శృంగారం విషయంలో అబ్బాయిలకు ఈ అబద్దాలు చెప్పకండి...

First Published | Jul 2, 2021, 10:25 AM IST

అబ్బాయిలకు సెక్స్ విషయంలో చాలా అబద్దాలు చెబుతుంటారు. అది అంతిమంగా తన భాగస్వామిని అర్థం చేసుకోకపోవడం, వైవాహిక జీవితపు అసంతృప్తులు, విచ్చలవిడి శృంగారానికి దారి తీస్తుంటాయి. 

నేడు సమాజంలో ఉన్న పరిస్థితులు, లింగ వివక్ష, పితృస్వామిక వ్యవస్థ ఈ కారణాలవల్లే సెక్స్ విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలకు భిన్న దృక్కోణాలు ఏర్పడుతున్నాయి. సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో ఇది బాగా కనిపిస్తుంది. యవ్వన దశలోకి అడుగుపెట్టిన బాలికలు, బాలురకు సెక్స్ విషయంలో కుతూహలం సహజమే.
అయితే ఇది అమ్మాయిల విషయానికి వచ్చేసరికి కన్యత్వానికి లింకు పెట్టి.. పెళ్లికి ముందు సెక్స్ లేదా.. అలాంటి పనుల వల్ల శీలం పోతుందనే భావనను గట్టిగా నాటుతున్నారు. మహిళలు సెక్స్ గురించి మాట్లాడకూడదు అనేది కూడా ఇందలో భాగమే.

అయితే అదే అబ్బాయిల విషయానికి వచ్చేసరికి అది మగతనానికి నిదర్శంగా మారిపోతుంది. సెక్స్ గురించి తరచూ మాట్లాడడం, పెళ్లికి ముందు ట్రై చేయోచ్చు తప్పులేదు. మగవాడికి శీలం విషయంలో వెసులుబాటులు.. ఇవన్నీ అబ్బాయిలకు టీనేజ్ నుంచే మెదళ్లలో నాటుకుపోతున్నాయి. దీంతో మొదలయ్యే అపోహలు.. వారి వైవాహిక జీవితం మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి.
అబ్బాయిలకు సెక్స్ విషయంలో చాలా అబద్దాలు చెబుతుంటారు. అది అంతిమంగా తన భాగస్వామిని అర్థం చేసుకోకపోవడం, వైవాహిక జీవితపు అసంతృప్తులు, విచ్చలవిడి శృంగారానికి దారి తీస్తుంటాయి. అలాంటి అబద్దాలు ఏంటో.. అసలు వాస్తవాలు ఏంటో చూడండి..
మొదటి అపోహ - సెక్స్ అంటే చొప్పించడమే..కన్యత్వం, సెక్స్ అనే విషయాలు చాలా చిన్నవి, పరిమితమైనవి. యోనిలో పురుషాంగం ప్రవేశించడమే సెక్స్ అనేది తరాలుగా పురుషుల మెదళ్లలో నాట బడుతోంది. కాకపోతే దీంట్లో ఓరల్ సెక్స్ కు, ఆనల్ సెక్స్ కు మినహాయింపునిచ్చారు. అంతేకాదు ఈ అవగాహనల్లో LGBTQ వ్యక్తుల గురించి వారి లైంగికాభిరుచుల గురించి ఉండదు. సెక్స్ అంటే కేవలం అంగప్రవేశం మాత్రమే కాదు.. వ్యక్తులను బట్టి అది మారుతుందని.. ఎదుటి వ్యక్తి కూడా పూర్తిగా శారీరక, మానసిక స్థాయిలో కలిస్తేనే అసలైన శృంగారం అని అబ్బాయిలకు నేర్పించాలి.
రెండో అపోహ - అబ్బాయిలపై అత్యాచారం జరగదు..రేప్ అనేది జెండర్ తో సంబంధం లేని అంశం. మన సమాజంలో రేప్ అత్యంత దారుణమైన నేరం. అయితే, స్త్రీలమీద జరిగిన అత్యాచారాలు వచ్చినంతంగా, పురుషుల మీద జరిగే అత్యాచారాలు వెలుగులోకి రావడం లేదు. వీరిమీద జరిగే అత్యాచారాలు ,హింస తక్కువగా రిపోర్ట్ అవుతుంటుంది. దీంతో అబ్బాయిలను రేప్ చేయలేరు అనే భావనను కలిగిస్తారు. పురుషులూ ఎప్పుడూ సెక్స్ కోరుకుంటారనే అపోహ కూడా దీనికి కారణమే. అయితే ఇది కరెక్ట్ కాదు. చిన్నవయసునుంచి లైంగిక దాడికి గురయ్యే మగవాళ్లూ ఉంటారని తెలియజెప్పాలి. రేప్ అనేది స్త్రీ, పురుషుడు ఇద్దరికీ సమానస్థాయిలోనే ఉంటుందని, పురుషులూ అత్యాచారానికి గురవుతారని తెలియజెప్పాలి.
మూడో అపోహ - పోర్న్ చూస్తే శృంగారం గురించి పూర్తిగా తెలిసినట్టే..పోర్న్ అంటే అశ్లీలం.. అది శృంగారం కాదు.. ఈ విషయం అబ్బాయిలకు గట్టిగా చెప్పాలి. సెక్స్ ఎడ్యుకేషన్ కు పోర్న్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కాదని వారు బాగా తెలుసుకోవాలి. ఫోర్న్ ఎక్కువగా చూడడం వల్ల సెక్స్ కు సంబంధించిన సున్నితత్వం పోయి.. మొరటుగా మారే ప్రమాదమూ ఉంది. ఆ విషయం వారికి అర్థమయ్యేలా గట్టిగా చెప్పాలి.
నాలుగో అపోహ - పురుషులకు భావప్రాప్తి అయితే సెక్స్ అయిపోయినట్టే...వైవాహిక జీవితంలో కలతలకు ఇదే చాలా పెద్దా కారణంగా మారుతుంది. చాలామంది పురుషులు తమకు భావప్రాప్తి కాగానే.. సెక్స్ ఆపేసి అటు తిరిగి పడుకుంటారు. తన భాగస్వామి సంతృప్తి చెందారా లేదా అనేదానితో సంబంధం లేకుండా వ్యవహరిస్తారు. ఇది చాలా స్వార్థపూరితమైన ఆలోచన. చిన్నతనంలోనే ఈ విషయంలో అవగాహన వస్తే..వ్యక్తిగానే కాదు.. భాగస్వామిగా కూడా మంచి మార్కులు కొట్టేస్తారని చెప్పాలి.
ఐదో అపోహ - సెక్స్ గంటల తరబడి జరుగుతుందిఫోర్న్ ఎక్కువగా చూడడం వల్ల అబ్బాయిల్లో సెక్స్ అనేది గంటల తరబడి ఉంటుందని, ఉండాలనే అపోహ ఏర్పడుతుంది. అయితే ఇందులో నిజం లేదు. పోర్న్ లో చూపించినట్టుగా గంటలు గంటలు చేస్తే.. బాధ తప్ప సంతోషం ఉండదు. పైగా ఇద్దరికీ తీవ్రమైన అసౌకర్యంగా ఉంటుంది.

Latest Videos

click me!