ఒక అమ్మాయి మీతో ఇలా ప్రవర్తిస్తుందా అయితే ఆమె మీ దగ్గర ఇదే కోరుకుంటుంది..?

First Published | Nov 2, 2021, 4:16 PM IST

 చాలా మంది అమ్మాయిలు తమ ప్రేమను (Love) తెలపడానికి సిగ్గు పడుతూ ఉంటారు. తమ ప్రేమను మాటల రూపంలో వ్యక్తపరచడానికి భయపడుతూ కొన్ని సంకేతాలను ఇస్తుంటారు. ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుందో  లేదో తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశం.
 

చాలా మంది అమ్మాయిలు తమ ప్రేమను అబ్బాయిలకు చెప్పకుండా మంచి స్నేహితులుగా (Friends) ఉంటారు. వారి ప్రవర్తనలో తేడాలు ఉన్న కూడా వారు మనసులోని ప్రేమని (Love) బయటపెట్టరు. ఏ అబ్బాయిని ఇష్టపడుతుందో ఆ అబ్బాయి ముందు కంగారుగా తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆమె చేతులు, కాళ్లు కొంచెం వణుకుతూ, కదులుతూ ఉంటుంది.

మీతో మాట్లాడుతున్నప్పుడు తన డ్రెస్ సర్దుకోవడం, జుట్టును సర్దుకోవడం వంటివి చేస్తూ ఉంటుంది. మీరు ఏమి చెప్పినా దానికి సరే అని ఊ కొడుతూ ఉంటుంది. మీరు ఏమీ చెప్పకున్న ఆమె నవ్వుతూ (Smiling) మీ వైపు చూస్తూ ఉంటుంది. తన చూపులు పదే పదే మీ మీద ఉంటాయి. మీరు చూసినప్పుడు తన చూపులు (Glances) పక్కకు తిప్పుకుంటూ జుట్టు సర్దుకోవడం చేస్తుంది.


మిమ్మల్ని చూసినప్పుడు సంతోషంగా (Happy) ఫీల్ అవుతూ ఉంటుంది. మీ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. మీ ఇష్టాయిష్టాలను (Likes) మీ స్నేహితులను అడిగి తెలుసుకుంటుంది. మీ ముందు అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె ఎక్కువ సమయం మీతో గడపడానికి ప్రయత్నిస్తుంది.
 

దీన్ని బట్టి ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుందని అర్థం చేసుకోవాలి. అమ్మాయి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తుంటే తన స్నేహితులకు తన ప్రేమ గురించి ఖచ్చితంగా తెలుపుతుంది. ఆమె నీ గురించి ఎలా భావిస్తుందో తెలుసుకోవాలంటే ఆమె స్నేహితులను (Friends) అడిగి తెలుసుకోవాలి. ఆమె మిమ్మల్ని ఆటపట్టించడం, సరదాగా (Fun) మాట్లాడడం, భుజం తట్టి ఏదో చెప్పడం వంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.
 

ఆమె మీకు దగ్గరవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆమె ప్రవర్తనలోని ఈ మార్పులను బట్టి ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుందని మీకు తెలుస్తుంది. మీకు తరచుగా బహుమతులను (Gifts) ఇస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వారికి గట్టిగా బుద్ధి చెబుతుంది. అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంటే తమరిని  తన హక్కుగా భావించి మీతో చిన్న చిన్న విషయాలకు గొడవ (Conflict) పడుతూ ఉంటుంది.
 

తర్వాత తానే క్షమాపణలు (Apology) చెప్పి సర్దుకుపోతుంది. మీ అన్ని పనుల్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. మీరు వెళ్లే దారి తప్పు అయితే మిమ్మల్ని గట్టిగా మందలించి సరైన దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తుంది. మీరు పదిమందితో ఉన్నప్పుడు మొదట మీకే ఎక్కువ ప్రాధాన్యత (Priority) ఇస్తుంది. తాను చేసే ప్రతి పనీ మీకు చెబుతుంది. మీరు వేరే అమ్మాయితో మాట్లాడితే తనకు నచ్చదు. ఇటువంటివన్నీ మీ ఎదురుగా ఉన్న అమ్మాయిలో కనిపించినట్లయితే ఇంకేంటి ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుంది అని తెలుసుకోవచ్చు.

Latest Videos

click me!