ప్రెగ్నెన్సీ... మహిళలకు తొమ్మిదినెలల అద్బుతమైన ప్రయాణం. ఎన్నో మూడ్ స్వింగ్స్.. అనుమానాలు, ఆందోళనలు... సంతోషం, ఉత్సుకత కలగలిసి ముప్పిరిగొంటాయి. అనేక రకాల ఆలోచనలు చుట్టుముడతాయి.
అయితే ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారంలో పాల్గొనొచ్చా.. అనేది చాలామందికి రకరకాల అనుమానాలుంటాయి.
అయితే గర్భిణి సమయంలో సెక్స్ అనేది మామూలే. నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే దీనివల్ల కడుపులోని పిండానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
ఆర్గాజమ్ సమయంలో కడుపులోని కండరాల కదలిక.. పురిటినొప్పుల సమయంలో కండరాల కదలికలాగా ఉండదు.
దీనికితోడు కడుపులోని పిండం అమ్మియోటిక్ సాక్ తో కుషన్ చేయబడుతుంది. కాబట్టి.. ఈ సమయంలో సెక్స్ తో పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు.
మీకు ఎలాంటి ఇబ్బంది లేకుంటే డెలివరీ ముందు వరకు అంటే తొమ్మిదినెలలు నిండేవరకు కూడా కొన్ని జాగ్రత్తలతో శృంగారంలో పాల్గొనొచ్చు అని కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు.
మరికొంతమంది డాక్టర్లు దీనికి భిన్నంగా చెబుతున్నారు. డెలివరీకి ముందు వారాల్లో సెక్స్ లో పాల్గొనకుండా ఉండడమే మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే వీర్యం గర్భంలో సంకోచాలను ప్రేరేపిస్తుంది. ఇది పిండాన్ని ప్రభావితం చేయచ్చని చెబుతున్నారు.
ప్రసవం సులభంగా, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కావాలని కోరుకునే మహిళలు శృంగారాన్ని ట్రై చేయచ్చు. కొంతమంది వైద్యులు వీర్యం లోని ప్రోస్టాగ్లాండిన్స్ సహజ పద్ధతిలో పూర్తిస్థాయిలో ప్రసవ నొప్పిని ప్రేరేపిస్తుందని నమ్ముతారు.
అయితే అబార్షన్ హిస్టరీ ఉన్న మహిళలు, అబార్షన్ ప్రమాదం ఉన్న వాళ్లు.. ఈ సమయంలో సెక్స్ ఆలోచనలకు దూరంగా ఉండడమే మంచింది.
దీంతోపాటు.. ప్రెగ్నెన్సీ సమయంలో వెజైనల్ బ్లీడింగ్, డిశ్చార్జ్, కారణం లేకుండా నొప్పులు.. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో సెక్స్ ట్రై చేయకపోవడమే మంచిది.
ప్రెగ్నెన్సీ సమయంలో సమయానికంటే ముందే సర్విక్స్ ఓపెన్ అయినట్లైతే.. గర్భాశయంలో ప్లాసెంటా బాగా కిందికి ఉన్నప్పుడు కూడా సెక్స్ లో పాల్గొనకపోవడమే మంచిది.
కవలలు కానీ ట్రిపులెట్స్ కానీ ఉన్నారని తెలిసినప్పుడు శృంగారానికి దూరంగా ఉండాలి.