శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలంటే ఈ ట్రిక్స్ ను ఫాలో అవ్వండి

First Published | Oct 8, 2023, 3:42 PM IST

సెక్స్ లైఫ్ బాగుంటే భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు, కొట్లాటలు వచ్చే అవకాశం చాలా తక్కువ. మంచి సెక్స్ లైఫ్ కోసం మంచి స్టామినా కావాలి. అయితే కొంతమంది పురుషులు చాలా త్వరగా అలసిపోతుంటారు. ఇలాంటి వారు కొన్ని చిట్కాలను పాటిస్తే.. 

Image: Getty Images

సెక్స్ భాగస్వాములిద్దరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇద్దరి మధ్యన ప్రేమను పెంచుతుంది. వారి బంధాన్ని బలోపేతం చేస్తుంది. అంతేకాదు మీకు, మీ భాగస్వామికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. అయితే చాలా మంది పురుషులు తమ లైంగిక పనితీరును మెరుగుపరచుకునే మార్గాల కోసం వెతుకుతుంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డేటాబేస్ ప్రకారం.. 30 శాతానికి పైగా పురుషులు శారీరకంగా చురుగ్గా లేకపోవడం, ఊబకాయం కారణంగా సెక్స్ లో చురుగ్గా ఉండటంలేదని నివేదించారు. ఏదేమైనా లైంగిక ఆనందాన్ని పొందాలంటే కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అలాగే మిమ్మల్ని మీరు ఆందోళనకు గురి చేయకూడదు. అయితే లైంగికంగా తక్కువ చురుగ్గా ఉండటానికి ఎన్నో కారణాలు ఉంటాయి.
 

Image: Getty Images

సెక్స్ స్టామినా పెంచుకోవడం ఎలా?

నిపుణుల ప్రకారం.. "లైంగిక కోరికలు సహజంగానే హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ముఖ్యంగా గర్భం, రుతువిరతి లేదా అనారోగ్యం, వయస్సు వంటి కారణాల వల్ల సెక్స్ డ్రైవ్ ప్రభావితం అవుతుంది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు, శారీరక మార్పులు, మందులు, హార్మోన్ల మార్పులు, జీవనశైలి లోపాలు, అలసట, కొన్ని రకాల మందులు, మానసిక సమస్యలు సెక్స్ డ్రైవ్ ను తగ్గిస్తాయి. సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి, సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


Image: Getty Images

ఫోర్ ప్లే

ఫోర్ ప్లే కూడా సెక్స్ లో ఒక భాగమే. నిజానికి సెక్స్ కు ముందు ఫోర్ ప్లే ఖచ్చితంగా ఉండాలంటరు నిపుణులు. అంగస్తంభన సమస్య ఉన్నవారికి ఇది బాగా సహాయపడుతుంది. సమస్య నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది. ఫోర్ ప్లేలో ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం, ఓరల్ సెక్స్ లు ఉంటాయి. ఫోర్ ప్లే చర్యను పొడిగించడం వల్ల మహిళలు మంచి లైంగిక ఆనందాన్ని పొందుతారు. ఎందుకంటే చాలా తక్కువ మంది మహిళలే కేవలం సంభోగం ద్వారే భావప్రాప్తికి చేరుకుంటారు. 
 

Image: Getty Images

 స్టార్ట్-స్టాప్ టెక్నిక్ 

సెక్స్ లో పురుషులు ఎక్కువ సేపు పాల్గొనడానికి  స్టాప్ స్టాప్ టెక్నిక్ ను ఫాలో కావొచ్చు. ఈ పద్ధతిని ఫాలో కావడానికి స్ఖలనం దగ్గరగా ఉందని మీరు భావించిన ప్రతిసారీ లైంగిక చర్యను ఆపండి. అలాగే లోతుగా శ్వాసను తీసుకోండి. అలాగే మళ్లీ నెమ్మదిగా ప్రారంభించండి. దీనివల్ల మీరు సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొంటారు. ఈ టెక్నిక్ మీ శరీరం స్ఖలనాన్ని ఆపడానికి మార్గాన్ని మార్చడానికి సహాయపడుతుంది. అలాగే ఉద్వేగభరితమైన లైంగిక కార్యకలాపాల సమయంలో కూడా పురుషులు స్ఖలనం చేయకుండా మరింత సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
 

Image: Getty Images

కలిసి క్రొత్త విషయాలను ప్రయత్నించడం

ఉద్వేగం, అభిరుచులు లైంగిక ఆనందాన్ని కలిగిస్తాయి. మీ భాగస్వామితో ఎక్కువసేపు ఉన్న తర్వాత స్పర్శ సుపరిచితమైనదిగా అనిపించొచ్చు. అలాగే లైంగిక చర్య ఒక రొటీన్ విషయంగా కూడా మారుతుంది. ఇలాంటప్పుడు మీ సెక్స్ లైఫ్ బోరింగ్ గా అనిపించకూడదంటే మీరు కొత్త సెక్స్ పొజీషన్ ను ట్రై చేయొచ్చు. అలాగే దానిని ఉత్తేజకరంగా మార్చడానికి వేనే ప్లేస్ లో పాల్గొనొచ్చు. అలాగే మీ లైంగిక జీవితానికి మసాలా జోడించడానికి మీరు మీ లైంగిక ఫాంటసీల గురించి మీ భాగస్వామితో మాట్లాడొచ్చు. అలాగే కలిసి ఫుడ్ ను ప్రిపేర్ చేయడం, కొత్త గేమ్స్ ను ఆడటం వంటి పడకగది వెలుపల వివిధ పనులు చేయడానికి ప్రయత్నించొచ్చు. ఇవన్నీ మీ భాగస్వామితో మీరు మరింత ఫ్రీగా ఉండటానికి సహాయపడతాయి. 
 

ఆహారం పట్ల జాగ్రత్త 

ఆకుకూరలు, గింజలు, ఖర్జూరాలు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ ఉండే ఆహారాలు, చేపలు, పాల ఉత్పత్తులు కూడా మీ లైంగిక పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడతాయి. ఓస్టెర్స్, డార్క్ చాక్లెట్, పుచ్చకాయ వంటి కొన్ని ఆహారాలు కామోద్దీపనగా పరిగణించబడతాయి. ఇవి మీ లిబిడోను పెంచుతాయి. 
 

ఒత్తిడిని తగ్గించడం

ఒత్తిడి ఎక్కువగా ఉంటే మీ లిబిడో తగ్గుతుంది. అలాగే అంగస్తంభన కష్టతరం అవుతుంది. అలాగే పనితీరు ఆందోళన సెక్స్ ను  తక్కువ ఉత్తేజకరంగా, ఆకర్షణీయంగా చేస్తుంది. ధ్యానం లేదా యోగా వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను ఫాలో అవ్వండి. 
 

బాగా నిద్రపోండి

మీరు బాగా అలసిపోయినట్టైతే ఖచ్చితంగా కంటినిండా నిద్రపోండి. నిద్ర ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. పేలవమైన నిద్ర మీ సెక్స్ డ్రైవ్ను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ప్రతి రోజు రాత్రి  7-9 గంటల పాలు నిద్రపోయేలా టైం సెట్ చేసుకోండి. 

Latest Videos

click me!