మీరు హస్తప్రయోగం చేస్తరా? అయితే మీరిది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

First Published Nov 22, 2023, 3:46 PM IST

లైంగిక ఆనందాన్ని పొందడానికి కొంతమంది హస్తప్రయోగం చేస్తుంటారు. దీనిలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇది కూడా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. హస్త ప్రయోగంతో ఆనందాన్ని పొందాలంటే మాత్రం మీరు కొన్ని పరిశుభ్రత చిట్కాలను పాటించాల్సిందేనంటున్నారు నిపుణులు. అవేంటంటే? 

masturbating

భాగస్వామితో అవసరం లేకుండా లైంగిక ఆనందాన్ని పొందడానికి హస్తప్రయోగం గొప్ప మార్గం. ఇది కూడా మంచి లైంగిక అనుభూతిని కలిగిస్తుంది. అలాగే మీ శరీరానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ దీనిలో మీరు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనంటున్నారు నిపుణులు. హస్త ప్రయోగం సహజమైన, సాధారణ ఆనందంతో ముడిపడి ఉంటుంది. అందుకే దీని గురించి మీరు సంకోచించాల్సిన అవసరం లేదు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఈ విషయంలో సంకోచిస్తారు. ఎందుకంటే దీనివల్ల ఏవైనా సమస్యలు వస్తాయేమోనని. నిజమే మరి హస్తప్రయోగంలో పరిశుభ్రత చిట్కాలను పాటించకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. 

మీకు తెలుసా? హస్త ప్రయోగం మీలో ఎండార్ఫిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది కూడా. అలాగే అదనపు కేలరీలను బర్న్ చేయడానికి కూడా సహాయపడుతుంది. మీకు కంటినిండా నిద్రపట్టేలా చేస్తుంది. అయితే మీరు సన్నిహిత పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టకపోతే ఈ ప్రయోజనాలను అస్సలు పొందలేరు. మరి హస్తప్రయోగంలో ఎలాంటి పరిశుభ్రత చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


చేతులను కడుక్కోవడం

చేతులతో ఎన్నో రకాల వస్తువులను ముట్టుకుంటారు. దీంతో చేతులకు బాక్టీరియా, వైరస్, దుమ్ము, ధూళి అంటుకుంటుంది. కానీ మురికి చేతులతో ఎప్పుడు కూడా హస్త ప్రయోగం చేయకూడదు. మురికి చేతులతోనే హస్తప్రయోగం చేస్తే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే హస్తప్రయోగానికి ముందు చేతులను ఖచ్చితంగా కడగండి. 
 

గోర్లను కత్తిరించడం

చాలా మందికి పొడవాటి గోర్లంటే చాలా ఇష్టం. కానీ పొడవాటి గోర్లతో హస్తప్రయోగం చేస్తే మీకు గాయాలు అవుతాయి. ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. గోర్లలో దుమ్ము, దూళి వంటివి గోర్లలో చిక్కుకుంటాయి. జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. జననేంద్రియాల్లో ఒక చిన్న స్క్రాచ్ కూడా మీ శరీరంలో మంట, గాయాలు, లైంగిక ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఎందుకంటే ఇది మీ శరీరంలో అత్యంత సున్నితమైన భాగం.
 

సెక్స్ బొమ్మలను శుభ్రంగా 

హస్త ప్రయోగంలో మీరు చేతులను కడుక్కోవడమే కాదు.. మీరు ఉపయోగించే సెక్స్ టాయ్స్ ను కూడా శుభ్రంగా ఉంచాలి. సాధారణంగా సెక్స్ టాయ్స్ ను లేటెక్స్ లేదా ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. ఇవి దుమ్ము, ధూళిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. మీరు దీనితో ల్యూబ్ ఉపయోగిస్తే సంక్రమణ ప్రమాదం మరింత పెరుగుతుంది. అందుకే వీటిని ఉపయోగించడానికి ముందు వీటిని ఖచ్చితంగా శుభ్రం చేయండి. 
 

లూబ్రికెంట్ ను జాగ్రత్తగా ఎంచుకోండి

2012 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం కొన్ని లూబ్స్ యోని లోపలి పొరను దెబ్బతీశాయని వెల్లడించింది. దీని వల్ల పురీషనాళం దెబ్బతింది. ఈ రెండు భాగాలు లైంగిక వ్యాధులకు గురవుతాయి.  కొంతమంది మహిళలకు లూబ్కు అలెర్జీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే వారి సన్నిహిత భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి.  నీటి ఆధారిత కందెనను ఉపయోగించడం ప్రారంభంలో సురక్షితమైన ఎంపిక కావొచ్చంటున్నారు నిపుణులు. 
 

ఈ వస్తువులను ఉపయోగించకండి 

కీరదోసకాయల నుంచి అరటిపండ్ల వరకు చాలా మంది మహిళలు లైంగిక ఆనందాన్ని పొందడం కోసం గృహోపకరణాలను ఉపయోగిస్తుంటారు. కానీ వీటి వాడకం మంచిది కాదు. ఎందుకంటే చాలా రకాల పండ్లు, కూరగాయలపై పురుగుమందులు పిచికారీ చేస్తారు. ఇవి మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. 

click me!