స్త్రీలతో పోలిస్తే.. పురుషుల్లో లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయి అనడంలో సందేహం లేదు. మగావారి మెదడు.. ఒకానొక వయసులో నిత్యం శృంగారం గురించే ఆలోచిస్తూ ఉంటుందట.
అంతెందుకు వారు నిద్రలో కూడా అలాంటి కలలే కంటూ ఉంటారు. ఫలితంగా వారికి తెలీకుండానే నిద్రలో వీర్యం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దీనినే స్వప్న స్కలనం అంటారు.
కలలు రాకపోయినా కూడా స్వప్న స్కలనం జరుగుతుంది. యుక్త వయసులో ఇలాంటివి పురుషుల్లో చాలా కామన్ గా జరగుతుంటాయి. అయితే.. ఇదే అనుభూతి స్త్రీలను కూడా పొందుతారని ఓ సర్వేలో తేలింది.
పురుషులకంటే.. వీర్యం బయటకు వస్తుంది కాబట్టి.. ఈ విషయం బయటపడింది. స్త్రీలకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఈ విషయం ఇన్ని రోజులు బయటపడలేదంటున్నారు పరిశోధకులు.
వారు చెప్పిన దాని ప్రకారం... శృంగారానికి సంబంధించిన కలలు వచ్చినప్పుడు తమకు తెలీకుండానే స్త్రీలు భావప్రాప్తికి గురౌతారని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 40శాతం మంది మగువలు నిద్రించే సమయంలో భావప్రాప్తి పొందుతారని వారు చెబుతున్నారు.
అది కలలో జరిగినప్పటికీ స్త్రీల మొదడు మాత్రం నిజంగా జరిగినట్లే ఫీలౌతుందట. వారు నిద్రించే పొజిషన్ బట్టి ఈ విషయాన్ని తెలియజేయవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు. ఆ సమయంలో.. స్త్రీల ప్రైవేట్ పార్ట్స్ మరింత సున్నితంగా మారతాయని చెబుతున్నారు.