యుక్తవయసులో ఉన్నవారికి శృంగారపరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయని.. వయసు పెరిగేకొద్ది ఆ కోరికలు క్రమంగా తగ్గిపోతాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే.. ఆ భావన కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు.
undefined
ముఖ్యంగా స్త్రీలలో అయితే.. యుక్త వయసులో కన్నా.. మోనోపాజ్ దశలోనే ఎక్కువగా కోరికలు కలుగుతాయట.ఈ అంశంపై రెండు సంస్థలు సర్వే చేయగా.. ఆ రెండు సంస్థల రిజల్స్ ఒకేలా రావడం గమనార్హం.
undefined
యవ్వనంలో కన్నా.. 30నుంచి 40ఏళ్ల వయసులోనే ఎక్కువగా కోరికలు కలుగుతున్నాయని ఆ సర్వేలలో తేలింది. ఈ సర్వేలో మొత్తం మహిళలే పాల్గొనడం గమనార్హం.
undefined
ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో దాదాపు 75శాతం మంది మహిళలు మోనోపాజ్ దశ వారి రిలేషన్ మీద ప్రభావం చూపిస్తోందని చెప్పారు. సాధారణంగా 40ఏళ్లు దాటగానే మహిళలు మోనోపాజ్ దశకు చేరుకుంటారు.
undefined
దీని వల్ల వారి హార్మోన్లలో అసమతుల్యం ఏర్పడుతుంది. దీంతో.. ఆ వయసులో శృంగారం పట్ల కోరికలు కాస్త ఎక్కువగా కలుగుతాయని ఆ సర్వేలో తేలింది.ఇదే విషయంపై మరో సర్వేలో తమ శృంగార జీవితం గతంలో కంటే మోనోపాజ్ తర్వాతే బాగుందని మహిళలు చెప్పడం విశేషం.
undefined
20 నుంచి 30ఏళ్ల వయసులో తాము నెలలో 10సార్లు మాత్రమే శృంగారంలో పాల్గొనేవాళ్లమని.. మోనోపాజ్ తర్వాత అది రెట్టింపు అయ్యిందని వారు చెబుతున్నారు.
undefined
34నుంచి 38ఏళ్ల మధ్య వయసులో తాము శృంగార జీవితాన్ని బాగా ఆస్వాదించామని వారు చెబుతున్నారు. ఈ సర్వేలో దాదాపు వెయ్యి మంది మహిళలు పాల్గొన్నారు.
undefined
ఇదే విషయంపై మరో సంస్థ చేసిన సర్వేలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు లైంగిక జీవితానికి దూరంగా ఉంటేనే మోనోపాజ్ లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
undefined
లండన్ యూనివర్శిటీ కాలేజ్ కి చెందిన పరిశోధకులు పలుమార్లు జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
undefined
వారానికి ఒకసారి లేదంటే కనీసం నెలకోసారి శృంగారంలో పాల్గొనే మహిళలు చిన్నవయసులోనే మెనోపాజ్ కి గురయ్యే అవకాశం తక్కువని వాళ్ల పరిశోధనలో తేలింది.
undefined
దీనికోసం వీళ్లు రకరకాల వయసు ఉన్న స్త్రీలను ఎంపిక చేసుకొని కొన్ని సంవత్సరాలపాటు పరిశోధనలు చేయగా ఈ విషయంపై క్లారిటీ వచ్చిందని వారు చెబుతున్నారు.
undefined
ముఖ్యంగా స్త్రీలలో నెలసరిని లైంగిక జీవితాన్ని ఆహారపు అలవాట్లని కూడా నిశితంగా పరిశీలించారు. అందులో నెలకి ఒకసారి శృంగారంలో పాల్గొన్నవారంతా వారానికొకసారి కలయికను ఆస్వాదించే వాళ్లలో మోనోపాజ్ లక్షణాలు ఆలస్యంగా రావడం గమనార్హం.
undefined
అదేవిధంగా నెలకొకసారి లైంగిక కలయిక లేనివాళ్లలో మోనోపాజ్ త్వరగా వచ్చినట్లు తేలింది. అంతేకాకుండా, చిన్న వయసులోనే గ్రాండ్ చిల్డ్రన్ పెంపకంలో పడి సంసార జీవితానికి దూరంగా ఉండేవారిలో కూడా మోనోపాజ్ త్వరగా వస్తుందని తేలింది.
undefined
మొత్తానికి ఈ సర్వే ఏం చెబుతుందంటే.. వయసుతో సంబంధం లేకుండా శృంగారాన్ని ఆస్వాదించే మహిళలకు మోనోపాజ్ ఆలస్యం కావడం మాత్రమే కాదు..ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయని చెబుతున్నారు.
undefined
ఇంకొందరు మాత్రం మోనోపాజ్ కి చేరుకున్నాక తమకు కలయిక పట్ల అసలు ఆసక్తి కలగడం లేదని.. ఒకవేళ ప్రయత్నించినా అంగం వద్ద నొప్పి, మంట కలుగుతున్నాయని చెబుతుండటం గమనార్హం.
undefined