కలయిక తర్వాత కూడా వీర్యం బయటకు రాక.. పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య

First Published | Mar 23, 2020, 2:50 PM IST

చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలను ఆకర్షించేందుకు కసర్తులు చేసి.. స్టెరాయిడ్స్ వాడి కండలు పెంచుతున్నారు. కానీ చివరకు బెడ్ మీద ఫెయిల్ అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. 

ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, జిమ్ లో కసరత్తులు చేయాలని నిపుణులు చెబుతుంటారు. మనిషి ఆరోగ్యంగా ఉండి... మందు, సిగరెట్లు లాంటి అలవాట్లు లేకపోతే... వారికి సంతానం విషయంలో పెద్దగా సమస్యలేమీ తలెత్తవు.
అయితే... ఈ మధ్యకాలంలో... పురుషులు జిమ్ లో చేసే కసరత్తుల కారణంగానే వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు.

మీరు చదివింది నిజమే. కండలు పెంచాలనే కసితో ఎక్కువగా కసరత్తులు చేయడం, స్టెరాయిడ్స్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారట. దాంతో.. సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
దీన్ని 'మాస్‌మ్యాన్-పేసీ పారడాక్స్' అని పిలుస్తున్నారు. దీనివల్ల, సంతానోత్తి కోసం ప్రయత్నిస్తున్న జంటల్లో గుండెనొప్పి వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలను ఆకర్షించేందుకు కసర్తులు చేసి.. స్టెరాయిడ్స్ వాడి కండలు పెంచుతున్నారు. కానీ చివరకు బెడ్ మీద ఫెయిల్ అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
స్టెరాయిడ్స్ అతిగా వాడే వారిలో సెక్స్ సమయంలో కనీసం వీర్యం కూడా రావడం లేదని వారు చెబుతున్నారు.
అనబాలిక్ స్టెరాయిడ్స్ వాడకం వల్ల, వృషణాల్లో వీర్యం అధికంగా చేరుతోంది. మెదడులోని పిట్యుటరీ గ్రంధి భ్రమిస్తుంది. దీంతో, వీర్యం ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్. అనే హార్మోన్ల ఉత్పత్తిని పిట్యుటరీ గ్రంధి నిలిపివేస్తుంది.
బట్టతల బారిన పడకుండా వాడే కొన్నిరకాల మందుల వలన కూడా ఇలాంటి సమస్యే తలెత్తుతుందని అధ్యయనకారులు చెబుతున్నారు.
అంతేకాదు... ఈ మధ్యకాలంలో పని ఒత్తిడి, తీసుకునే ఆహారంలో లోపం, జీవన శైలి తదితర కారణాల వల్ల సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి.
మరీ ముఖ్యంగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య బాగా తగ్గిపోతోంది. దీంతో... పిల్లల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే... ఈ సమస్యకు టమాట పండుతో పరిష్కారం చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు.
టమాటలో వీర్య కణాల నాణ్యత పెంచే మిశ్రమ పదార్థం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వండిన టమాటాలను తినడం వల్ల వీర్య కణాల పరిమాణం, ఆకారంలో వృద్ధి ఉంటుందని తేలింది.
ఇందులో ఉండే లాక్టోలైకోపీన్​ అనే మిశ్రమ పదార్థం వీర్య కణాల అభివృద్ధికి దోహదం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.
ఆరోగ్యంగా ఉన్న పురుషుడు రోజుకి రెండు లేదా మూడు స్పూన్ల టమాట రసం తీసుకోవడం వల్ల వారిలొ వీర్య కణాల సంఖ్య బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
వివిధ రకాల ఔషధాలపై ప్రయోగాలు చేశారు బ్రిటన్​లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. 19 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన 60 మందిపై 12 వారాల పాటు పరిశోధనలు నిర్వహించారు.
పరిశోధనకు ముందు, తర్వాత వారి రక్త నమూనాలను సేకరించి విశ్లేషణ చేసి పలు విషయాలపై నిర్ధరణకు వచ్చారు. సాంపిల్‌ పరిమాణం చిన్నదైనప్పటికీ తమ పరిశోధనల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు.
కొన్ని పండ్లు, కూరగాయలు… ముఖ్యంగా టమాటాల్లో లైకోపీన్​ ఉంటుంది. ఈ పదార్థం ఉండటం వల్లనే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. లైకోపీన్​ వల్ల వీర్య కణాల సామర్థ్యం పెరుగుతుందని వీరు గమనించారు. వాటి వేగం కూడా 40 శాతం పెరుగుతుందని చెబుతున్నారు.
భవిష్యత్తులో  సంతానోత్పత్తికి సంబంధించిన చికిత్సల అవసరాన్ని తగ్గించడానికి తాజా శోధనలు సహాయపడతాయని పరిశోధకులు అంటున్నారు.
ఎందుకంటే పిల్లులు పుట్టని చాలా కేసులలో 40 శాతానికి పైగా  స్పెర్మ్ కౌంట్ లేదా వాటి పనితీరు కారణంగా ఉన్నాయి. అటువంటివారికి టమాట చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

click me!