సెక్స్ సమయంలో నొప్పికి కారణాలు.. తగ్గించే చిట్కాలు

First Published | Oct 14, 2023, 4:30 PM IST

సెక్స్ సమయంలో నొప్పి రావడం చాలా సహజం. కానీ దీనివల్ల లైంగిక ఆనందాన్ని పొందలేరు. సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనలేరు. మరి దీన్ని ఎలా తగ్గించాలంటే? 
 

Benefits of sex for men

సెక్స్ సమయంలో చాలా మంది ఆడవారికి నొప్పి కలుగుతుంది. ఇది సర్వసాధారణం. బాధాకరమైన సెక్స్ ను డైస్పరేనియా అని కూడా పిలుస్తారు. అంటే దీనిలో యోనిలో పురుషాంగం చొప్పించడం,  లైంగిక సంపర్కం సమయంలో నొప్పి కలుగుతుంది.  నొప్పి పొత్తికడుపు లోపల లేదా దిగువ భాగంలో విపరీతమైన నొప్పి కలుగుతుంది చాలా మంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ఎసిఒజి) ప్రకారం.. ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా బాధాకరమైన సెక్స్ అనుభవించారని పేర్కొన్నారు. కొంతమంది దీనిని తక్కువ కాలం అనుభవిస్తారు, మరికొందరు దీనిని దీర్ఘకాలికంగా ఎదుర్కొంటారు. ఏదేమైనా బాధాకరమైన సంభోగం అసాధారణ సమస్య అసలే కాదు.
 


ఆడవారిలో బాధాకరమైన సెక్స్ కు కారణమేంటి?

లూబ్రికేషన్ తగ్గడం : బాధాకరమైన శృంగారానికి ఒక సాధారణ కారణం లూబ్రికేషన్ తగ్గడం లేదా కందెన లేకపోవడం. 

యోనిస్మస్: అత్యంత సాధారణ సమస్య యోనిస్మస్ లేదా లైంగిక సంపర్కం సమయంలో నొప్పి భయం. కొంతమంది మహిళలు సెక్స్ నొప్పి, రక్తస్రావం లేదా గాయాలకు కారణమవుతుందని భయపడతారు. దీంతో వీరు లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారని నిపుణులు చెబుతున్నారు. 


Sleep after sex

మెనోపాజ్:  మెనోపాజ్ దశలో మహిళల హార్మోన్ల హెచ్చుతగ్గులకు గురవుతాయి. దీంతో యోని పొడిబారడం, సన్నని యోనికి దారితీస్తుంది. దీనివల్ల చొచ్చుకుపోయే సెక్స్ బాధాకరంగా ఉంటుంది.

ఇతర కారణాలు 
• అల్సర్ గాయాలు
• బాధాకరమైన యోని సమస్యలు
• అంటువ్యాధులు
• వాపు 
 

Couples after sex

సెక్స్ సమయంలో నొప్పిని ఎలా తగ్గించాలి?

లూబ్రికేషన్:  చాలా మంది ఫోర్ ప్లేను స్కిప్ చేస్తుంటారు. కానీ ఇది సెక్స్ లో నొప్పి లేకుండా చేస్తుంది. ఇది లూబ్రికెంట్ ను పెంచడానికి సహాయపడుతుంది. ఎలా అంటే లైంగిక ఉద్వేగం గ్రంథులను కందెన ద్రవాలను స్రవించడానికి ప్రేరేపిస్తుంది. ఇందుకోసం మీరు స్పెషల్ లూబ్రికెంట్ జెల్స్ ను కూడా ఉపయోగించొచ్చు. కొంతమంది లూబ్రికెంట్ కోసం కొబ్బరి నూనె వంటి ప్రత్యామ్నాయాలను కూడా ఉపయోగిస్తారు. ఇవి మీకు సౌకర్యంగా ఉంటాయి. అలాగే లైంగిక కార్యకలాపాల సమయంలో నొప్పిని కూడా తగ్గిస్తాయి. 

భాగస్వామితో కమ్యూనికేట్ 

మీరు మీ భాగస్వామితో కమ్యూనికేట్ చేయొచ్చు. మీకు ఆనందం కలిగించే విషయాలు లేదా బాధించే విషయాల గురించి నిర్మొహమాటంగా చెప్పేయండి. కౌగిలింత లేదా ఒకరికొకరు మసాజ్ చేసుకోవడం వంటి కార్యకలాపాలతో మీరు మీ భాగస్వామికి దగ్గరగా ఉండొచ్చు. 
 

కెగెల్ వ్యాయామాలు 

ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతిరోజూ కెగెల్ వ్యాయామాలను కూడా చేయొచ్చు. ఇతర కండరాల మాదిరిగానే కటి ఫ్లోర్ కండరాలను శారీరక చికిత్స ద్వారా అవసరమైన విధంగా సమర్థవంతంగా సర్దుబాటు చేయొచ్చు. అలాగే సడలించొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఓవర్ ది కౌంటర్ మందులు 

బాధాకరమైన సెక్స్ కొన్ని ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మీరు ప్రిస్క్రిప్షన్ అవసరం లేని ఈస్ట్ ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి మందులను ఉపయోగించొచ్చు. 

నొప్పిని తగ్గించే ఇతర చర్యలు:
• గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం 
• నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ ప్యాక్ వేయడం
• మీ మూత్రాశయాన్ని ఖాళీ చేయడం

Latest Videos

click me!