డ్రైవర్ లెస్ కారులో శృంగారం.. రోడ్డుమీదే విచ్చలవిడిగా...

First Published | May 13, 2020, 3:12 PM IST

కారు ఒకచోటి ఆపి శృంగారం చేయాలనేది కొందరి ఆలోచన అయితే.. కదులుతున్న కారులో కలయికలో పాల్గొనాలని చాలా మంది కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది.

చాలా మంది సెక్స్ ఫాంటసీలు ఉంటాయి. నిజజీవితంలో వాళ్లు ఇప్పటి వరకు చేయలేకపోయిన వాటిని ఫాంటసీలుగా చెబుతుంటారు. అలాంటి శృంగారాన్ని రుచి చూడాలని ఉవ్విలూరుతుంటారు. వాటిలో కారులో శృంగారం కూడా ఒకటి. చాలా మందికి ఉండే ఫాంటసీలో ఇది కూడా ఒకటి.
మన దగ్గర చాలా తక్కువ కానీ అమెరికా లాంటి దేశాల్లో కార్లలోనే శృంగార కార్యకలాపాలు సాగించేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఇప్పటికి చాలా సార్లు వీటికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి.

అయితే.. కారు ఒకచోటి ఆపి శృంగారం చేయాలనేది కొందరి ఆలోచన అయితే.. కదులుతున్న కారులో కలయికలో పాల్గొనాలని చాలా మంది కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది.
వాళ్లు అలా ఎంజాయ్ చేయాలంటే.. వారు ఎక్కిన కారు ఎవరో ఒకరు నడపాలి. అలా నడపాలి అంటే డ్రైవర్ ఉండాలి. ఏకాంతంగా శృంగారాన్ని ఎంజాయ్ చేయాలని అనుకున్నప్పుడు అడ్డుగా డ్రైవర్ ఉండటం నచ్చదు కదా.
అయితే.. వీరి కోరికను డ్రైవర్ లెస్ కార్లు తీరుస్తున్నాయని తాజాగా ఓ సంస్థ జరిపిన సర్వేలో తేలింది.
ఇప్పటికే పలు దేశాల్లో డ్రైవర్ లెస్ కార్లు రోడ్లు ఎక్కాయి. అత్యధిక టెక్నాలజీతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా.. కేవలం కంప్యూటర్ ఆదేశాలతో వాటంతటవే నడుస్తాయి.
ఎలాగూ కారులో డ్రైవర్ ఉండడు కాబట్టి... అలాంటి కార్లలో శృంగారం చేయాలని పలు జంటలు ఉవ్వూలూరుతుండటం విశేషం.
భారత్ లాంటి దేశాల్లో ఈ డ్రైవర్ లెస్ కార్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇక్కడికి వాటిని తీసుకువచ్చినా... నిరుద్యోగం పెరిగే ప్రమాదం కూడా ఉంది. అయితే.. విదేశాల్లో మాత్రం వీటిని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
క్యాబ్ లు కూడా డ్రైవర్ లెస్ గానే తీసుకురావాలని చూస్తున్నారు. అయితే... వీటిని కనుక తీసుకువస్తే.. ఇక రోడ్డుపైనే విచ్చలవిడిగా శృంగారం చేస్తారంటూ ఓ సంస్థ హెచ్చరిస్తోంది.
దాదాపు 60శాతం మంది అమెరికన్లు కార్లలో రాసక్రీడలు వెలగబెడుతున్నారని ఓ సర్వేలో తేలింది.
పలు దేశాల్లో వ్యభిచారం కూడా చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇక డ్రైవర్ లెస్ కార్లు అందుబాటులోకి వస్తే.. వాటిలోనే వ్యాపారం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యాటకం పేరిట ఈ రకం వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నారని వారు చెబుతున్నారు.
ఇటీవల ఓ కార్ల తయారీ కంపెనీ.. తమ కారు ప్రకటన కూడా ఇదే విధంగా డిజైన్ ఛేయడం విశేషం. మీకు కనుక డ్రైవర్ లెస్ కారు ఉంటే.. అందులో ఎంచక్కా సెక్స్ ఎంజాయ్ చేయవచ్చు అనేది వాడి ప్రకటన ముఖ్య ఉద్దేశం కావడం విశేషం.
ఓ సంస్థ చేసిన పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే... ఈ డ్రైవర్ లెస్ కార్లతో కొన్నిరకాల హోటల్స్, రిసార్ట్స్ టైఅప్ చేసుకుంటాయి. వీటి ప్రకారం.. మీరు కనీసం ఫుడ్ కి కూడా కిందకు దిగాల్సిన పనిలేదు. అందులోనే అన్ని పనులు కానివ్వచ్చు అనమాట.
అంతేకాకుండా ఈ కార్లు అందుబాటులోకి వస్తే మద్యం అమ్మకాలు కూడా పెరిగిపోతాయి. ఎలాగూ డ్రైవర్ ఉండడు కాబట్టి.. మద్యం సేవించి కూడా కారులో ఇంటికి చేరిపోవచ్చు కదా.
ఈ డ్రైవర్ లెస్ కారు సంగతి పక్కన పెడితే.. కారులో శృంగారం మాత్రం చాలా రిస్క్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్లలో శృంగారం ఎందుకు ప్రమాదకరమంటే.. తద్వారా గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.
నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గణాంకాల ప్రకారం అమెరికాలో 52మంది టీనేజర్స్ కార్లలో శృంగార కార్యకలాపాల్లో పాల్గొంటూ మృతి చెందారు.
హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఎండాకాలం కార్లలో శృంగార కార్యకలాపాలకు సిద్దపడేవారు.. కనీసం ముందు జాగ్రత్త చర్యలైనా పాటించాలని కొలరాడో హెల్త్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది.
కారులో కచ్చితంగా వాటర్ బాటిల్ ఉంచుకోవాలని.. వీలైనంత ఎక్కువ మంచినీరు తాగాలని సూచిస్తున్నారు. తద్వారా గుండెపోటు రాకుండా కొంతలో కొంతైనా అరికట్టవచ్చునని చెబుతున్నారు.
ఇవికాక.. చాలా మంది కారులో కక్కుర్తి పడి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి.. ఈ ఫాంటసీలకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

Latest Videos

click me!