ఏ బంధంలో ఒకరి కోసం ఒకరు జీవించకపోయినా.. దాంపత్య జీవితంలో మాత్రం ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా జీవించాల్సిందే. అలా జీవించినప్పుడే వారి బంధం ఆనందంగా సాగుతుంది. అయితే.. ఆ దాంపత్య బంధం అందంగా.. ఆనందంగా సాగాలంటే.. కొన్ని సార్లు.. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలట. అలాగే.. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వ కూడదట. ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలో.. ఏ విషయంలో అవ్వకూడదో ఇప్పుడు చూద్దాం..
undefined
దాంపత్య బంధంలో ఒకరికి మాత్రమే ప్రేమ కలిగి ఉంటే సరిపోదు. ఆ బంధాన్ని నిలపుకోవాలనే తాపత్రయం ఇద్దరికీ ఉండాలి. అలా అని.. మీ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల్లో ఇద్దరికీ ఒకే అభిప్రాయం ఉండాలనే రూల్ ఏమీ లేదు.
undefined
మీ వాదనే ఎప్పుడూ కరెక్ట్ అవుతుందని వాదించకూడదు. ఒక్కోసారి భార్య చెప్పిన విషయాన్ని కూడా వింటే తప్పేమీ లేదు. వారి ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి విషయంలో కాంప్రమైజ్ అవ్వొచ్చు. గొడవ పడకుండా ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే సరిపోతుంది.
undefined
మీరు ఒంటరిగా సంబంధంలో ఉండలేరు. మీ సంబంధాన్ని సజీవంగా ఉంచడానికి మీరిద్దరూ సమానంగా పని చేయాలి. ఒకరి నిర్ణయానికి మరొకరు గౌరవం ఇవ్వాలి. అప్పుడు బంధం ఆనందంగా సాగుతుంది. ఇద్దరికీ ఏదైనా విషయంలో వాదన వస్తే.. అది పెద్దదదిగా మారే ప్రమాదం ఉంది అని అనుమానం వస్తే.. దాని బదులు కాంప్రమైజ్ అవ్వడమే సరి.
undefined
అయితే.. ఇదే విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాకూడని సందర్భాలు కూడా ఉన్నాయట. మీ పార్ట్ నర్ మనసు కష్టపెట్టడం ఇష్టంలేక.. కొందరు ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకూడదట.
undefined
అందులో మీ వైపు ధర్మం ఉన్న సందర్భంలోనూ మీ మాట నెగ్గకపోతే.. అక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అయిపోతే మీ విలువ తగ్గిపోతుంది. కాబట్టి.. ఎక్కడ తగ్గకూడదో కూడా తెలుసుకోవడం ఉత్తమం.
undefined
రాజీలు విభేదాలకు ఎక్కువ అవకాశం ఇస్తుంటే.. అదేవిధంగా మీ ముందు ఉన్న సమస్యను పరిష్కరించకపోతే,మీరే ఎక్కువ బాధపెడుతారనే విషయాన్ని గుర్తించాలి.
undefined
ప్రయత్నం తర్వాత కూడా, మీరిద్దరికీ సమస్య పరిష్కారం కాకపోతే.. ఎన్నిసార్లు కాంప్రమైజ్ అయినా కూడా సమస్యకు పరిష్కారం దొరకపోతే.. అలాంటి దంపతులు విడిపోవడమే సమస్యకు పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.
undefined