శృంగారంలో పాల్గొనే సమయంలో నొప్పి అసౌకర్యంగా అనిపిస్తోందా! అయితే ఇలా ప్రయత్నించండి..

First Published | Dec 29, 2021, 5:58 PM IST

శృంగారం (Romance) అనేది వైవాహిక జీవిత ప్రయాణంలో చాలా ముఖ్యమైనది. శృంగారం అనేది బంధాన్ని మరింత బలపరుస్తుంది. అయితే చాలామంది శృంగారం పట్ల సరైన అవగాహన (Awareness) లేక ఆ మధుర క్షణాలను పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. దీనికి కారణం శృంగారం పట్ల వారిలో అనేక సందేహాలు ఉండడం. అయితే చాలామంది శృంగార సమయంలో ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య నొప్పి. శృంగారంలో పాల్గొనే సమయంలో నొప్పి కలిగి అసౌకర్యంగా ఉంటుందని కదలికను పూర్తిగా ఆస్వాదించలేక పోతున్నామని అంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా శృంగారంలో పాల్గొనే సమయంలో నొప్పి, అసౌకర్యం నుంచి విముక్తి పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
 

చాలామంది శృంగార విషయాన్ని ఇతరులతో చర్చించడానికి సిగ్గుపడుతుంటారు. అందుకే వారు కలయికలో పాల్గొన్నప్పుడు కలిగే నొప్పి గురించి ఇతరులతో చర్చించడానికి ఇష్టపడరు. వారి సమస్యలకు పరిష్కారం (Solution) దొరకకపోగా ఆ సమస్య మరింత ఇబ్బందిని (Trouble) కలిగిస్తుంది. అయితే కలయికలో పాల్గొనే సమయంలో నొప్పి కలగడం సాధారణం.
 

ఈ సమస్య అందరిలోనూ ఉండదు కొంత మందిలో మాత్రమే ఉంటుంది. ఈ విషయం గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు (Precautions) తీసుకుంటే నొప్పి (Pain) నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే కలయికలో పాల్గొనే సమయంలో నొప్పి కలిగితే మీ ఇద్దరిదీ అని గ్రహించి భాగస్వామికి మీ సమస్య గురించి తెలియజేయాలి.

Latest Videos


అప్పుడే మీకు కలయికలో కలిగే నొప్పికి గల కారణమేంటో, దాని నివారణకు (Prevention) తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవచ్చు. కలయిక సమయంలో కాస్త నొప్పి ఉండడం సాధారణం (Casual). అయితే ఈ సమస్య ఎప్పుడూ మిమ్మల్ని మరింత ఇబ్బంది కలిగిస్తుంటే వైద్య నిపుణులను సంప్రదించడం అవసరం. అప్పుడే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 
 

భాగస్వామితో కలిసి కలయికలో పాల్గొనే సమయంలో చాలా నొప్పి ఉంటే యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (Urinary tract infection), ఈస్ట్రోజెన్ లెవెల్స్ (Estrogen levels) తక్కువగా ఉండటం వంటి ఇతర సమస్యలు ప్రధాన కారణాలు కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు. నొప్పి నివారణ కోసం ఏం చేయాలంటే మనసును ఆ కార్యం కోసం స్థిరంగా ఉంచుకోవాలి. మనసులో ఎలాంటి సందేహాలు ఆలోచనలు ఉండరాదు.
 

కేవలం ఆ కార్యం పైనే మీ ఏకాగ్రత (Concentration) ఉండాలి. ఇలా చేస్తే నొప్పి భావన కలగదు. అయితే నేరుగా కలయికలో పాల్గొనరాదు. భాగస్వామితో శృంగార భరితమైన కబుర్లు చెబుతూ వారిలో శృంగార కోరికలను (Erotic desires) పెంచాలి. వారి శరీరంలోని కామ నాడులను ఉత్తేజ పరచడానికి శరీర భాగాలను సున్నితంగా తడుముతూ వారిలో లైంగిక ఆసక్తిని పెంచాలి.

ఇలా వారిని ఆ కార్యానికి సిద్ధం చేయాలి. కలయికకు ముందు ఫోర్ ప్లే (Foreplay) ని ట్రై చేసి తర్వాత ఆ కార్యంలో పాల్గొంటే ఆ కార్యం మరింత రసవత్తరంగా మారి మీకు అసౌకర్యం, నొప్పి అనేది ఉండదు. ఎప్పుడూ ఒకే భంగిమలు ట్రై చేయకుండా కొత్త పద్ధతిలో పాల్గొంటూ మీకు అనువైన భంగిమలు ట్రై చేయండి. అప్పుడే మీకు అసౌకర్యం (Discomfort), నొప్పి అనేవి ఉండవు.

click me!