వంటల్లో రుచికోసం, ఆరోగ్యం కోసం వాడే వెల్లుల్లి మీ సెక్స్ లైఫ్ లోనూ అద్భుతాలు చేస్తుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. మీ శృంగార జీవితం మరీ చప్పగా ఉన్నా, నెక్ట్స్ లెవల్ కి వెళ్లలేకపోతున్నామని అసంతృప్తితో ఉన్నా వెల్లుల్లి బెస్ట్ మెడిసిన్ అంటున్నారు నిపుణులు.
అన్యోన్య దాంపత్యానికి భార్యాభర్తల మధ్య శృంగారం ఎంతో అవసరం. దీనికోసం కపుల్స్ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. శృంగార సామర్ధ్యం పెరగడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అరటిపళ్ళూ, అవకాడోలూ, ఫిగ్స్ లాంటి ఫ్రూట్స్ మీ సెక్స్ లైఫ్ ను స్పైసీగా చేస్తాయి.
వెల్లుల్లిని రెగ్యులర్ గా డైట్ లో చేర్చితే వీటిల్లో ఉండే మినరల్స్, విటమిన్స్ రక్తప్రసరణని వృద్ధి చేస్తాయి. దీంతో మీ సెక్స్ లైఫ్ ఆరోగ్యవంతంగా మారుతుంది.
వీటితో పాటు భాగస్వామికి సర్ ప్రైజ్ ఇవ్వడం కూడా మంచిదే. దీనికోసం రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేసుకోండి. ఈ డిన్నర్ లో మెయిన్ గా వెల్లుల్లి బాగా ఉండేలా చూసుకోండి.
వెల్లుల్లి ఎందుకూ అంటే ముందు చెప్పుకున్నట్టు వెల్లుల్లి రక్తప్రసరణను పెంచుతుంది. దీంతోపాటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న మగవారికి బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి లంచ్ కంటే డిన్నర్ లో ఎక్కువగా వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. ఇలా వెల్లుల్లి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల సెక్స్ వపర్ పెరగడంతో పాటు, సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు.
వీటితో పాటు రోజూ ఒక చాక్లెట్ మీ శృంగార సామర్థ్యాన్ని అమాంతం పెంచేస్తుందట. అలాగే ఒక గ్లాస్ వైన్ కూడా మిమ్మల్ని రిలాక్స్ చేసి విజృంభించేలా చేస్తుందట. అలాగని గ్లాసులకు గ్లాసులు లాగించేయకుండా ఒకటి, రెండు గ్లాసులకే పరిమితం అవ్వాలని.. అప్పుడే మంచి రిజల్ట్ వస్తుందని అంటున్నారు.
ఒత్తిడి లేకుండా బాగా నిద్రపోవడం కూడా సెక్స్ లైఫ్ ను చాలా ఎంజాయ్ చేయడానికి తోడ్పడుతుందట. అందుకే నిద్రలేమి మీ దరి చేరకుండా చూసుకోండి. ఎన్ని ఒత్తిడులు, పనులు ఉన్నా.. టైం దొరికితే ఓ కునుకు తీయండి. ఇది పడకగదిలో మీరు రెచ్చిపోవడానికి బాగా పనికొస్తుంది.
కొంతమందిలో కాన్ఫిడెన్స్ ఉండదు. మేము సరిగా తృప్తి పరచలేమేమో అనుకుంటారు. బాడీమీద కాన్ఫిడెన్స్ ఉండదు. దీంతో శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు. సో దీన్నుండి బయటపడాలంటే మీలో మీకు నచ్చని వాటికంటే నచ్చిన వాటిమీద దృష్టి పెట్టండి. దీంతో మీమీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ సంసారం సుఖమయం అవుతుంది.