మీ భర్త మిమల్ని మోసంచేస్తున్నాడా..? ఇవే సంకేతం..!

First Published | Jun 2, 2021, 11:31 AM IST

ప్రతి నలుగురు జంటలలో ఒకరు తమ పార్ట్ నర్ ని మోసం చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. అయితే.. ఇది అందరి విషయంలోనూ జరగాలనే రూల్ ఏమీ లేదు. 

మీ పార్ట్ నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడని మీకు అనుమానంగా ఉందా..? మీతో కాకుండా.. మరెవరితో అయినా రిలేషన్ లో ఉన్నారని డౌట్ గా ఉందా..? అయితే.. ఇదిగో.. ఇలా తెలుసుకోవ్చట. మోసం చేసేవారికి ఈ సంకేతాలతో సులభంగా గుర్తించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ప్రతి నలుగురు జంటలలో ఒకరు తమ పార్ట్ నర్ ని మోసం చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. అయితే.. ఇది అందరి విషయంలోనూ జరగాలనే రూల్ ఏమీ లేదు. అయితే.. ఇలాంటి అనుమానం వస్తే మాత్రం.. చెక్ చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు.

మామూలుగా రోజూ స్నానం చేయడానికే బద్ధకించే వ్యక్తి.. సడెన్ గా శుభ్రత మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారా..? కొత్త కొత్త టీషర్ట్స్, మంచి లుక్ నిచ్చే డ్రెస్ లు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా..? బయటకు వెళ్లేటప్పుడు ఫర్ఫ్యూమ్ వాడకం ఎక్కువయ్యిందా..? ఇలా చేస్తే అనుమానించాల్సిందే.
మీరు పక్కన ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడటానికి.. మెసేజ్ లు చేయడానికి ఇబ్బంది పడుతున్నారంటే కూడా అనుమానపడాల్సిన విషయమే. మీకు తెలికుండా మాట్లాడే వ్యక్తి ఎవరై ఉంటారో మీరు ఓ లుక్ వేయాల్సిందే. అది కూడా ఒక అమ్మాయితో సీక్రెట్ గా మెసేజ్ చేస్తున్నారంటే.. అదేంటో తెలుసుకునే ప్రయత్నంచేయండి.
గతంలో మీ భర్త ఎప్పుడూ అందుబాటులో ఉంటూ.. సడెన్ గా కొద్ది రోజుల నుంచి మీ నుంచి దూరం మొయింటైన్ చేస్తున్నాడంటే డౌట్ పడాల్సిందే. అంతేకాకుండా బయటకు వెళ్లిన ప్రతిసారీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం లాంటివి చేస్తున్నాడంటే.. కూడా ఒకసారి లుక్ వేయాల్సిందే.
మీరు ఏ తప్పు చేయకపోయినా.. చిన్న చిన్న విషయలకే తప్పు పట్టడం.. మీరు ఏదైనా చెబుతుంటే విసుక్కోవడం, చిన్న విషయాలకే మీ మీద అరవడం లాంటివి చేస్తున్నా కూడా.. మీ మీద ప్రేమ వేరెవరివైపు అయినా షిఫ్ట్ అయ్యిందేమో చెక్ చేసుకోవాలి.
మీతో శృంగారం పట్ల ఆసక్తి చూపించడం లేదా..? కనీసం హగ్ చేసుకోవడం, కిస్ చేయడం లాంటివాటి పట్ల కూడా ఆసక్తి చూపించడం లేదంటే.. వేరే ఇంకెవరితోనైనా పడక సౌఖ్యం కోరుకుంటున్నారమో ఆలోచించాల్సిందే.

Latest Videos

click me!