ఒక బంధం నిలపడాలంటే ప్రేమ చాలా అవసరం. ప్రేమ శాశ్వతంగా ఉండాలి అంటే...వారి మధ్య అభద్రతా భావం ఉండకూడదు. దాని వల్ల కాపురం సజావుగా సాగదు.
ఒకరిపై మరొకరికి పూర్తి నమ్మకం ఉంటే.. ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ ఎప్పుడూ కలగదు. ఒకవేళ అలాంటి భావన కలిగితే.. దాని నుంచి ఎలా బయటపడాలో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
బంధం బలంగా ఉండాలన్నా... ప్రేమగా ఎక్కువగా ఉండాలన్నా.. దంపతులు కొన్ని విషయాలను ఫాలో అవ్వాలన్నా.. ముందు గతం గురించి మాట్లాడుకోవడం మానేయాలి. అప్పుడు నువ్వు అలా చెప్పుడు.. ఇప్పుడు ఇలా చేస్తున్నావ్ అంటూ మాట్లాడుకోకూడదట.
గతంలో జరిగిన తప్పులను కూడా ఎత్తి చూపకూడదు. మంచి అయితే.. మాట్లాడుకోవడంలో తప్పులేదు.. కానీ.. చెడు గురించి ఎంత తక్కువగా మాట్లాడకుంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది దంపతులు లేనిపోని సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంతేకానీ.. ఒకవేళ నిజంగా సమస్య ఉంటే.. దాని పరిష్కారం గురించి మాత్రం ఆలోచించరు.
నిజంగా మనస్పర్థలు, సమస్యలు ఉంటే.. ఇద్దరూ కూర్చొని ప్రశాంతంగా వాటి గురించి మనసు విప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
దంపతుల మధ్య వేరే వారికి చోటు ఇవ్వకూడదు. దంపతుల మధ్య జరిగే ప్రతి విషయాన్ని వేరే వాళ్లకు చెప్పుకోకూడదు. దాని వల్ల వేరేవాళ్ల ముందు చులకన అయిపోయే ప్రమాదం ఉంది.
నిజంగా మీ పార్ట్ నర్ తో ఆనందంగా ఉండాలనే కోరిక మీలో ఉంటే.. ముందు మీరే స్పందించాలి. మీలో అభద్రతా భావం ఉంటే.. మీరే దానిని తొలగించే ప్రయత్నం చేసుకోవాలి. ముందు మీరు మారితే.. ఆ తర్వాత తమీ పార్ట్ నర్ ని మార్చుకునే అవకాశం ఉంటుంది.
సంబంధ బాంధవ్యాల్లో అసూయ అనే భావన ఒక కనపడని శత్రువుగా ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచేస్తుంది. అది చివరకు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను తుంచేస్తుంది. తమ భాగస్వామి పై అభద్రతా భావం మరియు వాళ్ళను దక్కించుకోలేనేమో అనే ఆలోచన బలంగా ఉండటం అనేది అసూయ పెరగడానికి మూలకారణం. కాబట్టి ముందు దానిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
పోర్న్ చూసే అలవాటు ఉన్నవారిలోనూ ఇలాంటి భావనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయట. అభద్రతా భావం, సెక్స్ పట్ల ఇంట్రస్ట్ లేకపోవడం, సెక్స్ పట్ల మీ భాగస్వామిపై ఎక్కువ అంచనాలు పెంచుకోవడం, ఒత్తిడి నుంచి బయట పడేందుకు తదితర అంశాల కారణంగా అలవాటు పడుతుంటారు.
పోర్న్ వీడియోలు చూడాలనే ఆలోచన నుంచి మీరు బయటపడాలంటే సాధ్యమైనంత ఎక్కువగా పనితో బిజీగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ భార్యతో సరదాగా మాట్లాడండి. అప్పటికీ మీ ఆలోచనలు నియంత్రణలోకి రాకపోతే.. మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్‌ని కలిసి సలహా తీసుకోండి.