అంత చిన్న వయసులోనే శృంగార కోరికలా?

First Published | Sep 17, 2020, 3:10 PM IST

కుటుంబంలో స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలు ఎంత అన్యోన్యంగా, ఆనందంగా ఉంటామో తెలియకుండా పెరిగే పిల్లలు... బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పడుు సరైనా ఆలోచనా ధోరణి కొరవడి, ఏం చేయాలో తెలియక.. పెడదోవ పట్టే ప్రమాదం ఉంది.

శృంగారంపై ఆసక్తి యవ్వన దశలో ప్రారంభమౌతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే... నిజానికి ఈ భావన పసి వయసు నుంచే ప్రారంభం అవుతుందని నిపుణులుచెబుతున్నారు.
undefined
ఇంట్లో తల్లిదండ్రులు ఒకరినొకరు తాకడం, కౌగిలించుకోవడం వంటివి పిల్లలు బాల్యం నుంచే ఓ కంట గమనిస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లల్లో ప్రేమాస్పదమైన భావనలు సహజంగానే పుట్టుకొస్తుంటాయి.
undefined

Latest Videos


అసలు ఒకరిపై మరొకరు ఎలాంటి ప్రేమలు ప్రదర్శించని.. ఎడ ముఖం, పెడ ముఖంగా ఉండే తల్లిదండ్రుల మధ్య పెరిగిన పిల్లలు పెద్దయ్యాక వాళ్లు కూడా అలానే తాయరౌతారట.
undefined
కుటుంబంలో స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలు ఎంత అన్యోన్యంగా, ఆనందంగా ఉంటామో తెలియకుండా పెరిగే పిల్లలు... బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పడుు సరైనా ఆలోచనా ధోరణి కొరవడి, ఏం చేయాలో తెలియక.. పెడదోవ పట్టే ప్రమాదం ఉంది.
undefined
పుస్తకాలు చదివి అరకొర విషయాలు నేర్చుకోవడం, సినిమాలు చూసి అదే నిజమని భావించడం వంటివన్నీ అదో వింత ప్రపంచంలో వారు విహరిస్తారు. కాబట్టి.. చిన్న తనం నుంచే పిల్లలకు నిజమైన ప్రేమను పరిచయం చేయాలి.
undefined
ఇది చాలా మంది ఇళ్లల్లో గమనించే ఉంటారు. చిన్నపిల్లలు తమ శరీరంలోని ఇతరత్రా భాగాలను తాకినట్లుగానే జననాంగాల మీద చేతులు పెట్టుకుంటూ ఉంటారు. అందులో పెద్దగా తప్పేమీ లేదు. కానీ... ఇంట్లో పెద్దలు మాత్రం వారిని అదో పెద్ద నేరం చేసినవారిలా చూస్తారు. ఛీ.. అక్కడ చేతులు పెట్టొద్దంటూ వారిని వారిస్తారు.
undefined
మనం పెద్దగా పట్టించుకోని ఈ విషయం... పిల్లల మనసుపై బలంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. యుక్త వయసుకు రాగానే.. పిల్లలకు వారి జనానాంగాల గురించి పెద్దలు ఎంతో కొంత అవగాహన తీసుకురావలని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
యుక్త వయసులో అడుగుపెట్టే తరుణంలో పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. కానీ మన సమాజంలో ఈ మార్పుల గురించి పిల్లను సన్నద్ధం చేయడం లేదు. దీని వల్ల వారి శరీరంలో జరిగే మార్పులకు కొందరు పిల్లలు భయపడే అవకాశం ఉంది.
undefined
అప్పటి వరకు మల, మూత్ర విసర్జన మాత్రమే తెలిసిన పిల్లలకు యుక్తవయసు వచ్చేసరికి ఆడపిల్లల్లో రుతు స్రావం, పురుషుల్లో అంగం నుంచి తెల్లటి స్రావం కారడం లాంటివి జరుగుతాయి.
undefined
వాళ్లు ఆ దశకు చేరుకుంటున్నారు అనగానే... పిల్లలకు ఇలా జరిగే అవకాశం ఉందని పెద్దలు ముందుగానే వివరించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు జననాంగాల వద్ద రోమాలు రావడం... నిద్ర లేచే సరికి అబ్బాయిలకు అంగం గట్టిపడటం వంటివి జరగొచ్చు. ఇవన్నీ ముందే చెప్పి వారిని సన్నద్ధం చేస్తే భవిష్యత్తులో వారు ఏదోదో ఊహించుకొని అనుమానపడే అవకాశం ఉండదు.
undefined
click me!