భార్యపై అనుమానం.. భర్త మైండ్ గేమ్..!

First Published | Jul 26, 2021, 10:53 AM IST

మానసికంగా వారిని బాధపెడుతూ తమలోని భయాన్ని తొలగించుకోవాలని చూస్తారట.  భార్యలపై అనుమానం ఉన్న భర్తలు.. ఎలాంటి మైండ్ గేమ్స్ ప్లే చేస్తారో ఇప్పుడు చూద్దాం..

తమలో తాము అభద్రతా భావంలో ( ఇన్ సెక్యూర్) ఉన్నవారే.. తరచూ ఎదుటివారిపై నిందలు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది పురుషులు. తమలో ఉన్న ఇన్ సెక్యూర్ ఫీలింగ్స్ ని బయటపెట్టకుండా.. ఉండేందుకు.. భార్యలపై నిందలు వేస్తూ ఉంటారు.
అంతేకాదు.. ఈ క్రమంలో డైరెక్ట్ గా నిందలు వేయకుండా.. లో లోపల అనుమానం పెంచుకొని.. మైండ్ గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారట. మానసికంగా వారిని బాధపెడుతూ తమలోని భయాన్ని తొలగించుకోవాలని చూస్తారట. భార్యలపై అనుమానం ఉన్న భర్తలు.. ఎలాంటి మైండ్ గేమ్స్ ప్లే చేస్తారో ఇప్పుడు చూద్దాం.

1. లోలోపల అభద్రతా భావం ఉన్న పురుషులు.. అది కవర్ చేసుకోవడానికి ప్రతిదాన్ని తమ భార్యపై నెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా.. తాము చేసిన పొరపాట్లను కూడా ఎదుటివారిపై నెట్టాలని చూస్తుంటారట. అన్ని తప్పులను తమ భార్యలపై నెట్టేస్తుంటారు. అందరి ముందు మీదే తప్పు అని నిరూపించాలని చూస్తుంటారు.
2. ఇంకొందరు ఎమోషనల్ డ్రామా మొదలుపెడతారు. వాళ్లకు మీ అవసరం లేకున్నా.. ఉన్నట్లు క్రియేట్ చేస్తుంటారు. మీరు వారిపై పెంచుకున్న ప్రేమను పావుగా చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెడతారు. మీ ఎమోషన్ ని టార్గెట్ చేసుకొని.. వారిలో వారే ఆనందపడుతుంటారు.
3.ఇక కొందరు.. తమ అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. నిత్యం తమ భార్యలకు తమ వండిపెట్టేలా.. ఏదైనా ఇంకేదైనా అసవరాలు తీర్చేలా.. ఎప్పుడూ ఏదో ఒక పని చేయించుకుంటూ ఉంటూనే ఉంటారు. ఒకవేళ చేయకపోతే.. తిట్టడం.. ఏదో పెద్ద నేరం చేసినట్లుగా చిత్రీకరిస్తూ ఉంటారు.
4.కొందరేమో.. తమ స్నేహితులను చూసి కూడా అసూయ పడుతుంటారు. భార్యకు తాను తప్ప.. మరెవరూ ఉండకూదడదు అనుకుంటాడు. తన కుటుంబసభ్యులు, స్నేహితులను దూరం చేస్తారు. తాను మాత్రం అందరితో మంచిగా ఉన్నట్లు నటిస్తూ.. వారందరి ముందు భార్యలను చెడ్డవారిగా చూపించాలని చూస్తారు. ఎవరితోనూ మాట్లాడకుండా కంట్రోల్ చేస్తుంటారు.
5.ఏదైనా విషయంలో వాదన జరిగితే.. తప్పంతా మీదే అయ్యేలా మాట్లాడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. అతని మాటలు వింటే.. వేరే వాళ్లకి కూడా నిజంగా భార్యదే తప్పు అనిపించేలా క్రియేట్ చేస్తారు.
6.బయటివారి ముందు చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తూ.. ఎవరూ లేని సమయంలో మానసికంగా వేధించేలా మాట్లాడటం చేస్తారట. మూర్ఖులు అయితే.. దెబ్బ కొట్టి పగతీర్చుకుంటారు. కానీ.. వీళ్లు.. సైకో లాగా.. మాటలతోనే హింసిస్తూ ఉంటారు. ఎవరినైనా నవ్వుతూ పలకరించినా తట్టుకోలేరు.

Latest Videos

click me!