ప్రస్తుతం అందరూ వన్ నైట్ స్టాండ్ కోసం తెగ తాపత్రయపడుతున్నారు. అది కాపురాలను కూల్చేస్తుందన్న విషయం తెలిసి కూడా దానిపైనే ఆసక్తి పెంచుకుంటున్నారు.
ఒక రాత్రి సంబంధం. తెల్లారగానే, ఎవరికివారే. ఎవరి జీవితాలు వారివే. మళ్లీ కలుసుకోవచ్చూ, కలుసుకోలేకపోవచ్చూ. కలుసుకుంటే వారికి నచ్చితే వారి బంధాన్ని కొనసాగించొచ్చు. నచ్చకుంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు. కల్చర్ లైఫ్ అనే పేరిట వన్ నైట్ స్టాండ్ పేరిట పరాయి స్త్రీ తో ఎంజాయ్ చేస్తున్నారు.
ఇలాంటి వన్ నైట్ స్టాండ్ లో ఓ యువకుడు చిక్కుకున్నాడు. ఆ తర్వాత దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమౌతూ తన బాధను నిపుణులతో పంచుకున్నాడు.
‘‘ నాకు ఇరవై సంవత్సరాలు. నాకో గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె తరచూ హౌస్ పార్టీలకు వెళుతూ ఉంటుంది. అలా నన్ను కూడా రెండుసార్లు పార్టీలకు ఆహ్వానించింది. నేను కూడా వెళ్లాను. అక్కడ బాగా డబ్బు ఉన్నవాళ్లు చాలా మంది యువతీ యువకులు వచ్చారు. కొద్ది సేపటి తర్వాత ఎవరితో ఎవరికీ పరిచయం లేకున్నా.. వారితో సెక్స్ ఎంజాయ్ చేశారు. నేను కూడా రెండుసార్లు... ఇద్దరు యువతులతో గడిపాను. కానీ వాళ్లు చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ.. నాకే ఏదో తప్పు చేశామనే భావన కలుగుతోంది. అసలు ఇలా చేయడం కరెక్టేనా.. దీని వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తుందా అనే భయం వేస్తోంది’’
అంటూ ఓ యువకుడు ఇటీవల నిపుణులను ఆశ్రయించాడు. దానికి వారు ఏం సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
ఈ మధ్యకాలంలో చాలా మంది వన్ నైట్ స్టాండ్ పేరిట విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దీని వల్ల కుటుంబానికి ఎలాంటి సమస్య రాదు. దీని వల్ల ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా రావు. అయితే.. తప్పు చేశామని భావన కలిగితే మాత్రం దూరంగా ఉండటమే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
పరిచయం లేని వారితో శృంగారంలో పాల్గొనే సమయంలో.. సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మీ కారణంగా వారికి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అంతేకాకుండా.. మీ వల్ల.. వారికీ.. వారి వల్ల మీకు ఎలాంటి సుఖ వ్యాధులు కూడా రాకుండా ఉండాలంటే కండోమ్ లాంటివి ధరించడం తప్పనిసరి.
ఇక ఇలాంటి పార్టీలు తరచుగా వెళుతూ వాటికి వెళ్లడం అలవాటు అయితే.. జీవితంలో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంతైనా ఇలాంటి వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.