ఆ సమయంలో శృంగారం.. అదంతా అపోహేనా..!

First Published Jun 13, 2020, 3:11 PM IST

గర్భాశయ కండరాలు కూడా దృఢంగానే ఉంటాయి. అలా బిడ్డకు ఏ ప్రమాదం జరగదు. కలయిక వల్ల కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్లు ఎదురైనా అవి పుట్టబోయే పాపాయి వరకూ చేరవు. కాబట్టి భయపడక్కర్లేదు. 

భార్య తల్లికాబోతోంది అన్న విషయం తెలయగానే.. మొదట సంతోషించేంది భర్తే. తల్లిదండ్రులు కాబోతున్నామని తెలిసిన నాటి నుంచి వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
undefined
తినే ఫుడ్ దగ్గర నుంచి అన్ని విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తారు. వీరు తీసుకునే జాగ్రత్తలో మొదటిది కలయికకు దూరంగా ఉండటం. ప్రెగ్నెన్నీ సమయంలో శారీరకంగా కలిస్తే.. కడుపులో బిడ్డకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది.
undefined
అయితే.. అవన్నీ అపోహలే అంటున్నారు నిపుణులు.ప్రెగ్నెన్సీ సమయంలో కూడా భార్యభర్తలు శృంగార జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు అంటున్నారు నిపుణులు.
undefined
దీనివల్ల బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఎదురుకాదు కూడా. ఎందుకంటే పాపాయి గర్భసంచిలో ఉమ్మనీటి మధ్య ఉంటుంది. పైగా మ్యూకస్‌ గర్భాశయ ముఖద్వారాన్ని కప్పి ఉంచుతుంది.
undefined
గర్భాశయ కండరాలు కూడా దృఢంగానే ఉంటాయి. అలా బిడ్డకు ఏ ప్రమాదం జరగదు. కలయిక వల్ల కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్లు ఎదురైనా అవి పుట్టబోయే పాపాయి వరకూ చేరవు. కాబట్టి భయపడక్కర్లేదు.
undefined
అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వైద్యులు కొందరు మహిళలకు హై రిస్క్‌ ప్రెగ్నెన్సీ అని నిర్ధరిస్తారు. అలాంటప్పుడూ, మరికొన్ని సందర్భాల్లో లైంగికచర్యకు దూరంగా ఉంటేనే మంచిది.
undefined
అదెప్పుడంటే.. నెలలు నిండకుండానే కాన్పు అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు.గతంలో అబార్షన్లు అయినప్పుడు, ఉమ్మనీరు తక్కువగా ఉందని తెలిసినప్పుడు, అకారణంగా రక్త స్రావం లాంటివి అయినప్పుడు మాత్రం సెక్స్ కి దూరంగా ఉండాలి. ఈ సమస్య లేకపోతే.. సెక్స్ ని వాయిదా వేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.
undefined
దీని తర్వాత కూడా చాలా మందికి అనుమానాలు ఉంటాయి. డెలివరీ తర్వాత మళ్లీ కలయిక ఎప్పుడూ అనే అనుమానం కలుగుతుంది. ఆ విషయంలోనూ చాలా సందేహాలు ఉంటాయి.
undefined
భార్య, భర్తల బంధానికి శృంగారం తొలి మెట్టు. వారి బంధం బలపడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే... ఒక్కసారి భార్య ప్రెగ్నెన్సీ వస్తే... ఆ విషయంలో ఇద్దరి మధ్యా ఎడబాటు తప్పదు.
undefined
స్త్రీ ఆరోగ్యం బాగుంటే... 8వ నెల వరకు శృంగారంలో పాల్గొనవచ్చు అని నిపుణులు చెబుతుంటారు. అయితే... అసలు చిక్కల్లా డెలివరీ తర్వాతే మొదలౌతుంది.డెలివరీ తర్వాత స్త్రీ శరీరం శృంగారానికి అంత అనువుగా ఉండదు.
undefined
కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. దానికి తోడు మధ్యలో పాపాయి కూడా ఉంటుంది. పాపాయి బాధ్యతలు, పనుల మధ్య ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు.
undefined
చాలా మంది డెలివరీ తర్వాత ఆరు నెలల వరకు శృంగారంలో పాల్గొనకూడదు అని చెబుతుంటారు. అయితే అదేమి నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆరు వారాల తర్వాత మీ సెక్స్ జీవితాన్ని తిరిగి ఆనందంగా ప్రారంభించవచ్చని వారు చెబుతున్నారు.
undefined
అయితే.. కొందరికి సిజేరియన్లు కావడం వల్ల కొద్దికాలం పాటు కుట్లు పచ్చిగా ఉంటాయి.అవి పూర్తిగా మానికపోకముందే సెక్స్ లో పాల్గొంటే... నొప్పి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.
undefined
కాబట్టి... ఆరు వారాల తర్వాత మీ డాక్టర్ ని ఒకసారి ఈ విషయంలో సలహా తీసుకోండి. ఆ తర్వాత మీ ఆనందకర జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టవచ్చు. నొప్పి ఉన్న భావన కలిగితే... మరి కొద్ది రోజులు ఆగి ప్రయత్నించవచ్చు.
undefined
click me!