శృంగారంలో రక్షణ.. మహిళలకూ కండోమ్స్

First Published Feb 3, 2021, 11:52 AM IST

పురుషులు కండోమ్స్ వాడటం, మహిళలు గర్భనిరోదక మాత్రలు వాడటంపై చాలా మందికి అవగాహన ఉంది. కానీ.. మహిళల కండోమ్స్ వాడకంపై మాత్రం అవగాహన చాలా మందికి ఉండటం లేదని నిపుణులు చెబుతున్నారు.

శృంగారంలో కండోమ్స్ వాడటం చాలా మందికి నచ్చదు. కానీ కండోమ్ శృంగారానికి చాలా అవసరం. అవాంఛిత గర్భం, సుఖ వ్యాధుల నుంచి రక్షణ మనకు కండోమ్స్ నుంచే లభిస్తుంది.
undefined
అయితే.. చాలా మంది కండోమ్ వాడటం ఇష్టంలేక.. గర్భం రాకుండా ఉండేందుకు మాత్రలు అవీ వాడుతుంటారు. దాని వల్ల గర్భం రాకపోవచ్చు.. కానీ.. ఫ్యూచర్ లో ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. సుఖ వ్యాధులు రాకుండా ఆపలేం. అయితే.. ఇప్పటి వరకు పురుషులు మాత్రతమే కండోమ్స్ వినియోగించేవారు. అయితే.. ఇక నుంచి స్త్రీలు కూడా వాటిని ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
undefined
పురుషులు కండోమ్స్ వాడటం, మహిళలు గర్భనిరోదక మాత్రలు వాడటంపై చాలా మందికి అవగాహన ఉంది. కానీ.. మహిళల కండోమ్స్ వాడకంపై మాత్రం అవగాహన చాలా మందికి ఉండటం లేదని నిపుణులు చెబుతున్నారు.
undefined
స్త్రీలకు కూడా కండోమ్స్ ఉంటాయనే విషయం చాలా మందికి తెలీదు.. తెలుసుకోవాల్సిన అవసరం ఏముందిలే అని చాలా మంది భావిస్తుంటారు. ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా అని చాలా మంది ఫీలింగ్.
undefined
అయితే.. ఆ ట్యాబ్లెట్స్ కన్నా.. మహిళల కండోమ్స్ చాలా ఎక్కువ రక్షణను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవాంఛిత గర్భం రాకుండా ఆపడంతోపాటు.. సుఖ వ్యాధులు రాకుండా ఉంటాయి.
undefined
పురుషులు కండోమ్ కేవలం శృంగారం చేసినంత సేపు మాత్రమే ధరిస్తారు. అయితే.. మహిళలు మాత్రం ఈ కండోమ్స్ ని దాదాపు 8గంటల పాటు ఉంచుుకోవచ్చట. అయినా ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. దీనిని సహజ రబ్బర్, సింథటిక్ రబ్బర్ తో తయారు చేస్తారు.
undefined
స్త్రీలు కండోమ్ ధరిస్తే.. ఇక పురుషులు కండోమ్ ధరించాల్సిన అవసరం ఉండదు. ఇరువురిలో ఒక్కరు ధరిస్తే సరిపోతుంది. ఎలాంటి అలర్జీ లు కూడా రావు.
undefined
అయితే.. కండోమ్ వేసుకునే ముందు ఆ ప్యాకెట్ మీద ఎక్స్ పైరీ డేట్ మాత్రం కచ్చితంగా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అంతేకాకుండా దాని మీద FDA, CE, ISO or Kite mark ఇలా ఏదో ఒక గుర్తు ఉండేలా చూసుకోవాలి.
undefined
కండోమ్స్ వేడి తగేలే ప్రాంతాల్లో ఉంచకూడదు. డ్యామేజ్ అయిన వాడటం వల్ల ఉపయోగం ఉండదు. ప్యాకెట్స్ లో పెడితే.. కండోమ్ త్వరగా పాడైపోతుంది.
undefined
కండోమ్ ని ప్యాకెట్ నుంచి బయటకు తీయడానికి కొరకడం , కత్తెరతో కట్ చేయడం, ఆభరణాలతో లాగడం లాంటివి చేయకూడదు.
undefined
click me!