పెళ్లికి ముందు ప్రేమికులు అయినా, కాకపోయినా.. పెళ్లి తరువాత శృంగారంలో కాస్త వెనకబడే మాట వాస్తవమే. పెళ్లైన కొత్తలో ఉన్న ఆసక్తి రోజులు గడిచిన కొద్దీ తగ్గిపోతుంది. దీనికి రోజువారీ బాద్యతలు, కుటుంబం, ఉద్యోగం ఎలాంటివి ఎన్నో కారణాలుంటాయి.
అందుకే మనసులో ఎంత కోరిక ఉన్నా కొన్నిసార్లు శృంగారానికి కూడా సమయం కేటాయించలేకపోతుంటారు. కొత్తలో ఉన్న ఉత్సాహం తగ్గిపోవడంతో పురుషుల్లోనూ అనాసక్తి ఏర్పడుతుంది.
అలా కాకుండా ఉండాలంటే సంసారంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే.. మీరు మీ భర్తకు నచ్చే గర్ల్ ఫ్రెండ్ లా ఉండాలి. మీరెంతో ప్రేమించే మీ భర్త కోసం కొన్నిసార్లు కొంత కష్టపడాల్సి వస్తుంది. ఆ చిట్కాలు ఇవే..
మీ భర్తలో మీకు నచ్చిన అంశాలమీద దృష్టిపెట్టండి. అతని అందమైన నవ్వు.. లేదా విశాలమైన ఛాతి, అతని నుంచి వచ్చే ఆ సువాసన.. ఇలాంటి వాటిమీద దృష్టి పెట్టండి. వాటిని తిరిగి ఆరాధించడం ప్రారంభించండి. అది మీరంటే అతన్ని పడిచచ్చిపోయేలా చేస్తుంది.
అతనిలోని మంచి లక్షణాలను మెచ్చుకోండి. కాఫీ బాగా పెడతావనో... చక్కగా గార్డెనింగ్ చేస్తున్నావనో.. మీకు తెచ్చిన గిఫ్ట్ సెలక్షన్ సూపర్ అనో పొగడ్తల్లో ముంచేయండి. ఆ రోజు అతను వేసుకున్న షర్ట్ లో ఎంత హ్యాండ్ సమ్ గా ఉన్నాడో చెప్పండి. అయితే ఇవన్నీ హృదయపూర్వకంగా చెప్పినప్పుడు ఫలిస్తాయి.
మిమ్మల్ని, కుటుంబాన్ని మోయడానికి అతను ఎంత కష్టపడుతున్నాడో.. గుర్తించండి. అతని ప్రయత్నాలను మెచ్చుకోండి. కుటుంబం కోసం తామెంత కష్టపడుతున్నామో గుర్తింపు కోసం ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తారు. అది వారిని మీ మీద మళ్లీ ఇష్టపడేలా చేస్తుంది.
చిన్న చిన్న సర్ ఫ్రైజ్ లు ఇవ్వండి. మీ వివాహబంధంలో నిరుత్సాహం నిండినప్పుడు ఇది మళ్లీ బూస్ట్ చేస్తుంది. అతని కోసం మైమరపించే దుస్తులు ధరించండి. ఇష్టమైన ఫుడ్ తయారు చేయండి.. అతనికిష్టమైన రెస్టారెంట్లో సర్ ఫ్రైజ్ డిన్నర్ ప్లాన్ చేయండి.

చివరికి చాలా ముఖ్యమైనది శృంగారం. దీనిమీద తప్పనిసరిగా దృష్టి పెట్టండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి తనువులు బాషను ఆశ్రయించండి. మళ్లీ మీ మధ్య అన్యోన్యతను పెంచుకోండి. పెళ్లైన కొత్తలో, డేటింగ్ లో ఎలా ఉండేవారో అలాంటి అనుభూతి కోసం ప్రయత్నించండి.