మకర రాశితో లవ్ లైఫ్... ఏ రాశివారు సెట్ అవుతారో తెలుసా?

First Published | Jun 22, 2022, 10:28 AM IST

బాధ్యతల నుంచి ఎప్పుడూ పారిపోవాలని అనుకోరు. వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరు తమ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువ.

మకర రాశివారికి లక్ష్య సాధన ఎక్కువ. జీవితంలో  సాధించాలి అనుకున్న వాటిని ఎలాగైనా సాధించేస్తారు. అంతేకాదు.. తమ బాధ్యతలకు కూడా కట్టుబడి ఉంటారు. బాధ్యతల నుంచి ఎప్పుడూ పారిపోవాలని అనుకోరు. వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరు తమ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువ. వీరు నిత్యం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వీరిలో అందరిలో ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీలు వీరిలో ఉన్నాయి. మరి వీరి సరి జోడుగా ఏ రాశివారు సెట్ అవుతారో ఓసారి చూద్దాం...

మేషరాశితో మకరం

కాస్త సర్దుకుంటే మేష రాశివారు మకర రాశివారికి సరి జోడు అవుతారు. ఇద్దరి మధ్య అపార్థాలు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తే.. వీరి జంట అందంగా ఉంటుంది. సమస్య వస్తే.. ప్రశాంతంగా మాట్లాడుకొని చర్చించుకోవాలి.

ఈ రెండు రాశుల మధ్య మొత్తం కంపాటబులిటీ : 4

సెక్స్: 3

ప్రేమ: 5

కమ్యూనికేషన్: 3


వృషభ రాశితో మకర రాశి..

ఈ రెండు రాశులు వారంతట వారు కలిసి జీవించాలని అనుకుంటే.. వీరి లైఫ్ బాగుంటుంది. కానీ.. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ సరిగా ఉంటే.. వీరి జీవితం బాగుంటుంది. అయితే.. ఒకరిపై మరొకరు నమ్మకం ఉంచాలి. 

మొత్తం: 4

సెక్స్: 5

ప్రేమ: 3

కమ్యూనికేషన్: 2

మిధునరాశితో మకరరాశి

మిథున రాశి తో మకర రాశి లైఫ్ బాగుంటుంది. వీరి మధ్య ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అయితే.. మధ్యలో ఎవరైనా వచ్చి.. ఇద్దరి మధ్య సమస్యలు సృష్టించాలని చూస్తూ ఉంటారు. గొడవలు జరిగినప్పుడు అవి మనసుకు తీసుకొని బాధపడకుండా..  వాటిని అక్కడితో వదిలేస్తే.. వీరి జంట ఆనందంగా ఉంటుంది. వీరు మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యలైనా పరిష్కారమౌతాయి.

ఈ రెండు రాశుల మధ్య కంపాటబులిటీ మొత్తం: 4

సెక్స్: 3

ప్రేమ: 4

కమ్యూనికేషన్: 2


కర్కాటక రాశితో మకర రాశి..

మీరిద్దరూ స్పష్టంగా కమ్యూనికేట్ చేయాలి. వీరికి ఇది చాలా అవసరం. అది ఉన్నట్లుగా చెప్పడానికి బయపడకండి. ఈ జీవితకాలంలో మీ ప్రధాన పాఠాలలో ఒకటి మైండ్ గేమ్‌లు ఆడటం కంటే, మీకు కావలసినది స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం నేర్చుకోవడం.మీ పార్ట్ నర్ కి ఏం కావాలి అనేది అడిగి తెలుసుకుంటే.. వీరి జంట ఆనందంగా ఉంటుంది.

ఈ రెండు రాశుల కంపాటబులిటీ మొత్తం: 4

సెక్స్: 3

ప్రేమ: 4

కమ్యూనికేషన్:2
 

సింహ రాశితో మకర రాశి..

మీకు ఏది మంచిదో కాదో.. సింహ రాశివారికి తెలుసుకోగలరు. అదేవిధంగా మకర రాశివారు వారికి సెట్ అవుతారో లేదో కూడా వారే నిర్ణయించుకోగలరు. అయితే... వీరిద్దరూ ఆనందంగా ఉండాలి అంటే... ఒకరిపై మరోకరు నమ్మకం ఉంచాలి. నమ్మకమే వీరి బంధానికి పునాది. ఆ నమ్మకం ఉన్నంత వరకే వీరి జీవితం ఆనందంగా ఉంటుంది. 
మొత్తం: 3

సెక్స్: 4

ప్రేమ: 3

కమ్యూనికేషన్: 3

కన్య రాశితో సింహ రాశి..

ఈ రెండు రాశుల వారు నిజంగా ప్రేమించుకుంటే  ఎలాంటి విషయాలను ఆలోచించకుండా.. ముందుకు వెళ్లాలి. జీవితంలో జరగపోయే ప్రతి మార్పుకు సిద్దంగా ఉండాలి. రిలేషన్ గురించి అతిగా ఆలోచించకూడదు. ప్రతి విషయంలోనూ నమ్మకం, సమయం చాలా కావాలి. 

మొత్తం: 4

సెక్స్: 4

ప్రేమ: 2

కమ్యూనికేషన్: 4

తుల రాశితో మకర రాశి..
ఈ రెండు రాశుల కాంబినేషన్ బాగుంటుంది. వీరి బంధం బలంగా ఉంటుంది.  మీ కుటుంబం కూడా మీకు మద్దతు ఇవ్వవచ్చు. మీ బంధాన్ని మీరు గౌరవించాలి. మీకు సహకరించిన వారితోనూ మీరు  కృతజ్ఞతతో ఉండండి. మొత్తంమీద ఈ రెండు రాశుల వారు  జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉంటారు.

మొత్తం: 4

సెక్స్: 4

ప్రేమ: 5

కమ్యూనికేషన్: 3

వృశ్చిక రాశితో మకర రాశి..

ఈ రెండు రాశుల కాంబినేషన్ కూడా బాగుంటుంది. అయితే.. మధ్య మధ్యలో ఏవో కలతలు రావచ్చు. గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. జీవితంలో ముందకు వెళ్లాలంటే.. దిశా నిర్దేశం ఉండాలి. దిశా నిర్దేశం లేకుంటే... జీవితంలో కష్టపడాల్సి ఉంటుంది. మీ పై మీకు విశ్వాసం ఉండాలి.

మొత్తం: 4

సెక్స్: 3

ప్రేమ: 4

కమ్యూనికేషన్: 3

ధనస్సు రాశితో మకర రాశి..

ఈ రెండు రాశుల కాంబినేషన్ యావరేజ్ గా ఉంటుంది.  అయితే... వీరి బంధం కాస్త బలహీనంగానే ఉంటుందని చెప్పాలి. బంధం విషయంలో మీరు చాలా బలంగా ఉండాలి. లేదంటే బంధం బలహీనమైతే కష్టం. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 
మొత్తం: 3

సెక్స్: 4

ప్రేమ: 3

కమ్యూనికేషన్: 2

మకర రాశితో మకర రాశి..

ఈ రెండు రాశుల ఆలోచనలు, విధానాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి.. వీరి బంధం గొప్పగా ఉంటుది. ప్రతి విషయంలోనూ ఆనందంగా ఉంటారు. అన్ని బాధ్యతలను పంచుకుంటారు. జీవితంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలను కూడా తట్టుకుంటారు. ఎందులో నైనా విజయం సాధించగల సత్తా ఈ రాశుల వారికి ఉంది. 

మొత్తం: 5

సెక్స్: 5

ప్రేమ: 5

కమ్యూనికేషన్: 4

కుంభ రాశితో మకర రాశి..
మీ ప్రయత్నాలు, సంకల్పం , పట్టుదల ఫలిస్తాయి. ఈ రెండు రాశుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు రాశులు అన్ని విషయాలను పూర్తిగా అర్థం చేసుకుంటారు. అంకింత భావంతో ఉంటారు.  కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. 

మొత్తం: 4

సెక్స్: 3

ప్రేమ: 5

కమ్యూనికేషన్: 2

మీన రాశితో మకర రాశి..

మీ జీవితంలో ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయం ఆవిష్కృతం కాబోతోంది. ముందుకు సాగే ముందు పాత గత బాధలను తొలగించుకోవాలి. రాబోయే రోజుల్లో, మీరు పునరుద్ధరించబడిన స్పష్టత, ఉద్దేశ్యం, దిశను అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. మొత్తంమీద, మీరు ఈ సంబంధాన్ని తీసుకువచ్చారు కాబట్టి దానిని వదులుకునే ముందు ఆలోచించండి.

మొత్తం కంపాటబులిటీ 4

సెక్స్ 5

ప్రేమ 4

కమ్యూనికేషన్ 3

Latest Videos

click me!