డెలివరీ తర్వాత సెక్స్.. ఎప్పటి వరకు దూరంగా ఉండాలంటే?

First Published | Feb 21, 2024, 2:15 PM IST

గర్బంతో ఆడవారి శరీరంలో ఎన్నో శారీరక, మానసిక మార్పులు వస్తాయి. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత ఆడవాళ్లు నార్మల్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. నిపుణుల ప్రకారం.. డెలివరీ తర్వాత ఎప్పుడు సంభోగంలో పాల్గొనాలంటే?

గర్బం దాల్చినప్పుడే కాదు.. డెలివరీ తర్వాత కూడా ఆడవాళ్లు ఎన్నో శారీరక, మానసిక మార్పులకు లోనవుతారు. అయినప్పటికీ డెలివరీ తర్వాత వచ్చే సమస్యలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రం ఈ సమస్యలు చాలా రోజుల వరకు ఉంటాయి. అందుకే డెలివరీ తర్వాత ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి తోడు చాలా మంది డెలివరీ తర్వాత లైంగిక ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ డెలివరీ తర్వాత కొన్ని రోజులకే సెక్స్ లో పాల్గొంటే ఆడవాళ్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే డెలివరీ తర్వాత మహిళలు తమ లైంగిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
 

డెలివరీ అనేది ఆడవాళ్ల జీవితంలో అత్యంత సున్నితమైన సమయమని నిపుణులు చెబుతారు. ప్రసవ నొప్పులను అనుభవించి కోలుకున్న తర్వాత పిల్లల సంరక్షణ,  పోషణ గురించి ఆందోళన చెందడం  స్టార్ట్ చేస్తారు. అందుకే ఈ సమయంలో వారు సెక్స్ లైఫ్ లోకి వెళ్లడం కొంత కష్టంగా ఉంటుంది.
 


6 వారాల పాటు లైంగిక కార్యకలాపాలకు దూరంగా

బిడ్డ పుట్టిన తర్వాత 6 వారాల పాటు జంటలు శృంగారానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. డెలివరీ తర్వాత ఆడవాళ్లకు రక్తస్రావం వస్తుంది. ఇది కూడా రుతుస్రావం లాంటిదే కాబట్టి ఇలాంటి సమయంలో కలయికకు దూరంగా ఉండాలని చెప్తారు.  అలాగే ప్రసవం తర్వాత యోని చుట్టూ ఉన్న కణజాలాలు సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో సెక్స్ లో పాల్గొంటే సంక్రమణకు ఎక్కువగా గురవుతారు.
 

గర్భనిరోధక సాధనాల వాడకం

బిడ్డకు పాలివ్వడం వల్ల శరీరంలో ప్రోలాక్టిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ హార్మోన్ అధిక స్థాయిలు తక్కువ సంతానోత్పత్తిని సూచిస్తాయి. ఈ హార్మోన్ అండోత్సర్గము, రుతువిరతిని నివారిస్తుంది. అందుకే పాలిచ్చే తల్లులు గర్భం దాల్చరని నమ్ముతారు. అయితే పాలిచ్చే తల్లుల అండోత్సర్గము ప్రక్రియ సగటున 6 వారాలలో ప్రారంభమవుతుంది. కాబట్టి పాలిచ్చే తల్లులు కూడా గర్భం దాల్చుతారని గుర్తుంచుకోవాలి. అందుకే పాలిచ్చే తల్లులు సెక్స్ లో పాల్గొంటే గర్భనిరోధకాలను ఖచ్చితంగా ఉపయోగించాలి.
 

మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం

నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారం స్త్రీ లైంగిక వాంఛను ప్రభావితం చేస్తాయి. అంటే సెక్స్ పట్ల వీరికి ఆసక్తి తగ్గుతుంది.అలాగే కొన్ని హార్మోన్ల మార్పులు యోని పొడి, నొప్పిని కలిగిస్తాయి. ఇది ఆడవాళ్ల లిబిడోను కూడా ప్రభావితం చేస్తుంది. మంచి నిద్ర పొందడం, పోషకమైన ఆహారాన్ని వల్ల లైంగిక కోరిక


యోని ఆరోగ్యం

శృంగారానికి ముందు, తర్వాత జననేంద్రియ పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు జననేంద్రియ ప్రాంతాన్ని సబ్బు, నీళ్లతో కడగాలి. అలాగే సెక్స్ లో పాల్గొన్న తర్వాత చేతులను కడుక్కోవాలి. మూత్ర విసర్జన చేయడం వంటి ఆరోగ్య చిట్కాలు సంక్రమణను నివారించడంలో సహాయపడతాయి.

మూత్రాన్ని ఆపుకోవడం

ఆడవారు మూత్రాన్ని  ఎక్కువ సేపు ఆపుకోకూడదు. ఇది యూరినరీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే మీ లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

Latest Videos

click me!