చీట్ చేస్తున్నారని తెలిసినా.. వాళ్లతోనే...తాజా సర్వే

First Published | Dec 2, 2019, 2:26 PM IST

 తమ డేటింగ్ పార్టనర్.. తమను చీటింగ్ చేస్తున్నారని తెలిసినప్పటికీ.. గుడ్డిగా వాళ్లనే పట్టుకొని వేలాడుతున్నట్లు తేలింది. కేవలం 11శాతం మంది మాత్రమే డేటింగ్ లో నమ్మకంగా, నిజాయితీ ఉంటున్నారట. 

ప్రస్తుత కాలంలో యువత పాశ్చాత్య సంస్కృతికి బాగా ఆకర్షితులౌతున్నారు. ఈ నేపథ్యంలోనే.. టీనేజ్ కి రాగానే.. డేటింగ్ లు మొదలెడుతున్నారు. అయితే.. ఈ డేటింగ్ లపై 16 నుంచి 21ఏళ్ల వయసుగల యువతీ యువకులపై తాజాగా ఓ సంస్థ జరిపిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
డేటింగ్ పేరిట.. చాలా మంది యువకులు.. యువతులను శారీరకంగా, లైంగికంగా వేధిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది.  53శాతం మంది తాము లైంగిక, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురయ్యామని ఈ సర్వేలో తెలియజేయడం విశేషం.

కాగా.. కొద్ది మాత్రమే.. వేధింపులు మొదలవ్వగానే.. ఆ రిలేషన్ కి పులిస్టాఫ్ పెడుతున్నారట. మిగిలిన వారంతా ఆ వేధింపులను భరిస్తూ ఉండటం గమనార్హం.
ఇంకొందరైతే.. తమ డేటింగ్ పార్టనర్.. తమను చీటింగ్ చేస్తున్నారని తెలిసినప్పటికీ.. గుడ్డిగా వాళ్లనే పట్టుకొని వేలాడుతున్నట్లు తేలింది. కేవలం 11శాతం మంది మాత్రమే డేటింగ్ లో నమ్మకంగా, నిజాయితీ ఉంటున్నారట.
ఇక కొందరైతే.. శాడిస్టుల్లాగా ప్రవర్తిస్తూ.. తమ డేటింగ్ పార్ట్ నర్ శరీరంపై వస్తువులతో గాయాలు కూడా చేస్తున్నారట.
మరో 40శాతం మంది.. సన్నిహితంగా ఉన్నంత వరకు బాగానే ఉండి.. రిలేషన్ బెడిసి కొట్టిందీ అనగానే.. బెదిరింపులకు పాల్పడుతున్నారట. తమకు తెలియకుండా నగ్న ఫోటోలు, వీడియోలు తీసి.. ఆ తర్వాత వాటిని చూపించి క్యాష్ చేసుకుంటున్న వారు కూడా ఉన్నారని తెలిసింది.
కొందరు బెదిరించి, భయపెట్టి మరీ అత్యాచారాలకు పాల్పడుతున్నారట. ఈ సమస్యలన్నింటినీ తాము ఎదుర్కొన్నామని  16నుంచి 21ఏళ్లలోపు యువతులు చెప్పడం గమనార్హం.

Latest Videos

click me!