పీరియడ్స్ లో ప్రతి ఐదుగంటలకు ఒకసారి.. ఒక్కో మహిళ 14వేల ప్యాడ్స్

First Published Jun 18, 2020, 11:38 AM IST

ఒకవేళ వాటిని కాల్చితే, ప్రమాదకరమైన రసాయనాలు వెలువడి పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. ఒక ప్యాడ్‌ నాలుగు ప్లాస్టిక్‌ బ్యాగులతో సమానం కాబట్టి, అది భూమిలో పూర్తిగా కలిసిపోయేందుకు 500 నుంచి 800 ఏళ్లు పడుతుంది. 
 

పీరియడ్స్ ప్రతి నెలా బాధిస్తూనే ఉంటాయి. ఐదు రోజులపాటు రక్తస్రావంతో స్త్రీలు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ నెలసరి వచ్చిందంటే చాలు కడుపులో, నడుము నొప్పి తీవ్రంగా వేధిస్తుంది.
undefined
ఈ పీరియడ్స్ సమయంలో మహిళలు శానిటరీ ప్యాడ్స్ వాడుతారన్న విషయం మనకు తెలిసిందే. అయితే... మనం వాడే ఈ ప్యాడ్స్ గురించి కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
undefined
మనదేశంలో శానిటరీ నాప్‌కిన్స్‌ మార్కెట్‌ విలువ ఏడాదికి కొన్ని వేల కోట్ల రూపాయలు. నెలసరి సమస్యలున్న మహిళలు 35 కోట్ల 50 లక్షల మందిగా లెక్క తేల్చారు.
undefined
కానీ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015-2016) లెక్కల ప్రకారం వారిలో 57 శాతం (15 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్నవారు) మంది మాత్రమే పరిశుభ్రమైన ప్యాడ్స్‌ వాడుతున్నట్టు తేలింది.
undefined
మహిళలు వాడి పారేస్తున్న ప్యాడ్స్‌ ఏడాదికి 5,800 కోట్లు ఉంటున్నాయని, వాటివల్ల కాలుష్యం తీవ్రంగా పెరుగుతోందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
undefined
ఒకవేళ వాటిని కాల్చితే, ప్రమాదకరమైన రసాయనాలు వెలువడి పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. ఒక ప్యాడ్‌ నాలుగు ప్లాస్టిక్‌ బ్యాగులతో సమానం కాబట్టి, అది భూమిలో పూర్తిగా కలిసిపోయేందుకు 500 నుంచి 800 ఏళ్లు పడుతుంది.
undefined
అసలు మనం వాడే ప్యాడ్స్ లో ప్లాస్టిక్ వినియోగిస్తారు అన్న విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
ప్లాస్టిక్ తో తయారు చేసిన ప్యాడ్స్ కారణంగా ప్రైవేట్ పార్ట్స్ లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. దాని బదులు కాటన్ తో తయారు చేసినవి వాడితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
undefined
అంతేకాదు.. పీరియడ్స్ సమయంలో ప్రతి ఐదు గంటలకు ఒకసారి ప్యాడ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.లేకపోతే ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది.
undefined
చాలా మంది బ్లీడింగ్ ఎక్కువ కావడం లేదు కదా.. అని అదే ప్యాడ్స్ ని వినియోగిస్తారు. దాని వల్ల ప్యాడ్ లోని రక్తం పచ్చరంగులోకి మారుతుంది. ఆ తర్వాత అందులో ఫంగస్ చేరి కొత్త సమస్యలు ఏర్పడతాయి.
undefined
ఒక మహిళ తన జీవిత కాలంలో 14వేల నుంచి 18వేల ప్యాడ్స్ వినియోగిస్తుంది.
undefined
నాసిరకం ప్యాడ్స్ వాడటం వల్ల కూడా 70శాతం మహిళల పీరియడ్స్ సమస్యను ఎదుర్కొంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
click me!