దాంపత్య జీవితంలో ఇలాంటి సమస్యా..? ఇదిగో పరిష్కారం..!

First Published | Jul 14, 2022, 1:37 PM IST

చాలా మంది తమ జీవిత భాగస్వామిలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి మనసు అర్థం చేసుకొని నడుచుకోవాలట. ముఖ్యంగా సెక్స్ అంటే ఎక్కువగా భయపడే భాగస్వామితో ఎలా నడుచుకోవాలో నిపుణులు చెబుతున్నారు. 

దాంపత్య జీవితంలో శృంగారం కీలక భాగం. కానీ.. దాంపత్య అంటే అది ఒక్కటి మాత్రమే కాదు. ఎందుకంటే.. దాంపత్య జీవితం ఆనందంగా సాగాలి అంటే.. ముందు దంపతులు శారీరకంగా కంటే మానసికంగా బలపడాలి. మానసికంగా ఒకరికి మరొకరు తోడుగా ఉండాలి. ఒకరి అవసరాలను మరొకరు తీర్చడం చాలా అవసరం.

అయితే.. చాలా మంది తమ జీవిత భాగస్వామిలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి మనసు అర్థం చేసుకొని నడుచుకోవాలట. ముఖ్యంగా సెక్స్ అంటే ఎక్కువగా భయపడే భాగస్వామితో ఎలా నడుచుకోవాలో నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం..


మీ భాగస్వామి మిమ్మల్ని శృంగారం విషయంలో దూరం పెట్టినప్పటికీ.. మీరు వారిపై ప్రేమ చూపించాలి. వారు మీ విషయంలో భయం పెట్టుకొని ఉండొచ్చు. అంటీ ముట్టనట్లుగా వ్యవహరించవచ్చు. అయితే.. వారు అలా ఉన్నారని మీరు కూడా అలానే ఉండాలనే రూల్ ఏమీ లేదు. వారి పట్ల మొరటుగా ప్రవర్తించకూడదు. వారితో ప్రశాంతంగా మాట్లాడాలి. మీరు వారికి ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా ఉంటారనే విషయాన్ని అర్థం అయ్యేలా తెలియజేయాలి. వారితో ప్రేమగా ఉంటూ.. వారి మనసు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
 

కొంతమందికి తమ జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేసే అలవాటు ఉంటుంది. వారికి ఏదైనా అవసరమైనప్పుడు లేదా మాట్లాడే మూడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే భాగస్వామితో మాట్లాడుతూ ఉంటారు. అయితే.. అలా కాకుండా.. వారిని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటారనే నమ్మకం వారికి కలగేలా మీరే చేయాలి. వారిని మీరు విస్మరించరు అనే నమ్మకం వీరికి కలగాలి. 

sex

జీవితంలో దాదాపు ప్రతిదానికీ ఓపిక చాలా అవసరం. వారు మిమ్మల్ని దూరంగా పెట్టారని కోపం తెచ్చుకోవడం లాంటివి చేయకూడదు. వారి విషయంలో మీరు ఓపికగా ఉండటం అలవాటు చేసుకోవాలి. వారితో సున్నితంగా ఉంటూ.. వారు చెప్పే విషయాన్ని ఓపిక వినడం కూడా అలవాటు చేసుకోవాలి. 

lovers

ఇక జీవిత భాగస్వామి ని రిజక్ట్ చేయకూడదు. వారు మిమ్మల్ని దూరం పెడుతున్నారని.. మీరు వారిని రిజక్ట్ చేయకూడదు. వారితో సున్నితంగా ఉండేందుకు ప్రయత్నించాలి.   భావోద్వేగాలను ప్రదర్శించడం చాలా మందికి మంచిది కాదు. వారి ఎమోషన్స్ ని మీరు అర్థం చేసుకోవాలి.

Latest Videos

click me!