మితిమీరిన శృంగారం కాస్త.. బలవంతపు కాపురంగా మారి...

First Published May 29, 2020, 3:00 PM IST

ఈ లాక్ డౌన్ పీరియడ్ ని దంపతులు బాగా ఎంజాయ్ చేశారు. ఏ సర్వే చూసినా.. దంపతులంతా శృంగారంలో చెలరేగిపోతున్నారంటూ తెలిపాయి. అయితే.. లాక్ డౌన్ పొడిగిస్తూవస్తుండటంతో... తొలుత ఉన్న అన్యోన్యత కాస్త.. దూరాన్ని పెంచేసింది.

ప్రస్తుత కాలంలో అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు లేచామా ఏదో కొంచెం తిన్నామా.. సంపాదన కోసం పరుగులు తీశామా.. మళ్లీ ఇంటికి వచ్చామా అసలిపోయి పడుకున్నామా అన్నట్లు జీవితాలు ఉండేవి.
undefined
అయితే.. ఒక్కసారి కరోనా వైరస్ ఎంటర్ అయ్యాక అంతా మారిపోయింది. వైరస్ ని అరికట్టాలని లాక్ డౌన్ విధించారు. దీంతో.. ఎప్పుడూ లేనంత ఖాళీ దొరికింది. దీంతో.. భార్యభర్తలకు ఏకాంతం దొరికింది.
undefined
తొలుత.. ఈ లాక్ డౌన్ పీరియడ్ ని దంపతులు బాగా ఎంజాయ్ చేశారు. ఏ సర్వే చూసినా.. దంపతులంతా శృంగారంలో చెలరేగిపోతున్నారంటూ తెలిపాయి. అయితే.. లాక్ డౌన్ పొడిగిస్తూవస్తుండటంతో... తొలుత ఉన్న అన్యోన్యత కాస్త.. దూరాన్ని పెంచేసింది.
undefined
దాంపత్య జీవితం బలపడవలసిన ఈ సమయం, లేనిపోని లైంగిక సమస్యలకు కారణమైందని పలువురు వాపోతుండటం విశేషం. చాలా మంది బాబోయ్.. ఈ బలవంతపు కాపురం మేము చేయలేము.. ఇక ఆఫీసులు తెరవండి అని వేడుకుంటున్నారు.
undefined
లైంగిక జీవితం సక్రమంగా సాగాలంటే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి. మనసు హుషారుగా ఉండి, ఎటువంటి ఒత్తిళ్లూ, ఆందోళనలూ లేనప్పుడే లైంగికంగా చురుగ్గా ఉండగలం. అయితే హుషారు మందగించి, కుంగుబాటుకు లోనైతే ఆ ప్రభావం కచ్చితంగా లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
undefined
ఫలితంగా కోరికలు, పటుత్వం తగ్గడం లాంటి లక్షణాలు కొత్తగా మొదలవుతాయి. నిజానికి, ముందు నుంచీ ఎలాంటి సెక్స్‌ సమస్యలూ లేని వారికి లాక్‌డౌన్‌ మూలంగా కొత్త సమస్యలు తలెత్తే అవకాశం లేదు.
undefined
లాక్‌డౌన్‌కు ముందు దంపతులకు కేవలం వారాంతాల్లో మాత్రమే సన్నిహితంగా గడిపే వీలు చిక్కేది. మిగతా రోజుల్లో పని అలసట కారణంగా శారీరకంగా దగ్గరయ్యే ఓపిక, తీరిక ఉండేవి కావు.
undefined
కానీ ఆఫీసు పనులతో, వ్యాపార పనులతో బిజీగా గడిపేసే భర్తలు లాక్‌డౌన్‌ మూలంగా ఇంటికే పరిమితం అవడంతో వారి నుంచి రెట్టింపు అన్యోన్యతనూ, సాన్నిహిత్యాన్నీ భార్యలు ఆశించే పరిస్థితి.
undefined
సాధారణంగా పరిమిత సెక్స్‌ సామర్థ్యానికి అలవాటు పడి, ఆ మేరకే తోడ్పడే హార్మోన్లు, ఉన్నపళాన పరిమితికి మించి అవసరం పడితే ఆ స్థితినీ శరీరం తట్టుకోలేదు. దాంతో లైంగిక సామర్ధ్యం కొంత సన్నగిల్లుతుంది.
undefined
నిజానికి అదే హార్మోన్‌ స్థాయి లాక్‌డౌన్‌ పూర్వం సరిపోయి ఉండవచ్చు. కాబట్టి కొత్తగా సమస్య తలెత్తిందని భావించవలసిన అవసరం లేదు. ఇలా అంతిమంగా పూర్వం లేని కొత్త లైంగిక సమస్యలు లాక్‌డౌన్‌ ఫలితంగా పురుషులను వేధించే అవకాశం ఉంది.
undefined
కాబట్టి లేని పోని భయాలు పెట్టుకోకుండా.. దంపతుల మధ్య ఉన్న అగాథాన్ని తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
undefined
click me!