సాధారణంగా ఒక బంధం లో గొడవలు జరిగినప్పుడు విడిపోయే వారి సంగతి పక్కన పెట్టండి. కానీ కొందరు కుటుంబం కోసమో సమాజం కోసం ఆలోచిస్తూ ఉంటారు. లేదంటే రేపటి రోజు బాగుంటుంది, అవతలి వ్యక్తి మారతారు అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మీరు మీ బంధం కాపాడుకోవాల్సినంత విలువైనదేనా..
లేదంటే సమాజం కోసం ఆలోచిస్తూ మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారా ఒక్కసారి చూద్దాం. సాధారణంగా మీ బంధం గట్టిగా ఉన్నప్పుడు ఎన్ని గొడవలు జరిగినప్పటికీ ఆ బంధాన్ని, భాగస్వామిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు బంధాన్ని కాపాడుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి చూడవచ్చు.
కానీ గొడవ జరిగిన ప్రతిసారి ఇదేం జీవితం రా బాబు అనుకునే వాళ్ళు మాత్రం బంధానికి విలువ ఇవ్వకుండా పరిష్కారం కోసం వెతుక్కోవచ్చు. పొద్దున్న గొడవ జరిగి సాయంత్రం ఏమాత్రం ఆలోచించకుండా జంటగా కలిసి బయటికి వెళ్తున్నారు అంటే ఆ బంధం విలువైనదే అని గ్రహించండి.
అలా కాకుండా అదే గొడవని పదేపదే సాధిస్తుంటే ఆ రిలేషన్ ప్రమాదంలో పడినట్లే. ఎంత గొడవ జరిగినప్పటికీ మీ భాగస్వామిని వదిలి మీరు ఉండలేకపోతున్నట్లయితే ఆ బంధం విలువైనది.
అలా కాకుండా మీ భాగస్వామి సమక్షంలో మీరు భయాందోళనలకు గురవుతున్నట్లయితే మీ బంధం కాపాడుకోవలసిన అంత విలువైనది కాదు అని గ్రహించాలి. అలాగే గొడవ జరిగినప్పుడు ఆ గొడవని మూడో వ్యక్తి దగ్గరికి మీరు గాని మీ భాగస్వామి తీసుకు వెళ్లలేదు అంటే మీ బంధం విలువైనదని అర్థం.
అలాంటి బంధాన్ని కాపాడుకోవడం కోసం వేచి చూసిన తప్పులేదు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి సమాజం కోసం ఆలోచించి విలువ లేని బంధం కోసం విలువైన జీవితాన్ని పాడు చేసుకోకండి.