మీ సెక్స్ ఫాంటసీల గురించి మీ పార్ట్నర్ తో చెప్పారా..?

First Published | Jul 14, 2022, 2:59 PM IST

ఫాంటసీల గురించి ఎదుటివారికి ముఖ్యంగా పార్ట్ నర్ కి చెప్పడం అంత సులువేమీ కాదు. అయితే.. ఆ ఫాంటసీల గురించి పార్ట్ నర్ తో చెప్పాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట.
 

sex

సెక్స్ ఫాంటసీలు చాలా మందికి ఉంటాయి. కొందరి సెక్స్ ఫాంటసీలు సాధారణంగా ఉంటాయి. కొందరికి చాలా వైలెంట్ గా కూడా ఉంటాయి. అయితే.. మనకు ఉన్న ఫాంటసీల గురించి ఎదుటివారికి ముఖ్యంగా పార్ట్ నర్ కి చెప్పడం అంత సులువేమీ కాదు. అయితే.. ఆ ఫాంటసీల గురించి పార్ట్ నర్ తో చెప్పాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట.

sex

మీరు మీ ఫాంటసీల గురించి మాట్లాడాలి అనుకునేటప్పుడు.. వాటిని వారు సౌకర్యవంతంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. మీ ఫాంటసీల గురించి తెలుసుకున్నప్పుడు వారు భయపడేఅవకాశం కూడా ఉంది. కాబట్టి.. మీరు చెప్పేది విని.. మీ పార్ట్ నర్ సౌకర్యవంతంగా ఉంటారు అని భావించినప్పుడు మాత్రమే మీరు ఈ విషయాన్ని వారికి చెప్పాలి. మీ ఫాంటసీలు సాధారణంగా ఉంటే పర్లేదు. కాస్త వింతగా ఉంటే.. వాటిని విని వారు భయపడే అవకాశం ఉంది. కాబట్టి.. వారు మీతో కంఫర్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే చెప్పాలి.


sex

ఇక చాలా మందికి ఫాంటసీల గురించి మాట్లాడేటప్పుడు.. నార్మల్ గా కాకుండా కాస్త రొమాంటిక్ గా కూడా చెప్పొచ్చు.చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే.. రొమాంటిక్ గా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత.. ఇద్దరూ ఒకే మానసిక స్థితికి చేరుకున్న తర్వాత.. మీ ముందు ఉన్న ఫాంటసీలను చెప్పడం మొదలుపెట్టాలి. 

sex

దంపతులు రొమాన్స్, ఫాంటసీల గురించి మాట్లాడుకునేటప్పుడు.. ఇద్దరూ ఏకాంతంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక ఇద్దరూ పరద్యానంగా అస్సలు ఉండకూడదు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. ఇద్దరూ ఒంటరిగా ఉన్నారని నిర్థారించుకున్న తర్వాతే.. ఈ సంభాషణను మీరు మొదలుపెట్టాలి.

ఇక మీరు ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు.. లేదా ఏదైనా ఒత్తిడిలో ఉన్న సమయంలో... ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాలని అనుకోకూడదు. ఇక చాలా మంది మొదలుపెట్టిన టాపిక్ ని వెంటనే ముగించాలని తొందరపడుతూ ఉంటారు. అలా కాకుండా.. ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. మీ భాగస్వామిని బలవంత పెట్టకుండా.. వారికి నచ్చితేనే మీరు ఆ టాపిక్ ని కొనసాగించాలి.

పదాలను బయటకు తీసుకురావడంలో మీకు సమస్య ఉంటే, దృశ్య సహాయాన్ని ఉపయోగించండి. బహుశా మీరు సినిమాలో చూసిన సెక్స్ పొజిషన్‌ని ప్రయత్నించాలని అనుకోవచ్చు; మీ భాగస్వామితో కలిసి సినిమా చూడాలి. ఆ సన్నివేశం వచ్చినప్పుడు, మీరు ఇష్టపడతారని మీ భాగస్వామికి చెప్పండి. తాము కూడా అలానే ప్రయత్నించాలని అనుకుంటున్నట్లు వారికి చెబితే సరిపోతుంది.

Latest Videos

click me!