కట్టుకున్న భర్త శ్రీరామ చంద్రుడిలా ఉండాలని.. తనని తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడకూడదని.. కనీసం నిద్రలో కూడా కలవరించకూడదని చాలా మంది స్త్రీలు కోరుకుంటారు. అయితే... ఓ స్త్రీ మాత్రం.. తాను కట్టుకున్న భర్త పోర్న్ ని వ్యసనంగా మార్చింది.
ఆ దెబ్బ ఆమె కాపూరాన్నే కూల్చేసింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళితే... బెంగళూరుకు చెందిన మహిళ(32) ఓ ప్రముఖ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఆమె భర్త(33) ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమె కోల్ కత్తాకు చెందిన మహిళ కాగా... అతనిది ఉత్తరప్రదేశ్.
ఓ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడగా.. 2018లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. పెళ్లైన నాటినుంచి దంపతులిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు.
అయితే.. సదరు మహిళా డాక్టర్ కి పోర్న్ చూడటం అలవాటు. ఆమె భర్త మాత్రం వీటికి దూరంగా ఉండేవాడు. ఆమెకు శృంగారంలో వివిధ భంగిమలు ట్రై చేయాలని కోరికగా ఉండేది.
దీంతో... భర్తకు పోర్న్ చూసే అలవాటు ఉంటే.. వివిధ భంగిమల్లో శృంగారాన్ని ఆస్వాదించవచ్చు కదా అని సంబరపడింది. భర్త వద్దు అన్నా వినిపించుకోకుండా... బలవంతంగా అతనికి ఆ వీడియోలు చూపించడం మొదలుపెట్టింది.
తొలుత.. వాటిని చూడటం పట్ల పెద్దగా ఇంట్రస్ట్ చూపించని అతను.. తర్వాతర్వాత వాటిని ఆస్వాదించడం మొదలుపెట్టాడు. వాటిని చూసి.. అచ్చంగా అదేవిధంగా బెడ్రూమ్ లో రెచ్చిపోయేవాడు.
ఇద్దరూ ఆనందంగా సాగిపోతున్నారనగా... వారి కాపురంలో ఓ బాంబు పడింది. ఈమె నాకు వద్దూ అంటూ.. భర్త కోర్టుకి ఎక్కాడు. అసలు ఏం జరిగిందో అర్థంకాక భార్యకు పిచ్చెక్కిపోయింది.
ఏం జరిగిందని భర్తను ఆరాతీయగా.. అతనికి పోర్న్ వీడియోల్లో భార్య కనిపించింది. దీంతో కంగుతిన్నాడు. సదరు మహిళకు గతంలో ఓ వ్యక్తిని ప్రేమించింది. కొంతకాలం కలిసి కూడా ఉంది. అయితే... అతనితో దూరమైన తర్వాత ఈ టెక్కీని పెళ్లాడింది.
ఆ విషయం ముందుగానే ఆమె అతనికి చెప్పింది. తెలిసే పెళ్లి చేసుకున్నాడు. అయితే... సడెన్ గా ఇప్పుడు వీడియో కనిపించడంతో దానిని చూసి తట్టుకోలేకపోయాడు.
వెంటనే తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. అయితే.. ఆమె మాత్రం నాకు విడాకులు వద్దూ అంటూ వేడుకుంటుంది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఆ వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. తన భర్తకు కూడా అతనే ఆ వీడియో పంపాడని ఆమె చెబుతోంది.
కాగా.. ఇద్దరి వాదనలను విన్న ఫ్యామిలీ కోర్టు... విడివిడిగా ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇస్తోంది.