భార్య, భర్తల బంధానికి శృంగారం తొలి మెట్టు. వారి బంధం బలపడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే... ఒక్కసారి భార్య ప్రెగ్నెన్సీ వస్తే... ఆ విషయంలో ఇద్దరి మధ్యా ఎడబాటు తప్పదు.
స్త్రీ ఆరోగ్యం బాగుంటే... 8వ నెల వరకు శృంగారంలో పాల్గొనవచ్చు అని నిపుణులు చెబుతుంటారు. అయితే... అసలు చిక్కల్లా డెలివరీ తర్వాతే మొదలౌతుంది.
డెలివరీ తర్వాత స్త్రీ శరీరం శృంగారానికి అంత అనువుగా ఉండదు. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. దానికి తోడు మధ్యలో పాపాయి కూడా ఉంటుంది. పాపాయి బాధ్యతలు, పనుల మధ్య ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు.
డెలివరీ తర్వాత స్త్రీ శరీరం శృంగారానికి అంత అనువుగా ఉండదు. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. దానికి తోడు మధ్యలో పాపాయి కూడా ఉంటుంది. పాపాయి బాధ్యతలు, పనుల మధ్య ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు.
అయితే... ఈ విషయంలో చాలా మంది పురుషులకు సందేహాలు ఉంటాయి. భార్యకు డెలివరీ అయిన ఎంత కాలం తర్వాత సెక్స్ లో పాల్గొనాలి అనే విషయంలో చాలా మందికి స్పష్టత ఉండదు.
చాలా మంది డెలివరీ తర్వాత ఆరు నెలల వరకు శృంగారంలో పాల్గొనకూడదు అని చెబుతుంటారు. అయితే అదేమి నిజం కాదని నిపుణులు చెబుతున్నారు.
ఆరు వారాల తర్వాత మీ సెక్స్ జీవితాన్ని తిరిగి ఆనందంగా ప్రారంభించవచ్చని వారు చెబుతున్నారు. అయితే.. కొందరికి సిజేరియన్లు కావడం వల్ల కొద్దికాలం పాటు కుట్లు పచ్చిగా ఉంటాయి.
అవి పూర్తిగా మానికపోకముందే సెక్స్ లో పాల్గొంటే... నొప్పి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి... ఆరు వారాల తర్వాత మీ డాక్టర్ ని ఒకసారి ఈ విషయంలో సలహా తీసుకోండి. ఆ తర్వాత మీ ఆనందకర జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టవచ్చు. నొప్పి ఉన్న భావన కలిగితే... మరి కొద్ది రోజులు ఆగి ప్రయత్నించవచ్చు.
కొందరు మాత్రం కాన్పు తర్వాత తమకు శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందని చెబుతూ ఉంటారు. అయితే... అందులో కొంత నిజం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కాన్పు అయిన వెంటనే, కొద్దిరోజుల పాటు మాత్రం ఇలా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి కొంత వరకు శరరీంలో తలెత్తే హార్మోన్ల మార్పులు కారణమౌతాయని చెబుతున్నారు.
అదీకాక... తల్లి ధ్యాస మొత్తం కొత్తగా పొత్తిళ్లలోకి వచ్చిన బిడ్డపైనే ఉండటం మరో ముఖ్యకారణం. ఈ సమయంలో ఆమె మనసు ఇంకోదానిపైనా వెళ్లదు. అందువల్ల కూడా మిగతా కోరికలకు కలగవు. బిడ్డ మీద ధ్యాసతో భర్తపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించరని.. అందుకే శృంగార కోరికలు కలగవని చెబుతున్నారు.