పడక గదిలో సుఖ పెట్టలేని భర్త... ఆ భార్య పరిస్థితి?

First Published | Jun 2, 2020, 3:01 PM IST

ప్రేమ వివాహంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడానికి పెద్దగా ఆస్కారం ఉండకపోవచ్చు. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. తమలో ఉన్న లోపాన్ని దాచిపెట్టి అబ్బాయిలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

పెళ్లి అనగానే దాదాపు అమ్మాయిలంతా ఆనందంతో పొంగిపోతారు. వివాహానంతంరం తమ జీవితం గురించి ముందు నుంచే కలలు కంటూ ఉంటారు.
భర్తతో అలా ఉండాలీ.. ఇలా ఉండాలీ అని ప్రణాళికలు వేసుకుంటారు. తీరా వివాహం జరిగాక.. తాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తలో మగతనం లేదన్న విషయం తెలిస్తే.. ఆ ఇల్లాలి పరిస్థితి ఏంటి..?

ప్రేమ వివాహంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడానికి పెద్దగా ఆస్కారం ఉండకపోవచ్చు. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. తమలో ఉన్న లోపాన్ని దాచిపెట్టి అబ్బాయిలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
తీరా కార్యం సమయానికి వచ్చే సరికి అసలు నిజం బయటపడిపోతుంది.
చాలా మంది అబ్బాయిలు తమలో ఉన్న లోపాన్ని కప్పిపుచ్చి.. సమాజంలో తమకు చెడ్డపేరు రాకుండా ఉండేందుకు.. నిజం దాచి పెళ్లిళ్లు చేసుకున్నవారు ఉన్నారు. అసలు నిజం తెలిసిన తర్వాత ఆ యువతి ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కవచ్చో నిపుణులు సూచిస్తున్నారు.
నిజాల్ని దాచిపెట్టి మోసపూరితంగా పెళ్లి చేసుకునే వాటిని ‘చెల్లకూడని వివాహాలు (వాయిడబుల్‌ మ్యారేజెస్‌)’ అంటారు. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో విడాకుల కోసం ఎక్కువ కాలం ఆగాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలు ఇరువురూ సంయుక్తంగా సిద్ధమైన కేసుల్లో కూడా విడాకుల కోసం కనీసం 6 మాసాల దాకా ఆగాల్సి ఉంటుంది.
అయితే నపుంసకత్వం వంటి కారణాలు ఉన్నప్పుడు మరుసటి రోజే విడాకుల కోసం వెళ్లే వెసులుబాటును చట్టం కల్పించింది.
అతనికి వైద్య పరీక్షలు చేసి.. నిజంగానే మగతనం లేకపోతే.. వెంటనే విడాకులు మంజూరు చేస్తారు.
కేవలం ఇదొక్కటే కాదు.. నయం కాని జబ్బులు కూడా వాయిడబుల్ మ్యారేజ్ జాబితా కిందకు వస్తాయి. ఇలాంటి కేసుల్లో విడాకులు తీసుకోవడంతో పాటు, పెళ్లి సమయంలో ఇచ్చిన కానుకలు, లాంచనాలన్నీ తిరిగి తీసుకోవచ్చు. నష్టపరిహారం కూడా పొందవచ్చు. దీనికి తోడు చేసిన ద్రోహానికి చీటింగ్‌ కేసు వేస్తే అతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడుతుంది.

Latest Videos

click me!