ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. పని ఒత్తిడి, కాలుష్యం, పోషకాలు సరిగాలేని తిండి, నిద్రలేకపోవడం ఇలా కారణం ఏదైనా.. అనారోగ్యం మాత్రం కామన్ గా వెంటాడుతూనే ఉంది.
కాగా... అనారోగ్యం మాత్రమే కాకుండా.. పురుషుల్లో అయితే... వీర్యం సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని తేలింది. మీకు కూడా ఈ సమస్య ఉంటే.. కొన్ని రకాల హోమ్ రెమిడీస్ తో సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కేవలం కిచెన్ లో లభించే కొన్ని రకాల పదార్థాలతో పురుషుల్లో వీర్యం సమస్యను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వీర్యం వృద్ధి చెందడానికి చాలా రకాల ఆహారాలు ఉన్నాయి. వాటిలో టమాటాలు కీలక పాత్ర పోషిస్తాయి. చాలా సంవత్సరాల క్రితం పరిశోధకులు చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. టమాటా ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి పెరిగే మార్గాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ రెండు స్పూన్ల టమాటా రసం తీసుకున్న ఆరోగ్యకరమైన పురుషుడిలో వీర్యాభివృద్ధి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దాదాపు 40 శాతం సంతానం లేకపోవడానికి వీర్యంలో నాణ్యత లేకపోవడమే కారణమని తాజా పరిశోధనలో తేలింది.
19 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్య ఉన్న దాదాపు 60 మందిని నిపుణులు పరిశోధనలు జరిపారు.వారిని 12 వారాలపాటు ట్రయల్ పీరియడ్ లో ఉంచి ప్రతిరోజూ 14 గ్రాముల టమాట రసం ఇచ్చారు. తర్వాత వారిలో మార్పు వచ్చినట్లు గుర్తించారు.
పరిశోధనకు ముందు, తర్వాత వారి వీర్యం సేకరించి.. దానిపై పరిశోధనలు చేసినట్లు నిపుణులు తెలిపారు.
కేవలం 14 వారాలపాటు వరసగా నట్స్ తీసుకున్నా కూడా.. వీర్యం బాగా పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. 72 మంది పురుషులపై చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
వారిలో కొందరికి వెస్ట్రన్ స్టైల్ ఆహారాన్ని అందజేశారు. మరీ ముఖ్యంగా రెడ్ మీట్, షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇచ్చారు.
మరో 48మందికి మాత్రం 14 వారాలపాటు రోజుకి 60గ్రాముల చొప్పున నట్స్ ఇచ్చారు. కాగా.. నట్స్ తిన్న వారిలో వీర్యం బాగా వృద్ధి చెందినట్లు గుర్తించారు
గుమ్మడికాయ గింజల్లో జింక్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వీర్యం నాణ్యత పెరుగుతుందని.. అందుకే ప్రతి ఒక్కరూ గుమ్మడి గుంజలను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.
డార్క్ చాక్లెట్ లో ఆమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా.. దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.. ఇవి కూడా వీర్యంలో నాణ్యత పెరగడానికి ఉపయోగపడతాయి.
విటమిన్ బి ఎక్కువగా ఉండే పాలకూర, మొలకలు లాంటివి తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. బత్తాయిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. టమాటలో సైతం విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు.. వీర్యం వృద్ధి చెందుతుంది.