శృంగారంతో కరోనాకి చెక్..? సాధ్యమేనా?

First Published | Mar 9, 2020, 2:43 PM IST

కరోనా సోకితే.. చావు ఖాయమనే భావన  చాలా మందిలో నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా కూడా వారికి దూరంగా జరగడం లాంటివి చేస్తున్నారు. ఇదే ఫార్మూలాని కాపురంలోనూ అప్లై చేస్తుండటం గమనార్హం.
 

ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్( కోవిడ్-19). చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు భారత్ కి కూడా పాకింది. తాజాగా భారత్ లో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు భారత్ లో 40మందికి కరోనా లక్షణాలు కనిపించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ వైరస్ సోకిన వారు తుమ్మినా., దగ్గినా కూడా మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు దీనికి ప్రత్యేకంగా మందు అంటూ ఏదీ కనిపెట్టకపోయినా.. దానిని తగ్గించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ వైరస్ సోకిన తర్వాత మందు లేకపోయినా.. ముందు జాగ్రత్తగా రాకుండ మాత్రం చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

మనలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే... ఈ కరోనాకి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. అయితే... ఈ మధ్యకాలంలో చాలా మంది కరోనా భయంతో సెక్సువల్ లైఫ్ కి దూరమౌతున్నారట.
మీరు చదివింది నిజమే. కరోనా సోకితే.. చావు ఖాయమనే భావన చాలా మందిలో నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా కూడా వారికి దూరంగా జరగడం లాంటివి చేస్తున్నారు. ఇదే ఫార్మూలాని కాపురంలోనూ అప్లై చేస్తుండటం గమనార్హం.
కరోనా సోకిన వారిని టచ్ చేస్తే... వారికి కూడా సోకే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. దీంతో.. ముద్దులు కూడా పెట్టుకోకండి అని అధికారులు చెబుతున్నారు. అయితే... కొందరు నిపుణులు మాత్రం శృంగారం వల్ల కరోనా వైరస్ కి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు.
ఇప్పటి వరకు శృంగారం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని మనకు తెలిసిందే. కొన్ని నిమిషాలపాటు సాగే.. ఈ కామ క్రీడ.. ఆనందాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు.. మనిషిలో ఇమ్యునిటీ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది.
అంతేనా.. మనిషిలోని ఒత్తిడికి అసలైన మందు శృంగారమే అని నిపుణులు ఇప్పటికే చాలా సార్లు చెప్పారు.
తాజాగా... కరోనా వైరస్ రాకుండా ఉండానికి ఈ శృంగారం ఉపయోగపడుతుందంటున్నారు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల జలుబు అనేది దరి చేరకుండా ఉంటుంది.
వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే యువతీ యువకుల లాలాజలంలో పోరాడే యాంటీ బాడీలు పెద్ద మొత్తంలొ తయారౌతాయట. అవి ఎక్కువ మొత్తంలొ ఉంటే.. మన ఇమ్యునిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉన్నట్టే లెక్క. దీంతో కరోనా దరిచేరే అవకాశం తక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా.. జలుబు, తుమ్ముులు వంటి లక్షణాలనే మనం కరోనా వైరస్ సోకినట్లు గుర్తిస్తున్నారు. శృంగారంలో తరచూ పాల్గొంటే జలుబు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. కరోనా కి కూడా దూరంగా ఉండొచ్చు అనే వాదన వినపడుతోంది.
ఏదిఏమైనా కరోనా విషయంలో వ్యక్తిగత శుభ్రత పాటించడం ఉత్తమమం అనేది నిపుణులు వాదన. చేతులు శుభ్రంగా కడుక్కోవడం కచ్చితంగా చెయ్యాలని చెబుతున్నారు. నిజంగా శృంగారంతో కరోనా కి దూరంగా ఉండొచ్చని చెప్పలేం కానీ.. జలుబు వంటి జబ్బులు మాత్రం రాకుండా కాపాడుకోవచ్చు.

Latest Videos

click me!