మందు తాగే అలవాటుందా? అయితే మీ లైంగిక జీవితం అంతేసంగతులు..

First Published | Nov 12, 2023, 2:37 PM IST

ఎప్పుడో ఒకసారి ఆల్కహాల్ ను తాగడం వల్ల పెద్దగా వచ్చే సమస్యలేమీ లేవు. కానీ అదేపనిగా రోజూ ఆల్కహాల్ ను ఎక్కువ మొత్తంలో తాగితే మాత్రం మీ  ఆరోగ్యం దెబ్బతినడమే కాదు మీ లైంగిక జీవితం కూడా దెబ్బతింటుంది. మందు మీ లైంగిక జీవితానికి స్వస్తి చెప్పేయగలదు మరి. 

ఆల్కహాల్ కు బానిసలైతే.. సమయం, సందర్భం అవసరమే లేదు. ఎప్పుడు పడితే అప్పుడే తాగుతూనే ఉంటారు. అయితే కొంతమంది ఆల్కహాల్ ను 'ఎక్సయిట్ మెంట్ బూస్టర్ 'గా కూడా తీసుకుంటారు. అంటే ఆల్కహాల్ తాగిన తర్వాత సెక్స్ లో పాల్గొంటే మరింత ఆనందాన్ని పొందొచ్చని. అలాగే పనితీరు కూడా మెరుగుపడుతుందని భావిస్తారు. నిజమేంటంటే? మందు మీ లైంగిక జీవితానికి ముగింపు పలుకుతుంది. అవును ఇది మీ లైంగిక జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు.
 

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ప్రతి మహిళ ఆల్కహాల్ ను తాగిన తర్వాత ఉత్సాహంగా, సంతోషంగా ఉండాల్సిన అవసరం లేదు. సహజంగా ఇది కొన్ని సందర్భాల్లో చెడు ప్రభావాలను చూపించొచ్చు. కానీ మందును ఎక్కువగా తాగడం వల్ల చాలా మంది మహిళలు భావప్రాప్తికి చేరుకోవడంలో ఇబ్బంది పడతారని నివేదిక పేర్కొంది. అతిగా మందును తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే జననేంద్రియ ప్రతిచర్యను కూడా తగ్గిస్తుంది.
 


sex life

జర్నల్ ఆఫ్ ఆల్కహాల్ హెల్త్ అండ్ రీసెర్చ్ వరల్డ్ లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. పురుషుల విషయంలో ఎక్కువ మందును తాగడం కూడా పురుషుల లైంగిక కోరికలు బాగా తగ్గుతాయి. అలాగే ఎక్కువ సేపు అతిగా మందును తాగే పురుషుల్లో 'అంగస్తంభన లోపం' సమస్య వస్తుంది. అలాగే లైంగిక సంభోగం సామర్థ్యం కూడా తగ్గుతుంది.

పురుషుల్లో ఆల్కహాల్ ప్రభావాలు

అంగస్తంభన లోపం

మందును అతిగా తాగడం వల్ల అంగస్తంభన లోపం సమస్య వస్తుంది. మందును ఎక్కువగా తాగితే పురుషాంగానికి రక్త ప్రవాహం తగినంత అందదు. ఇది అంగస్తంభనను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

లిబిడో తగ్గడం

ఆల్కహాల్ కొంతమందిలో లైంగిక కోరికలను తగ్గిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది స్టార్టింగ్ లో సెక్స్ బూస్టర్గా పనిచేస్తుందని చూపించినప్పటికీ.. దీర్ఘకాలిక, ఎక్కువగా మందును తాగడం వల్ల లైంగిక ఆసక్తి తగ్గుతుంది. 

హార్మోన్ల అసమతుల్యత

తరచుగా మందును తాగడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. టెస్టోస్టెరాన్ అనేది పురుష లైంగిక పనితీరుకు కారణమయ్యే హార్మోన్.
 

ఆల్కహాల్ కలిగించే ఇతర సమస్యలు

ఆల్కహాల్ ను అతిగా తాగడం వల్ల లైంగిక సమస్యలే కాదు కాలేయం దెబ్బతినడం, హృదయ సంబంధ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. 

Latest Videos

click me!