స్నేహితుల నుంచి ప్రేమికులుగా ఇలాంటి సందర్భాల్లోనే మారుతారు?

First Published | Nov 4, 2021, 2:49 PM IST

ఒక అమ్మాయి, అబ్బాయిల మధ్య కూడా స్నేహం మొదలవుతుంది. వారి స్నేహబంధంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా వారి అభిప్రాయాలు (Views), మనసులు ఒక్కటిగా ఉన్నప్పుడూ అది కొన్నిసార్లు ప్రేమకు దారితీస్తుంది. ఇక ఈ ఆర్టికల్ (Article) ముఖ్య ఉద్దేశం స్నేహం నుండి ప్రేమకు సంబంధం ఎలా పెంచుకోవాలో తెలియజేయడం.
 

ఇద్దరి మధ్య స్నేహం (Friendship) ఉన్నప్పుడు వారికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటుంది. ఒకరికొకరు అన్ని విషయాల్లోను సలహాలను (Ideas) తీసుకుంటారు. వారి కష్టాలను పంచుకోడానికి నేనున్నానని ముందుకు వస్తారు. అలా స్నేహబంధంలో ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం వారి అభిరుచులు ఒకేలా ఉండడంతో అది ప్రేమగా మారడానికి అవకాశం ఉంటుంది.
 

ఇలా స్నేహ బంధంలో (Friendship) ప్రేమ ఏర్పడినప్పుడు దాన్ని తెలపడానికి సంకోచిస్తారు. అది వారి మధ్య ఉన్నది స్నేహమా.. ప్రేమా.. అని తెలియని అయోమయంలో (Confused) ఉంటారు. ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమ, ప్రేమ తెలియడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. ఇంతకీ అవేంటంటే..
 


మీరు ఇద్దరితో కాకుండా చాలామంది స్నేహితులతో   బయటకు వెళ్లినట్లయితే మీరు కేవలం స్నేహితులు (Friends) మాత్రమే. అలా కాకుండా మీరు ఒంటరిగా ఎక్కువసార్లు బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తే అది ప్రేమ (Love). మీరు స్నేహితుడుగా ఉన్నప్పుడు ఒక సమయం సందర్భంలో మాత్రమే కలవడానికి ప్రయత్నించారు.
 

అలా కాకుండా ఏ సందర్భం లేకపోయినా మీరు కలవాలని కోరుకుంటే అది మీ మధ్య ఉన్నది ప్రేమ అని చెప్పవచ్చు. మీరు ఏదైనా పార్కు (Park) కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రేమజంటలు చూసినప్పుడు మీరు సిగ్గు పడుతుంటే  మీ మధ్య కూడా ప్రేమ ఉన్నట్లుగా భావిస్తారు. మీ మధ్య ప్రేమ (Love) బంధం లేకుంటే వారిని చూసి ఏమీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటుపోతారు. 
 

మీరు నడుచుకుంటూ ప్రయాణిస్తున్నప్పుడు మీరు చేతులు పట్టుకున్నప్పుడు మీకు అసౌకర్యం అనిపించకపోతే, అది స్నేహితుల కంటే ఎక్కువగా పిలవబడే సంబంధం (Relationship). వారు స్నేహపూర్వక జంటగా కనిపించాలి. అయితే, మీరు చేతులు పట్టుకున్నప్పటికీ ఒకరితో ఒకరు సంబంధంలో లేదని మీరు చెప్పగలిగితే, మీరు ప్రేమికుల (Lovers) కంటే తక్కువ స్నేహమని చెప్పవచ్చు.
 

స్నేహబంధములో మొదట ఎవరికైనా ప్రేమ (Love) కలిగితే అది తెలపడానికి సంకోచిస్తారు. వారి ప్రేమను బయటపెట్టడంతో వారి మధ్య ఉన్న స్నేహం (Friendship) చెదిరిపోతుంది అని భావించి తమ మనసులోనే మదనపడుతూ ఉంటారు. వారు ప్రేమను తెలియపరిస్తే అవతలి వ్యక్తి ఎలా భావిస్తారో అని వారి మనసులో ఏముందో అని సంకోచిస్తారు.
 

మీరు సున్నితంగా (Gently) మీ మనసులోని మాటను అవతలి వ్యక్తికి తెలియచేయండి. మొదటి నుంచి మీరు స్నేహితులు కనుక ఏ పద్ధతిలో వారికి తెలియజేస్తే వారికి అర్థం అవుతుందో ఆ పద్ధతిలో తెలియజేయడానికి ప్రయత్నించాలి. మీ మనసులోని మాటను తెలిపినపుడు వారికి ఇష్టమైతే వారు అంగీకరిస్తారు. అప్పుడు మీ మధ్య స్నేహ బంధం ప్రేమ (Love) బంధంగా మారుతుంది.

Latest Videos

click me!