శృంగారంలో చాలా మంది కి చాలా ఫాంటసీలు ఉంటాయి. అందులో.. సినీ తారలతో శృంగారంలో పాల్గొనాలని చాలా మందికి ఉంటుంది. పెళ్లికి ముందు కలలలో వాళ్లని ఊహించుకుంటూ గడిపేవాళ్లు చాలా మంది ఉంటారు.
undefined
కొందరైతే.. ఏకంగా పలానా హీరో లేదా హీరోయిన్ లా ఉండే వారిని మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. వారి గురించి గురించే ఆలోచిస్తుంటారు. చివరకు వారితో శృంగారం చేస్తున్నట్లు రోజూ కలలు కంటూ.. ఆ కలల్లోనే జీవిస్తుంటారు.
undefined
కొందరు పెళ్లి తర్వాత వాటిని అక్కడితో ముగించేస్తారు. కానీ.. కొందరు మాత్రం పెళ్లైనా తమ అభిమాన నటిని స్మరించడం మాత్రం మర్చిపోరు.
undefined
అది మనసులో పెట్టుకుంటే పర్లేదు..కానీ.. భార్యతో సంసారం చేస్తూ.. తమ అభిమాన తారల పేర్లను జపిస్తూ ఉంటారు. భర్తలు చేసే ఈ పనులతో చాలా మంది భార్యలు మండిపడుతున్నారు.
undefined
కాగా.. దీనిపై పలు పరిశోధనలు కూడా జరిగాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
undefined
సినీ తారలతో శృంగారాన్ని ఆస్వాదించినట్లు కలలు రావడానికి, ప్రత్యేకంగా శృంగార సంబంధ కలలు రావడానికి కారణాలు ఉన్నాయంట.
undefined
ఇలాంటి కలలపై కాలిఫోర్నియాకు చెందిన కొందరు నిపుణులు పరిశోధనలు జరిపారు. వారి పరిశోధనలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
undefined
జీవితంలో.. మనసుకు నచ్చిన వాళ్లు ఎవరూ లేని సమయంలోనే అలాంటి కలలు ఎక్కువగా వస్తాయంటున్నారు నిపుణులు. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికే వరకు అలాంటి కలలు వస్తునే ఉంటాయన్నారు.
undefined
ఒక్కసారి వాళ్ల జీవితంలో వారికి నచ్చిన వ్యక్తి లభిస్తే.. అలాంటి కలలకు పుల్ స్టాప్ పడతాయంటున్నారు నిపుణులు.
undefined
చాలా కొద్ది మంది మాత్రమే పెళ్లి తర్వాత కూడా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారని..దీంతో భార్యలు మండిపడుతున్నారని తెలుస్తోంది.
undefined
పబ్లిక్ ఫిగర్స్... ముఖ్యంగా అందం, ఆకర్షణీయంగా ఉండే హీరోయిన్లంటే చాలామంది పురుషులు ఇష్టపడుతుంటారు. ఈ ఇష్టాన్ని కొందరు అభిమానంగా మలచుకుంటే మరికొందరు ఆమెను ఇలా ఊహించుకుంటారు
undefined
ముఖ్యంగా అలాంటి స్టేటస్ ఉన్న హీరోయిన్లతో జీవితాన్ని పంచుకోవాలన్న తలంపులు మనసులో వేళ్లూనుకోవడం వల్లనే ఇలాంటి కలలు వస్తుంటాయి. వద్దనుకుంటే కలలు రాకుండా పోవు.
undefined
ఈ రకం కలలు రాకుండా ఉండాలంటే.. వాళ్లంతట వాళ్లు స్వీయ నియంత్రణ అవసరమని నిపుణులు చెబుతున్నారు. లేదా.. భార్యపై నిజంగా ప్రేమ పెంచుకుంటే అలాంటి కలలు రావని చెబుతున్నారు.
undefined
అయినా.. ఇలాంటి కలలు రావడం ఆగక.. భార్య భర్తల మధ్య తేడాలు వచ్చే పరిస్థితి వస్తే మాత్రం సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
undefined