ఓ యువకుడు ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నాడు. కాగా.. అలా చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. అయితే.. ఇలా ఎందుకు చేశావురా అని అడిగితే.. బల్లి వల్లే ఇలా చేశాను అని చెప్పాడట.
అయినా పోలీసులు అతని మాటలు నమ్మలేదు. కటకటాల వెనక్కి నెట్టారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
మలేషియాలో పెర్హింతియన్ ఐల్యాండ్స్‌లో ఓ యువకుడు (20) ఇద్దరు యువతులతో శృంగారం చేస్తుండగా పోలీసులు ఆ కాటేజీపై దాడి చేసి ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు.
అయితే పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా ఆ వ్యక్తి మాత్రం.. తన కాటేజీలో బల్లి ఉందని, బల్లి అంటే తనకు భయమని, అందుకనే ఆ ఇద్దరు యువతుల కాటేజీలో వారితో కలిసి పడుకున్నానని చెప్పి అతను బుకాయించబోయాడు.
కానీ పోలీసులు నమ్మలేదు. ఎందుకంటే ఆ ముగ్గురూ కలిసే రెండు కాటేజీలు బుక్ చేసుకున్నారు. కానీ ముగ్గురూ ఒకే గదిలో పడుకున్నారు.
దీనికి తోడు ఆ యువకుడు బల్లి కహానీ వినిపించాడు. అందుకనే పోలీసులు నమ్మలేదు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిచారు.
అయితే మలేషియాలో షరియా లా ప్రకారం.. వివాహం కాని స్త్రీ, పురుషులు ఎక్కడా, ఎలాంటి స్థితిలోనూ ఒకే ఇల్లు లేదా గదిలో అభ్యంతరకర, అనైతిక స్థితిలో ఉండరాదు.
అలా చేస్తే అక్కడ చట్ట ప్రకారం నేరం అవుతుంది. అందుకనే ఆ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు.. ఏది ఏమైనా.. ఈ విషయం కాస్తా ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది.