సెక్స్ తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతయా?

First Published | Oct 31, 2023, 12:58 PM IST

సెక్స్ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మత్తుగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడానికి ఎందుకు కారణమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

కొంతమందికి శృంగారంలో పాల్గొన్న తర్వాత అకస్మాత్తుగా తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అంతేకాదు సెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి కూడా కారణమవుతుంది తెలుసా? ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజమేనంటున్నారు నిపుణులు. సెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుందని, డయాబెటిస్ ఉన్నవారిపై ఇది ఎంతో ప్రభావాన్ని చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Sexual Relationship

సెక్స్ కు రక్తంలో చక్కెర స్థాయిలకు సంబంధం ఏంటి? 

సెక్స్ కూడా వ్యాయామం  లాంటిదే. ఇది కూడా జాగింగ్ లేదా ఏరోబిక్స్ మాదిరిగానే మీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. నిపుణుల ప్రకారం.. సెక్స్ కూడా ఒక రకమైన శారీరక శ్రమే. అలాగూ ఇతర శారీరక శ్రమ మాదిరిగానే.. ఇది కూడా మీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి కారణమవుతుంది. శారీరక కార్యకలాపాలు, వ్యాయామాల సమయంలో ఉపయోగించే శక్తి  ప్రధాన వనరు గ్లూకోజే. కాబట్టి ఈ సమయంలో బ్లడ్ షుగర్ పడిపోతుంది. 



డయాబెటిస్ మీ లైంగిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే? 

యోని పొడిబారడం

డయాబెటిస్ ఉన్న చాలా మందికి యోని పొడిబారే సమస్య ఎక్కువగా ఉంటుంది. పలు అధ్యయనాల ప్రకారం.. డయాబెటిస్ యోని పొడిబారే అవకాశాలను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే మీ యోనిలోని రక్త నాళాలు దెబ్బతిని పొడిబారుతాయి. అందుకే సెక్స్ బాధాకరంగా ఉంటుంది. సెక్స్ సమయంలో అసౌకర్యం లేదా నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీళ్లు లూబ్రికెంట్ ను ఉపయోగించాలని నిపుణులు సలహానిస్తారు. 
 

Food helps for sex

తక్కువ లిబిడో

డయాబెటిస్ ఉన్నవారికి లైంగిక కోరికలు తగ్గడం లేదా మొత్తమే లేకపోవడం సర్వ సాధారణ విషయం. ఇరానియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రచురించిన ఒక అధ్యయనం డయాబెటిస్ ఉన్న మహిళల్లో లైంగికంగా పనిచేయకపోవడం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. వీళ్లు డయాబెటీస్ మందులను ఏ సమయంలో తీసుకోవాలో డాక్టర్ ని అడిగి తెలుసుకుని వాడాలని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని మందులు రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలకు కారణమవుతాయి. అందుకే మీరు శారీరక శ్రమ  చేయని సమయంలోనే వీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 
 

యూటీఐలు 

డయాబెటిస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) తో సంబంధం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారికి యూటీఐలు, మూత్రాశయ సమస్యలు, లైంగికంగా పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని పలు అధ్యయనాలు కనుగొన్నాయి. ఇది యూరోలాజిక్ పరిస్థితులను మరింత దిగజార్చగలదని పీఎల్ఓఎస్ వన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం తెలిపింది.
 

Latest Videos

click me!