరాన్ తగ్గడం వల్ల పురుషుల్లో వక్షోజాలు ఏర్పడొచ్చు.
undefined
యాభైలకు చేరువలో ఉన్న పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి, అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.
undefined
click me!