అతనితో ఉంటే ప్రేమ కాదు.. ఆందోళనగా ఉంటోందా..?

First Published | May 17, 2021, 1:38 PM IST

మీ బంధం కూడా అంతే ఆందోళనగా ఉందా లేదా తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే నిపుణులు చెబుతున్న ఈ కిందవి చూడండి.. అప్పుడు మీకే క్లారిటీ వస్తుంది.
 

ప్రేమ అనేది జీవితంలో చాలా మధురమైనది. ఒకరి కోసం ఒకరు అనే భావన కలిగేది ప్రేమలో మాత్రమే. ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే.. ఎంతో హాయిగా.. ప్రశాంతంగా ఉంటుంది. అయితే.. మీ విషయంలో అలా జరగడం లేదా..? ప్రేమించిన వ్యక్తితో మాట్లాడినా.. మెసేజ్ చేసినా.. చాలా టెన్షన్ గా ఉంటోందా..? ఆందోళన కలుగుతుందా..? అయితే ఈ బంధం సమస్యలో ఉన్నట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.
కొందరి మూడ్ స్వింగ్స్ నిమిష నిమిషానికి మారుతూ ఉంటాయి. దాని వల్ల తమ పార్ట్ నర్ ఇబ్బంది పడుతుండటం.. ఎప్పుడు తమ బంధం విడిపోతుందా..? బ్రేకప్ అయిపోతుందా అనే భయం ఉండకూడదట. అలా కనుక వాళ్లు నిజంగా.. ప్రశాంతంగా ఉండలేరట. మానసిక సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుందట.

మీ బంధం కూడా అంతే ఆందోళనగా ఉందా లేదా తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే నిపుణులు చెబుతున్న ఈ కిందవి చూడండి.. అప్పుడు మీకే క్లారిటీ వస్తుంది.
చాలా మంది తాము ఒత్తిడిలోకి వెళ్తున్నామనే విషయాన్ని తొందరగా గుర్తించలేరు. అలా కాకుండా.. మీరు చాలా విషయాల్లో , చిన్న చిన్న విషయాల్లో కూడా ఒత్తిడికి గురౌతున్నారు అని గుర్తిస్తే.. అదే మీ తొలి ఇండికేటర్ గా భావించాలి.
చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందడం.. మీ నార్మల్ సంభాషణకే ఏడవడం లాంటివి చేస్తున్నారంటే,.. మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లే అర్థం. మీ బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లేనని గుర్తించాలి.
మీ పార్ట్ నర్ తో ఏదైనా విషయంలో మీరు ఇబ్బంది పడుతుంటే... ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పితీరాలి. అలా చెప్పలేకపోతే.. మీరే ఎక్కువ ఇబ్బందిపడతారనే విషయాన్ని గుర్తించాలి. ఆ విషయం చిన్నదా.. పెద్దదా అని కాకుండా.. మిమ్మల్ని ఇబ్బంది పెడితే కచ్చితంగా చెప్పితీరాలి.
అతి ఎప్పుడైనా ప్రమాదమే. అది ఏదైనా సరే. మితంగా ఉన్నంత వరకు ఏదైనా బాగానే ఉంటుంది. అది ఆలోచన విషయంలోనూ వర్తిస్తుంది. ఎక్కువ ఆలోచనలు కూడా ప్రమాదమేనట.
మీ పార్ట్ నర్ తో ఏదైనా విషయం మాట్లాడిన తర్వాత దాని గుర్తించి ఎక్కువ సేపు ఆలోచించడం.. దాని గురించి బాధపడుతున్నారంటే.. మీరు సమస్యలో ఉన్నట్లేనని గుర్తించాలి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు.
ఈ ఆలోచనల నుంచి బయటపడాలి అంటే... ప్రశాంతంగా కూర్చొని ఓ పది నిమిషాలు ఊపిరి తీసుకోవాలి. ఊపిరి తీసుకుంటూ.. వదులుతూ.. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా చేయడం వల్ల అతి ఆలోచనల నుంచి బ్రేక్ దొరుకుతుంది. మీకు కాస్త రిలీఫ్ గా ఉంటుంది.

Latest Videos

click me!