ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

First Published | Oct 28, 2020, 1:10 PM IST

నా భార్య మూడు నెలల గర్భవతి. మేమిప్పుడు శృంగారం చేయచ్చా?  మా ఫ్యామిలీ డాక్టర్ ని అడగడానికి మొహమాటంగా ఉంది. ప్రస్తుతానికి మేము దూరంగానే ఉంటున్నాం. కానీ నాకు సెక్స్ మీద కోరిక తీవ్రమవుతుంది. ఏం చేయమంటారు? 

నా భార్య మూడు నెలల గర్భవతి. మేమిప్పుడు శృంగారం చేయచ్చా? మా ఫ్యామిలీ డాక్టర్ ని అడగడానికి మొహమాటంగా ఉంది. ప్రస్తుతానికి మేము దూరంగానే ఉంటున్నాం. కానీ నాకు సెక్స్ మీద కోరిక తీవ్రమవుతుంది. ఏం చేయమంటారు?
మొదటి బిడ్డ పుట్టేసమయంలో ప్రతీ జంటకు అడిగే అత్యంత సాధారణమైన ప్రశ్న ఇది. అయితే జాగ్రత్తలు తెలియకపోవడం, ఏ సమయంలో ఎలా చేయాలి అనే దానిమీద అవగాహన ఉండక పోవడం వల్ల, గర్భం పోతుందన్న అపోహ వల్ల చాలా జంటలు శృంగారానికి దూరంగా ఉంటాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల్లో కలిగే మానసిక పరమైన, భావోద్వేగపరమైన మార్పుల వల్ల తమ భాగస్వామి ఏం కోరుకుంటున్నారో అంచనా వేయడంలో విఫలమవుతుంటారు.
ప్రెగ్నెన్సీ వల్ల శృంగార వాంఛలను కలిగించే హార్మోన్లలో తేడా వస్తుంది. శరీరంలో జరిగే రసాయన మార్పులు స్త్రీలను ప్రసవానికి సిద్ధం చేస్తాయి. ఇదే సమయంలో తాము తల్లి కాబోతున్నామన్న భావన మహిళల్లో కొత్త ఆశలను రేకెత్తించి, లైంగిక వాంఛలను తగ్గిస్తాయి. అయితే పురుషుల్లో ఇలాంటి మార్పులేమీ ఉండవు.
ಗతాము తండ్రి కాబోతున్నామన్న శారీరక, మానసిక పరమైన అవగాహన పురుషులు స్వయంగా పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా శృంగారవాంఛలుంటాయి. ఇలాంటి సమయంలో గర్భిణీగా ఉన్న భార్యను శృంగారానికి బలవంతపెట్టడం సరికాదు. కాకపోతే తనకు కలుగుతున్న కోరికల గురించి భార్యకు సున్నితంగా నొక్కి చెప్పాల్సి ఉంటుంది.
ఈ సమయంలో గర్బిణీలకు లైంగిక వాంఛలు అంత బలంగా కలగవు. కానీ వారు తమ భాగస్వామి నుండి వెచ్చటి కౌగిలిని, తీయటి ముద్దును కోరుకుంటారు. పాంపరింగ్ ను ఇష్టపడతారు. ఇలాంటి సమయంలో ఆమెకు కూడా శృంగార కోరికలు కలిగితే సెక్స్ లో పాల్గొనొచ్చు. అయితే కొన్ని రకాల పొజిషన్లలో మాత్రమే సెక్స్ చేయాల్సి ఉంటుంది.
మిషనరీ పొజిషన్ లో సెక్స్ చేయడానికి దూరంగా ఉండడమే మంచిది. పురుషుడి పైన స్త్రీ ఉండి చేసే భంగిమ ఉత్తమమైనది. దీనివల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. దీంతో గర్భంలోని పిండానికి ఎలాంటి ప్రమాదమూ ఉండే అవకాశం ఉండదు.
మిషనరీ భంగిమలో పురుషుల బరువంతా స్త్రీ మీద పడడం వల్ల గర్భంలోని పిండానికి ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
గర్భం దాల్చిన ఆరు నుండి పన్నెండు వారాల్లో శృంగారంలో పాల్గొనకపోవడమే మంచిది. దీనివల్ల మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రసవానికి రెండు నెలల ముందు నుండే సెక్స్ కు దూరంగా ఉండడం మంచిది. ఈ సమయంలో కలవడం వల్ల అమ్నియోటిక్ ఫ్లూయిడ్స్ లీక్ అయి ప్రమాదానికి దారి తీయవచ్చు.
ఈ సమయంలో స్పూన్ పొజిషన్ కూడా మంచిదే. స్త్రీ, పురుషులు ఒకరివెనుక ఒకరుంది. వారి కాళ్లు పైకి ఉంటాయి. అందుకే దీన్ని స్పూన్ భంగిమ అంటారు. ఈ భంగిమలో ఎవరిమీదీ ఒత్తిడి పడదు కాబట్టి ఇది చాలా జెంటిల్ పొజిషన్ అంటారు. ముఖ్యంగా గర్బిణులను ప్రేమించడానికి మంచి పద్ధతి ఇది.
నాలుగు నుండి ఏడో నెల వరకు కలయికలో ఎలాంటి అభ్యంతరాలూ లేవు. అయితే డాక్టర్లు కనక ఈ సమయంలో ఓరల్ సెక్స్ తో పాటు ఎలాంటి లైంగిక చర్యలూ వద్దని కనక హెచ్చరిస్తే దూరంగా ఉండడమే మంచిది.
గర్భిణీ సమయంలో స్త్రీ శరీరాకృతి మారిపోతుంది. దీంతో పురుషులు సులభంగా వివాహేతర సంబంధాలవైపు దృష్టి పెడతారు. గర్భిణీ సమయంలో స్త్రీల అవసరాలు వేరే ఉంటాయి. వీటిని, వారిలో కలిగే మార్పులను భర్త అర్థం చేసుకోకుండా, వేరే ఆకర్షణలవైపు మొగ్గితే ఆ సంబంధానికి అర్థం ఉండదు.
అలా జరగాలంటే స్త్రీతో పాటు, పురుషుడికీ గర్భం విషయంలో అవగాహన ఉండాలి. నేటి జంటలు ఈ విషయంలో మంచి అవగాహనతో ఉంటున్నాయి. భార్యలను స్వయంగా డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్లడం, సోనో గ్రాఫ్ సెషన్స్ కు హాజరవ్వడం, పిల్లల పేర్ల దగ్గరినుండి బట్టలు, ఎలా పెంచాలి.. ఏ హాస్పిటల్ లో డెలివరీ లాంటి విషయాల్లో ఆసక్తి చూపుతున్నారు. ఇది మంచి పరిణామం.

Latest Videos

click me!