కరోనా లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో.. సెక్స్ వర్కర్లు కూడా అంతే ఇబ్బంది పడ్డారు. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తుండగా.. అన్ని ప్రాంతాల్లోనూ సెక్స్ వర్కర్లు దీని కారణంగా నరకం అనుభవిస్తున్నారు.
తమ శరీరాన్ని వ్యాపారం కింద మార్చుకొని.. పొట్ట కూటి కోసం వాళ్లు పడుతున్నారు. అయితే.. వారు చేసే పనిని సమాజం చాలా నీచంగా చూస్తుంది. అయినా వాళ్లు అవేమీ పట్టించుకోకుండా.. కేవలం బతకడం కోసమే ఈ జీవితం అన్నట్లుగా బతుకులు ఈడుస్తున్నారు.
ఒక్కసారిగా వాళ్ల జీవితాల్లో కరోనా కలవరం రేపింది. ఒకప్పుడు ఎయిడ్స్ మహమ్మారి ఏవిధంగా వారి జీవితాలను అతలా కుతలం చేసిందో.. ఇప్పుడు కరోనా కూడా అదేవిధంగా ఇబ్బంది పెడుతోంది.
తొలుత కరోనా కలవరం మొదలైనప్పుడు కొద్ది వారాలు తమ వృత్తికి వాళ్లు స్వస్తి పలికారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఈ పనికి దూరంగా ఉంటామని చెప్పారు. కానీ.. ఈ లాక్ డౌన్ ఇప్పటికే రెండు నెలలు పూర్తై.. మూడో నెలలోకి కూడా ఎంటరయ్యింది.
మరి వారి జీవితాలు గడిచేదేలా..? అందుకే కరోనాని ఎదురించి వ్యాపారం మొదలుపెట్టారు. కానీ.. తమ గడప తొక్కే కష్టమర్లే కరువయ్యారు.
ఎయిడ్స్ వ్యాధిని కండోమ్ తో నిరోధించారు. కానీ.. దీనికి వాళ్లకి మార్గం కనపడలేదు. కేవలం ముట్టుకుంటేనే ఈ కరోనా వ్యాప్తి చెందుతుండటంతో.. వారి ఆశలు సన్నగిల్లాయి.
అయితే.. ఆకలి బాధ వారిలో కొత్త ఆలోచనలు పుట్టింటింది. కష్టమర్లను ఆకట్టుకునేందుకు వాళ్లు విశ్వప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు.
లాక్ డౌన్ సమయంలో తమ కస్టమర్లను ఆకర్షించేందుకు సెక్స్ వర్కర్లు డిజిటిల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు
ఎయిడ్స్ సోకకుండా కండోమ్ సాయంగా ఉండేదని, ఇప్పుడు కరోనాకు రెయిన్ కోట్ ఉపయోగిస్తున్నట్టుగా ఓ సెక్స్ వర్కర్ చెప్పడం గమనార్హం.
ఇది కాకుండా.. ఫోన్ రొమాన్స్ కి శ్రీకారం చుట్టినట్లు వారు చెప్పడం విశేషం. ఫోన్ లో వీడియో కాల్స్ చేసి.. వారిని తృప్తి పరుస్తున్నామని చెప్పారు.
కస్టమర్లతో ధర మాట్లాడుకున్న తర్వాత నగదును గూగుల్ పే ద్వారా చెల్లించాల్సిందిగా సూచిస్తున్నారు.
ఇప్పుడు ఫోన్ రొమాన్స్ అనేది.. వారి దినచర్యలో భాగంగా మారింది. ఫోన్ కాల్ అయితే ఒక రేటు.. వీడియో చాట్ అయితే ఒక రేటు ఛార్జ్ చేస్తుంది.
తన ముఖాన్ని ఎవరూ రికార్డ్ చేయకుండా ఉండేందుకు దుపట్టాతో కప్పేసుకుంటారు. సాధారణ ఫోన్ కాల్‌కు రూ. 300, వీడియో చాట్ కోసం రూ. 500 వసూలు చేస్తున్నారు.
రెండూ 30 నిమిషాల వరకు ఉంటాయి. నమ్మకమైన కస్టమర్లతోనే సెక్స్ వర్కర్లు ఈ చర్యకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. దాదాపు చాలా మంది సెక్స్ వర్కర్లు ఫోన్‌లో ఇలాంటి సేవలను అందిస్తున్నారని ముంబైలో వారిలో పనిచేసే ఆస్త పరివార్ అనే ఎన్జీఓ సభ్యురాలు ఒకరు చెప్పారు.
వీరిలో ఎక్కువ మంది కాల్స్ కోసం.. ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. గూగుల్ పే లేదా పేటీఎం ద్వారా చెల్లింపులను అంగీకరిస్తారు.