సురక్షితమైన సెక్స్ కు కండోమ్ల వాడకం చాలా అవసరం. కండోమ్ లు గర్భనిరోధకం, లైంగిక సంక్రమణ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. చాలా సన్నని లేటెక్స్ తో తయారైన ఇది స్పెర్మ్ గుడ్డును కలవకుండా ఆపి గర్భం దాల్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. కండోమ్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొంతమందికి కండోమ్లలో ఉపయోగించే కందెనలకు అలెర్జీ కలుగుతుంది. రబ్బరు అలెర్జీలు సాధారణంగా పదార్థంలోని ప్రోటీన్ల ద్వారా ప్రేరేపించబడతాయి. ఇది దురద, ఎరుపు లేదా వాపు వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఈ సున్నితత్వం లైంగిక ఆరోగ్యం, సాన్నిహిత్యాన్ని ప్రభావితం చేస్తుంది. అసౌకర్యం లేదా ప్రమాదకరమైన ప్రతిచర్యలకు కారణమవుతుంది. కండోమ్ అలెర్జీని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Condom Usage
కండోమ్ అలెర్జీ అంటే ?
మీకు కండోమ్లకు అలెర్జీ ఉంటే.. సెక్స్ తర్వాత విపరీతమైన దురద, ఎర్రని దద్దుర్లతో బాధపడొచ్చు. సాధారణంగా ఇది చాలా కండోమ్లను తయారు చేసే పదార్థం లేదా వాటి ఉత్పత్తిలో ఉపయోగించే కందెనలు లేదా సంకలనాలకు సున్నితత్వం లేదా అలెర్జీ వల్ల వస్తుంది. జర్నల్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ ప్రచురించిన 2016 సమీక్ష ప్రకారం.. ఈ అలెర్జీలు ప్రపంచ జనాభాలో 4.3 శాతం మందిలో సంభవించొచ్చు.
కండోమ్ అలెర్జీ లక్షణాలు
చర్మపు చికాకు
ప్రాధమిక లక్షణాలలో ఒకటి చర్మపు చికాకు ఒకటి. ఇది జననేంద్రియ ప్రాంతంలో ఎరుపు, దురద లేదా దద్దుర్లుగా ఉంటుంది. రబ్బరులో కనిపించే ప్రోటీన్లకు శరీరం రోగనిరోధక ప్రతిస్పందన కారణంగా ఈ ఈ సమస్య వస్తుంది.
వాపు
కండోమ్ అలెర్జీ ఉన్న ఆడవారికి జననేంద్రియ ప్రాంతంలో వాపు రావొచ్చు. ఈ వాపు అసౌకర్యంగా ఉంటుంది. అలాగే ఇతర లక్షణాలను కూడా పెంచుతుంది.
మంట
కొంతమంది ఆడవారికి కండోమ్ లు తాకినప్పుడు మంట లేదా కుట్టడం వంటిని అనుభూతిని అనుభవించొచ్చు. ఈ అసౌకర్యం తేలికపాటి నుంచి తీవ్రమైంది వరకు ఉంటుంది. అలాగే కండోమ్ తొలగించిన తర్వాత కూడా ఇలాగే ఉండొచ్చు.
యోని ఉత్సర్గ
కండోమ్ అలెర్జీ యోని ఉత్సర్గలో మార్పులకు దారితీస్తుంది. మహిళలు ఉత్సర్గ పెరుగుదల లేదా దాని స్థిరత్వం, వాసన లేదా రంగులో మార్పులను గమనించొచ్చు, ఇది తాపజనక ప్రతిస్పందనను సూచిస్తుంది.
condom
సంభోగం సమయంలో నొప్పి
కండోమ్ అలెర్జీ వల్ల కలిగే చికాకు ఆడవారికి లైంగిక సంపర్కం బాధాకరంగా లేదా అసౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల మీకు జననేంద్రియ ప్రాంతం చుట్టూ నొప్పి కలుగుతుంది. ఇది లైంగిక ఆనందానికి ఆటంకం కలిగిస్తుంది.
శ్వాసకోశ లక్షణాలు
ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అయినప్పటికీ.. లాటెక్స్ కణాలు గాలిలోకి వెల్లినప్పుడు కొంతమంది తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.