శృంగారం తర్వాత.. వీర్యం బయటకు రాకపోతే..?

First Published Aug 11, 2020, 3:08 PM IST

శృంగారంలో పాల్గొన్న తర్వాత.. పురుషాంగం నుంచి వీర్యం బయటకు వచ్చినప్పుడే.. వారు భావప్రాప్తికి గురైనట్లుగా మనమంతా భావిస్తాం. అయితే.. చాలా మందికి ఎంతసేపు కలయికలో పాల్గొన్నా.. వీర్యం బయటకు రావడం లేదట.

ఆలుమగల దాంపత్యంలో శృంగారానిదే పెద్ద పీట. పడక గదిలో వారి అన్యోన్యతను బట్టే.. వారి మిగితా జీవితం కూడా ఆనందంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే... చాలా మంది దంపతులు ఈ శృంగారంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
undefined
వాటిని తమ జీవిత భాగస్వామికి కూడా చెప్పుకోకుండా బాధపడేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. ఈ మధ్య కొంతమంది యువకుల్లో కొత్త రకం సమస్య మొదలైందని తెలుస్తోంది.
undefined
శృంగారంలో పాల్గొన్న తర్వాత.. పురుషాంగం నుంచి వీర్యం బయటకు వచ్చినప్పుడే.. వారు భావప్రాప్తికి గురైనట్లుగా మనమంతా భావిస్తాం. అయితే.. చాలా మందికి ఎంతసేపు కలయికలో పాల్గొన్నా.. వీర్యం బయటకు రావడం లేదట.
undefined
దీనిపై ఓ వ్యక్తి నిపుణులను ఆశ్రయించగా.. దానికి వారు తగిన పరిష్కారాన్ని ఇచ్చారు.
undefined
ఇంతకీ అతని సమస్యేమిటంటే.. కలయికలో పాల్గొన్న తర్వాత తనకు వీర్యం బయటకు రావడం లేదట. ఇలా అయితే తమకు పిల్లలు ఎలా పుడతారంటూ బాధపడుతున్నాడు. అయితే.. తనకు మధుమేహం ఉందని.. అందువల్లే ఇలా జరుగుతుందా అనే సందేహం వ్యక్తం చేశాడు.
undefined
కాగా.. దానికి నిపుణులు స్పందించారు. మధుమేహం ఉన్నవారిలో ఇలాంటి సమస్య సహజంగానే ఏర్పడుతుందట. దీన్ని ‘రిట్రోగ్రేడ్‌ ఎజాక్యులేషన్‌’ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో వీర్యం విడుదల అవుతున్నా, అది బయటకు రాకుండా మూత్రాశయంలోకి చేరుకుని, మూత్రవిసర్జన సమయంలో బయటకు వెళ్లిపోతూ ఉంటుంది.
undefined
ఈ సమస్యను మందులతో నయం చేయవచ్చు. 80 శాతం మందిలో మందులతోనే సమస్య సమసిపోతుంది. అయితే కొంతమందికి మందులు వాడినంత కాలమే స్ఖలనంతో పాటు వీర్యం బయటకు వస్తూ, మందులు వాడడం ఆపగానే తిరిగి సమస్య తిరగబెడుతుంది.
undefined
కాబట్టి మందులు వాడుతూ, పిల్లల కోసం ప్రయత్నం చేయవచ్చు. అయితే మందులు వాడడం మొదలుపెట్టిన వెంటనే వీర్య పరీక్ష కూడా చేయించుకుంటే, వీర్యం నాణ్యత కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి సహజసిద్ధంగా పిల్లలను కనే ప్రయత్నం చేయవచ్చు.
undefined
ఒకవేళ వీర్యం నాణ్యత తక్కువగా ఉంటే, ఐ.వి.ఎఫ్‌ (ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్‌)కు బదులుగా, ఐ.యు.ఐ (ఇంట్రా యుటెరిన్‌ ఇన్‌సెమినైజేషన్‌) ద్వారా పిల్లలను కనే ప్రయత్నం చేయాలి. ఐ.వి.ఎ్‌ఫతో పోల్చుకుంటే ఐ.యు.ఐ తక్కువ ఖర్చు కాబట్టి వీర్యం నాణ్యత తక్కువగా ఉన్నా, మొదట ఐ.యు.ఐ ప్రయత్నించాలి.
undefined
ఒకవేళ వీర్యకణాలు మరీ తక్కువగా ఉన్నా, మందులతో వీర్యం బయటకు రాకపోయినా ఐ.వి.ఎ్‌ఫను ఆశ్రయించక తప్పదు. కాబట్టి మందులు వాడి, వీర్యం స్ఖలనంతో బయటకు తెప్పించే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో వీర్య పరీక్ష కూడా చేయించుకుని అవసరాన్ని బట్టి ఐ.యు.ఐ లేదంటే ఐ.వి.ఎఫ్‌ ఎంచుకోవాలి.
undefined
click me!