వైవాహిక జీవితం.. ఇద్దరు వ్యక్తులతో ముడిపడి ఉంటుంది. ఇద్దరూ సమానంగా బాధ్యతలు, భారాలు పంచుకుంటేనే వారి జీవితం ఆనందంగా సాగుతుంది. అయితే... కొందరి జీవితం మాత్రం ఆనందంగా సాగదు. ముఖ్యంగా చాలా మంది మహిళలు.. ఇప్పటికీ భర్తల చేతిలో తిట్లు, చివాట్లు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే... ఇలాంటి తిట్లు తినకుండా ఉండకుండా.. భార్యలు.. భర్తలను మెప్పించాలంటే ఏ రాశివారు ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
1.మేష రాశి..ఈ రాశి అమ్మాయిలు చాలా ప్రొటెక్టివ్ గా ఉండాలి. అన్ని విషయాల్లో భర్తకు మద్దతుగా నిలవాలి. భర్త చెప్పిన మాటకు ఎదురు చెప్పుకుండా.. ఓపికగా.. చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలట. అలా ఉంటే.. ఫర్ఫెక్ట్ వైఫ్ అని బిరుదు దక్కుతుందట.
2.వృషభ రాశి..ఈ రాశివారికి తమ భాగస్వామితో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. వీరి దాంపత్య బంధం చాలా బలహీనంగా ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల ఈ సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. ఈ రాశివారికి అసలు తమ భాగస్వామితో ఎలా కమ్యూనికేట్ చేయాలో కూడా సరిగా తెలీదు. దాని వల్లే ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి.
3.మిథున రాశి..ఈ రాశివారు మనసుపరంగా చాలా రొమాంటిక్. కానీ ఎందుకో పెళ్లి అనే విషయం వారికి పెద్దగా నచ్చదు. అయితే..ఈ రాశివారు పెళ్లి చేసుకుంటే.. తమ జీవితభాగస్వామికి అంకితభావంతో ఉంటారు. కానీ కాస్త విసుగు ఎక్కువ. దాని వల్ల భర్తతో విభేధాలు వచ్చే అవకాశం ఉంది.
4.కర్కాటక రాశి..వివాహ బంధాన్ని ఈ రాశివారు చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. ప్రేమ, పెళ్లికి ఈ రాశివారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి.. ఈ రాశివారు తమ పార్ట్ నర్ తో చాలా ఆనందంగా ఉంటారు.
5. సింహ రాశి..ఈ రాశివారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. అందుకే.. పెళ్లి తర్వాత కూడా ప్రేమించిన వారిని మర్చిపోలేరు. ఈ క్రమంలో.. ఈ రాశివారు కొందరు ఇతర సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంది. అది కాస్త.. ఇతర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.
6. కన్య రాశి..ఈ రాశివారు చాలా నిజాయితీగా, నమ్మకంగా ఉంటారు. అయితే.. చిన్న చిన్న విషయాలను బూతద్దంలో చూస్తారు. దాని వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
7. తుల రాశి..ఈ రాశివారికి పెళ్లి ఆలోచన అంటేనే భయం. ఆ భయం.. పెళ్లి తర్వాత కూడా కొనసాగుతూ ఉంటుంది. దీంతో.. ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా విడాకులు తీసుకునే ప్రమాదం ఉంది.
8.వృశ్చిక రాశి..ఈ రాశివారికి తమ పార్ట్ నర్ విషయంలో అభద్రతా భావం ఎక్కువ. మీకు ఎంత ప్రేమ ఉన్నా.. అనుమానం పెంచుకోవడం వల్ల మీ పార్ట్ నర్ కి చిరాకు తెప్పించే ప్రమాదం ఉంది. దాని వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
9. ధనస్సు రాశి..ఈ రాశివారు ఇంట్లో పెద్దల కోసం పెళ్లి చేసుకుంటారు. కానీ.. మనసులో మాత్రం ఒంటరిగా ప్రయాణం చేయాలని.. సాహసాలు చేయాలని ఉంటుంది. ఇవి చేయడం మొదలుపెడితే మాత్రం తేడాలు రావడం ఖాయం.
10. మకర రాశి..ఈ రాశివారు తమ లైఫ్ పార్ట్ నర్ కోసం 100శాతం సమయం కేటాయిస్తారు. ఈ రాశివారికి కలిసి ఉండటం అంటే ఎక్కువ ఇష్టం. కుటుంబానికి, జీవిత భాగస్వామికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరితో జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.
11. కుంభ రాశి..ఈ రాశివారు తమ భాగస్వామితో చాలా ఆనందంగా ఉంటారు. ఫర్ఫెక్ట్ పార్ట్ నర్ కి ఉదాహరణ. అయితే.. ఒక్కసారి వీరి జీవితంలోకి పిల్లలు అడుగుపెట్టాక మొత్తం మారిపోతుంది. పిల్లలను చూసుకుంటే.. భర్తను కాస్త దూరం చేసే ప్రమాదం ఉంది.
12. మీన రాశి..ఈ రాశివారు చాలా అమాయకంగా ఉంటారు. ప్రతి విషయంలోనూ చాలా దయగా ఉంటారు. కనీసం భర్త మోసం చేసినా కూడా ఎదురు ప్రశ్నించరు. మీ వివాహంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా మీ పార్ట్ నర్ తో చెప్పుకున్నప్పుడే సమస్యలు తగ్గుతాయనే విషయాన్ని గుర్తించాలి.