శృంగారం రెండు శరీరాల మేళవింపులో జరిగే ఓ అద్భుతమైన క్రీడ. మానసిక, శారీరక ఆరోగ్యాలను మెరుగుపరిచే ఆట. ఆ రతిక్రీడలోని ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే దానికి టెక్నిక్స్ తెలియాలి. పట్టువిడుపులపై అవగాహన ఉండాలి. ఏ భంగిమలో చేస్తే ఎలాంటి అనుభూతి దక్కుతుందో నిరంతర సాధన చేయాలి.
ఇదంతా జంటలు వారంతట వారే చేయాల్సిన ప్రయత్నం. తమ సంసారజీవితం బాగుండడానికి.. తమ అనుబంధం మరింత మెరుగుపడి మానసికంగా, శారీరకంగా పెనవేసుకుపోవాలంటే అది తప్పనిసరి.
అందుకే మన పూర్వీకులు శృంగారం మీద రతిక్రీడలోని రసపట్ల మీద కామసూత్ర అనే గ్రంథాన్నే రాశారు. శతాబ్దాల పురాతనమైన ఆ కామసూత్ర తమ సంసారాన్ని కాపాడిందంటూ చెబుతున్నారు ఓ యువజంట.
వారి అనుభవాలు వారి మాటల్లోనే వింటే.. పూర్వీకులు మనకోసం దాచి ఇచ్చిన మంచి గిఫ్ట్ లలో కామసూత్ర ఒకటి. ఇందులోని శృంగార నియమాలు ఇప్పటికీ చక్కగా అన్వయించుకునేలా ఉన్నాయి.
నేటి బిజీ లైఫ్ లో శృంగారం తూ,తూ మంత్రంగా మారిపోయింది. ఏదో కానిచ్చేశాం అన్నట్టుగా ముగించేస్తున్నారు. ఉద్యోగాలు, డబ్బు సంపాదన ఇవే లోకంగా మారిపోయాయి.
మా శృంగారానుభవాల్ని ఎలా మెరుగు చేసుకోవాలే అర్థం కాలేదు. మేమిద్దరం కలిసి గడిపే సమయమే చాలా కష్టంగా మారిపోయింది. ఎంతలా ప్రయత్నించినా ఇద్దరం ఎక్కువ సేపు కలిపి గడపలేకపోతున్నాం. దీంతో మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గిపోతున్నట్టుగా అనిపించింది.
మేము చివరిసారిగా 10 నిమిషాల కన్నా ఎక్కువ సెక్స్ చేసినట్లు నాకు గుర్తులేదు! అది కూడా చాలా అరుదుగా జరుగుతుంది. ఇది మా ఇద్దరిలో అసంతృప్తిని నింపింది.
ఇదే టైంలో అనుకోకుండా ఓ సారి నెట్ బ్రౌజ్ చేస్తుంటే కామసూత్ర గురించి తెలిపింది. దాన్ని చదవడం ప్రారంభించారు. నా భాగస్వామితో చెప్పి తనతో కూడా చదివించా. అవి చదివి మేము ఆశ్చర్యపోయాం.
వాటిని మేము పడకగదిలో ట్రై చేసినప్పుడు అద్భుతంగా ఉంది. ఎంతో ఫ్లెక్సిబుల్ మూమెంట్స్, రకరకాల పొజిషన్స్.. అన్నీ చాలా చాలా సౌకర్యవంతంగా ఎలాంటి నొప్పి కలిగించకుండా చేయగలిగాం.
దాంతో మా శృంగార జీవితం మెరుగుపడింది. నిజం చెప్పాలంటే సెక్స్ టాయ్స్, సెల్ఫ్ ప్లెజర్ కానీ దీనిముందు ఎందుకూ పనికిరాదు. మీరు ఎప్పుడూ చూడని స్వర్గసుఖం దొరుకుతుంది.
మొదటి సారి ట్రై చేశాక.. చాలా సంతృప్తి పొందాం. ఇంకా ఇంకా వేరే భంగిమలు ట్రై చేయడానికి మేము కామసూత్రను బాగా చదివాం. దీనివల్ల నేను, నా భర్త ఎంతో దగ్గరయ్యాం. అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా మా మధ్య బంధం ఏర్పడింది.
రోజువారీ మామూలుగా చేసే రతిక్రీడ కంటే ఒక్కసారి కామసూత్ర చదివితే... దాంట్లోని అనుభూతిని ఆస్వాదించగలిగితే.. అసలు శృంగారం అంటే ఏమిటో మీకే అర్థమవుతుంది.
రోజువారీ మామూలుగా చేసే రతిక్రీడ కంటే ఒక్కసారి కామసూత్ర చదివితే... దాంట్లోని అనుభూతిని ఆస్వాదించగలిగితే.. అసలు శృంగారం అంటే ఏమిటో మీకే అర్థమవుతుంది.